CM KCR : భద్రాచలంలో గోదావరి తల్లికి శాంతి పూజ చేసిన సీఎం కేసీఆర్

సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలానికి వెళ్లారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుండి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు.

CM KCR : భద్రాచలంలో గోదావరి తల్లికి శాంతి పూజ చేసిన సీఎం కేసీఆర్

Cm Kcr

CM KCR shanti puja : వరద ప్రభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే రద్దు చేసుకున్న సీఎం కేసీఆర్.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలానికి చేరుకున్నారు. గోదావరి తల్లికి సీఎం శాంతి పూజ చేశారు. కరకట్ట ప్రాంతాన్ని ఆయన పరిశీలించారు. అనంతరం వరద బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ వెళ్లనున్నారు. ఆదివారం ఉదయం హనుమకొండ నుంచి రోడ్డు మార్గం ద్వారా బయల్దేరిన సీఎం కేసీఆర్ ఏటూరునాగారం మీదుగా భద్రాచలం చేరుకున్నారు.

సీఎం కేసీఆర్ ఏటూరునాగారంలో ఆగాల్సి ఉన్నప్పటికీ నేరుగా భద్రాచలానికి వెళ్లారు. ఉప్పొంగి ప్రవహిస్తున్న గోదావరి నదీ ప్రవాహాన్ని, పరిసర ప్రాంతాలను గోదావరి బ్రిడ్జి మీద నుండి సీఎం కేసీఆర్ పర్యవేక్షించారు. అనంతరం గోదావరి వరద తాకిడికి గురైన కరకట్టను సీఎం కేసీఆర్ పరిశీలించారు. అక్కడ నుంచి వరద ముంపు బాధితుల కోసం ఏర్పాటు చేసిన పునరావాస కేంద్రానికి సీఎం కేసీఆర్ చేరుకొని, వరద బాధితులను పరామర్శిస్తారు.

CM KCR: రద్దయిన ఏరియల్ సర్వే.. రోడ్డు మార్గం ద్వారా భద్రాచలం చేరుకున్న సీఎం కేసీఆర్

ఎగువన కురుస్తున్న వర్షాలతో గోదావరి ఉగ్రరూపం దాల్చింది. పరివాహక ప్రాంతాలన్నీ నీటమునిగాయి. వేలాది మంది ప్రజలను అధికారులు పునరావాస కేంద్రాలకు తరలించారు. ఈ క్రమంలో గోదావరి వరదల కారణంగా నీట మునిగిన ప్రాంతాలను ఏరియల్ సర్వే ద్వారా ఆదివారం పరిశీలించేందుకు సీఎం కేసీఆర్ నిర్ణయించారు. శనివారం సాయంత్రమే వరంగల్ జిల్లాకు చేరుకున్న కేసీఆర్ రాత్రి అక్కడే బస చేశారు. ఉదయం 8గంటలకు ఏరియల్ సర్వే ప్రారంభం కావాల్సివుండగా.. వర్షం కురుస్తుండటంతో ఏరియల్ సర్వేకు వాతావరణం అనుకూలంగా లేకుండా పోయింది. దీంతో వరంగల్ నుంచి ఏటూరునాగారం మీదుగా సీఎం కేసీఆర్ రోడ్డు మార్గంలో భద్రాచలం చేరుకున్నారు.

కాగా, సీఎం కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా భద్రాచలంకు చేరుకోవాలని నిర్ణయించడంతో తొలుత భద్రతా సిబ్బంది వద్దని సూచించినట్లు తెలుస్తోంది. కానీ కేసీఆర్ రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని స్పష్టం చేయడంతో పోలీసులు ఊరుకులు పరుగుల మీద భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు. తీవ్ర నక్సలైట్ ప్రభావిత ప్రాంతాలైన ములుగు, ఏటూరు నాగారం, మంగపేట, ఏడూళ్ల బయ్యారం, మణుగూరు, అశ్వాపురం, సారపాక మీదుగా సీఎం కేసీఆర్ కాన్వాయ్ భద్రాచలానికి చేరుకుంది.

Godavari Flood: శాంతించిన గోదావ‌రి.. భ‌ద్రాద్రి వ‌ద్ద 64అడుగుల‌కు చేరిన నీటిమ‌ట్టం.. ముంపులోనే లోత‌ట్టు ప్రాంతాలు

ఏటూరు నాగారం నుంచి భద్రాచలం చేరుకొనే క్రమంలో వరద ముంపుకు గురైన ప్రాంతాలను సీఎం కేసీఆర్ పరిశీలించారు.ఈ సందర్భంగా అధికారులు వరద ముంపు తీవ్రతను సీఎం కేసీఆర్ కు వివరించారు. సీఎం కేసీఆర్‌ వెంట సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌, ముగ్గురు మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ఉన్నారు. గోదావరి ఉధృతి కారణంగా భద్రాద్రి రామాలయం చుట్టూ వరద నీరు చేరింది. పూర్తిగా అన్నదాన సత్రం నీటమునిగింది. కరకట్ట వద్ద మోటార్లు పనిచేయటం లేదు. మోటార్లు కాలిపోవటంతో రామాలయం వద్దకు లీకేజీ నీరు చేరింది.