Vikram : కమల్‌కి, టామ్ క్రూజ్‌కి ఉన్న కామన్ పాయింట్ తెలుసా?? ఇద్దరూ ఇద్దరే..

లోక నాయకుడు కమల్‌ హాసన్, హాలీవుడ్స్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌కి ఇటీవల ఓ కామన్ పాయింట్ ఏర్పడింది. ఇద్దరికీ 60+ ఏజ్ అయితే మాత్రం ఏంటి? అదిరిపోయే సక్సెస్ తో కంబ్యాక్ అయ్యారు. అప్పుడెప్పుడో 36 ఏళ్ల నాటి..................

Vikram : కమల్‌కి, టామ్ క్రూజ్‌కి ఉన్న కామన్ పాయింట్ తెలుసా?? ఇద్దరూ ఇద్దరే..

Tom Cruiz

Kamasl Haasan :  లోక నాయకుడు కమల్‌ హాసన్, హాలీవుడ్స్ స్టార్ హీరో టామ్ క్రూజ్‌కి ఇటీవల ఓ కామన్ పాయింట్ ఏర్పడింది. ఇద్దరికీ 60+ ఏజ్ అయితే మాత్రం ఏంటి? అదిరిపోయే సక్సెస్ తో కంబ్యాక్ అయ్యారు. అప్పుడెప్పుడో 36 ఏళ్ల నాటి సినిమాల సీక్వెల్స్ తో సూపర్ హిట్లు కొట్టారు. 60లలో సూపర్ సక్సెస్ కొట్టి ఇంకా తమ స్టామినా తగ్గలేదని ప్రూవ్ చేసుకున్నారు ఈ ఇద్దరు సీనియర్ హీరోలు. ఈ సీనియర్ హీరోలు యంగ్ హీరోలతో పోటీ పడుతున్నారు. హాలీవుడ్ లో టామ్ క్రూజ్, తమిళ్ లో కమల్ హాసన్ నిజానికి కో ఇన్సిడెన్స్ అయినా ఈ ఇద్దరు సీనియర్ స్టార్ హీరోలు 35 ఏళ్ల నాటి సినిమాల సీక్వెల్స్ తో సూపర్ హిట్లుకొట్టి హాట్ టాపిక్ అయ్యారు.

తమిళ్ లో దాదాపు 5 ఏళ్ల తర్వాత బ్లాక్ బస్టర్ హిట్ తో రికార్డులు తిరగరాస్తున్న సినిమా విక్రమ్. ఇప్పటికే 450 కోట్ల కలెక్షన్లను సాధించిన కమల్ హాసన్ విక్రమ్ మూవీ 1986లో వచ్చిన ఏజెంట్ విక్రమ్ 007 మూవీకి సీక్వెలే అని టాక్ నడుస్తోంది. అందుకే లేటెస్ట్ గా కమల్ హాసన్ కూడా విక్రమ్ 3 పార్ట్ వస్తోందని అనౌన్స్ చేశారు. లోకేష్ కనగరాజ్ డైరెక్షన్లో వచ్చిన కంప్లీట్ యాక్షన్ ఎంటర్ టైనర్ విక్రమ్ కి, కమల్ హాసన్ కెరీర్ స్టార్టింగ్ లో వచ్చిన ఏజెంట్ విక్రమ్ కి చాలా పోలికలున్నాయని సోషల్ మీడియాలో ఫాన్స్ హడావిడి చేస్తున్నారు. చాలా కాలంనుంచి సరైన సక్సెస్ లేక సఫర్ అవుతున్న కమల్ హాసన్ తన సినిమా విక్రమ్ కి సీక్వెల్ చేసి దాంతోనే బ్లాక్ బస్టర్ అందుకున్నారని విక్రమ్ 3తో నెక్ట్స్ లెవల్ సక్సెస్ గ్యారంటీ అంటున్నారు ఫాన్స్.

Gangavva : మై విలేజ్ షో అంటూ గంగవ్వతో ప్రోగ్రాం ప్లాన్ చేసిన నెట్‌ఫ్లిక్స్..

కమల్ హాసన్ లానే 36 ఏళ్ల క్రితం వచ్చిన సినిమాకి సీక్వెల్ తోనే సూపర్ హిట్ కొట్టిన 60 ఏళ్ల హాలీవుడ్ స్టార్ హీరో టామ్ క్రూజ్. 1986లో కెరీర్ స్టార్టింగ్ తో టాప్ గన్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ కొట్టడమే కాదు హ్యాండ్సమ్ యాక్షన్ హీరోగా ఫేమస్ అయిపోయిన టామ్ ఆ తర్వాత హాలీవుడ్ స్టార్ హీరోగా ఎదిగాడు. రీసెంట్ గా రిలీజ్ అయిన టాప్ గన్ సీక్వెల్ అయిన టాప్ గన్ మెవరిక్ తో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నారు. ఇలా 36 ఏళ్ల తర్వాత సీక్వెల్స్ తో ఈ 60 ఏళ్ల సీనియర్లు లాంగ్ గ్యాప్ తర్వాత హ్యూజ్ సక్సెస్ అందుకున్నారు. దీంతో వీరిద్దర్నీ కలిపేసి ఇద్దరూ ఇద్దరే అంటూ కామెంట్స్, పోస్టులు చేసేస్తున్నారు నెటిజన్లు.