CM KCR : రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపారు. నిన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు.

CM KCR : రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ కీలక సమావేశం

Kcr

Updated On : June 10, 2022 / 6:59 PM IST

CM KCR meeting : రాష్ట్రపతి ఎన్నికలపై సీఎం కేసీఆర్ సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్ లోని ప్రగతిభవన్ లో ఏర్పాటు చేసిన సమావేశానికి మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, టిఆర్ఎస్ ఫ్లోర్ లీడర్లు హాజరయ్యారు. రాష్ట్రపతి ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించనున్నారు. అలాగే తాజా దేశ రాజకీయాలపై సీఎం కేసీఆర్ చర్చించనున్నారు.

ఇప్పటికే దేశవ్యాప్తంగా వివిధ రాజకీయ పార్టీలతో చర్చలు ముఖ్యమంత్రి కేసీఆర్ జరిపారు. నిన్న ఫామ్ హౌస్ లో సీఎం కేసీఆర్ తో అయిన రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ భేటీ అయ్యారు. రాష్ట్రపతి ఎన్నికలు, దేశ రాజకీయాలపై, పలు కీలక అంశాలపై సీఎం కేసీఆర్, ప్రశాంత్ కిషోర్ చర్చించారు.

Revanth Reddy: రాష్ట్రపతి ఎన్నికల్లో మోదీ చెప్పినట్లు కేసీఆర్ వింటారు: రేవంత్ రెడ్డి

బీజేపీ యేతర రాష్ట్రపతి అభ్యర్థి ఎంపిక అంశంపై చర్చించినట్లు సమాచారం. ప్రగతి భవన్ లో జరుగుతున్న తాజా మీటింగ్ లో ఈ అంశాలపై చర్చ జరుగనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రపతి ఎన్నికల్లో ఎలా ముందుకెళ్లాలనే దానిపై చర్చిస్తున్నట్లు సమాచారం.