CM KCR : సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..ఆకస్మిక వరదల వెనుక విదేశీ కుట్రలు

క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతితో వరదలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో లేహ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు.

CM KCR : సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు..ఆకస్మిక వరదల వెనుక విదేశీ కుట్రలు

Kcr Bhadradri

CM KCR comments : ఆకస్మిక వరదలపై సీఎం కేసీఆర్ కీలక వ్యాఖ్యలు చేశారు. వరదల వెనుక విదేశీ కుట్రలు ఉన్నట్లు అనుమానం కల్గుతుందన్నారు. క్లౌడ్ బరస్ట్ అనే కొత్త పద్ధతితో వరదలు సృష్టిస్తున్నారని పేర్కొన్నారు. గతంలో లేహ్, ఉత్తరాఖండ్ లో క్లౌడ్ బరస్ట్ చేశారని గుర్తు చేశారు. ప్రస్తుతం గోదావరి పరివాహక ప్రాంతాల్లో కుట్రలు చేస్తున్నట్లు సమాచారం వస్తోందన్నారు.

అన్ని విభాగాల అధికారులు గొప్పగా పని చేశారని ప్రసంశించారు. ప్రాణ నష్టం జరుగకుండా చర్యలు తీసుకున్నారని తెలిపారు. వరద బాధిత కుటుంబాలకు రూ.10 వేల ఇవ్వనున్నట్లు ప్రకటించారు. వచ్చే రెండు నెలలు కుటుంబానికి 20 కిలోల చొప్పున బియ్యం అందజేస్తామని చెప్పారు. అప్పుడే ప్రమాదం తప్పిందని అనుకొవద్దని.. జాగ్రత్తగా ఉండాలని సూచించారు.

CM KCR : భద్రాచలంలో గోదావరి తల్లికి శాంతి పూజ చేసిన సీఎం కేసీఆర్

ఈనెల 29 వరకు ప్రతి రోజూ వర్షం కురుస్తుందని వాతావరణ శాఖ అధికారులు చెబుతున్నారని వెల్లడించారు. భద్రాచలం, పినపాకలో వరద ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు. వరద సమస్యకు పరిష్కారానికి వెయ్యి కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు పేర్కొన్నారు. 90 ఫీట్ల వరద వచ్చినా.. ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకుంటామన్నారు. ఎత్తైన ప్రదేశాల్లో మూడు వేల ఇళ్లతో కాలనీ నిర్మిస్తామని చెప్పారు.

వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే రద్దు చేసుకున్న సీఎం కేసీఆర్.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలానికి చేరుకున్నారు. గోదావరి నదికి సీఎం శాంతి పూజ చేశారు. కరకట్ట ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి వెళ్లారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన సీఎం కేసీఆర్ ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు.

CM KCR: రద్దయిన ఏరియల్ సర్వే.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలానికి వెళ్లారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుండి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకొని, వరద బాధితులను పరామర్శించారు.

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వేలాది మంది ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో గోదావరి వరదల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా ఆదివారం పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు.

Godavari Flood: శాంతించిన గోదావ‌రి.. భ‌ద్రాద్రి వ‌ద్ద 64అడుగుల‌కు చేరిన నీటిమ‌ట్టం.. ముంపులోనే లోత‌ట్టు ప్రాంతాలు

శనివారం సాయంత్రమే వరంగల్ జిల్లాకు చేరుకున్న కేసీఆర్ రాత్రి అక్కడే బస చేశారు. ఉదయం 8గంటలకు ఏరియల్ సర్వే ప్రారంభం కావాల్సివుండగా.. వర్షం కురుస్తుండటంతో ఏరియల్ సర్వేకు వాతావరణం అనుకూలంగా లేకుండా పోయింది. దీంతో వరంగల్ నుంచి ఏటూరునాగారం మీదుగా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు.