CM KCR : రాష్ట్రాలు ట్యాక్స్ తగ్గించాలా ? మీరు ఎందుకు పెంచారు ? కేసీఆర్ ఫైర్

పెట్రోల్ ధరలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రాలు ట్యాక్స్ తగ్గించాలని చెబుతున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు...

CM KCR : రాష్ట్రాలు ట్యాక్స్ తగ్గించాలా ? మీరు ఎందుకు పెంచారు ? కేసీఆర్ ఫైర్

Petrol Prices : పెట్రోల్ ధరలపై భారత దేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ చేసిన వ్యాఖ్యలపై తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ భగ్గుమన్నారు. ఒక ప్రధాన మంత్రి మాట్లాడే మాటలేనా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటని విమర్శించారు. దేశంలో కరోనా విజృంభణపై రాష్ట్రాల ముఖ్యమంత్రులతో ఏర్పాటు చేసిన సమావేశంలో ప్రధాని మోదీ పాల్గొని ప్రసంగించారు. ఈ సందర్భంగా పెట్రో ధరలపై కీలక వ్యాఖ్యలు చేశారు. పెట్రోల్ ధరల పెరుగుదలకు రాష్ట్ర ప్రభుత్వాల తీరే కారణమంటూ కీలక వ్యాఖ్యలు చేశారాయన. కేంద్రం ఎక్సైజ్ డ్యూటీ తగ్గించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. కేంద్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నా.. రాష్ట్ర ప్రభుత్వాలు ఎక్సైజ్ డ్యూటీ ఎందుకు తగ్గించడం లేదన్నారు.

Read More : CM KCR : జాతీయ రాజకీయాలపై సీఎం కేసీఆర్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ, బెంగాల్, తమిళనాడు, మహారాష్ట్ర, తెలంగాణ, కేరళ, జార్ఖండ్ రాష్ట్రాలు పెట్రోల్ పై వ్యాట్ తగ్గించడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్లీనరీ సమావేశం ముగింపులో సీఎం కేసీఆర్ మాట్లాడారు. పెట్రోల్ ధరలపై ప్రధాని చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు. రాష్ట్రాలు ట్యాక్స్ తగ్గించాలని చెబుతున్నారని.. ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గు చేటన్నారు. కేంద్ర ప్రభుత్వం ఎందుకు పెంచుతుందని.. లేని సెస్ లు ఎందుకు వడ్డిస్తున్నారని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు ఇంతవరకు పెంచలేదని.. 2015లో రౌండాఫ్ చేయడానికి ధరలను సవరించినట్లు వివరించారు. ధరలు పెంచింది బీజేపీ ప్రభుత్వమేనని.. పెంచనప్పుడు ఎలా తగ్గిస్తామన్నారు.

Read More : TRS 21st Plenary : టీఆర్ఎస్ 21వ ప్లీనరీలో ఆమోదం తెలుపనున్న తీర్మానాలు…

రాష్ట్రాలపై కుటిల దుష్ట రాజకీయ ప్రయత్నమని విమర్శించారు. దేశ చరిత్రలో ఇలాంటివి చూడలేదని, రాష్ట్ర ప్రభుత్వం ధరలు పెంచితే ఎందుకు పెంచుతున్నామో ప్రజలకు చెప్పే చేస్తున్నామన్నారు. ఆర్టీసీపై చమురు ధరలు చాలా ప్రభావితం చూపించాయని, ఉన్న సంస్థలను అమ్ముకోవాలా ? అని మరోసారి ప్రశ్నించారు. ఆర్టీసీ సంస్థను అమ్మితే రూ. 1000 కోట్లు బహుమతి ఇస్తామని ప్రకటించిన ఘనత మోదీకి దక్కుతుందని సెటైర్ వేశారు. కరోనా వ్యాప్తిపై మోదీ సమావేశం ఏర్పాటు చేసి.. ఈ విధంగా వ్యాఖ్యలు చేయడం అర్ధరహితమన్నారు సీఎం కేసీఆర్.