Mallikarjun Kharge: నూతన పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

మోదీ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ ఔచిత్యాన్ని అగౌరవపరుస్తోంది. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజంగా కుదించబడింది. కేవలం ఎన్నికల కోసం దళిత, గిరిజన వర్గాల నుంచి భారత రాష్ట్రపతిని కేంద్రం ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది

Mallikarjun Kharge: నూతన పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడంపై విమర్శలు గుప్పించిన కాంగ్రెస్ చీఫ్ ఖర్గే

mallikarjun kharge

New Parliament Building: నూతనంగా నిర్మించిన పార్లమెంట్ భవనాన్ని ఈ నెల 28న ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రారంభించనున్నారు. అయితే పార్లమెంట్ భవనాన్ని మోదీ ప్రారంభించడం పట్ల కాంగ్రెస్ పార్టీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. రాజ్యాంగం ప్రకారం.. అత్యున్నత అధికారం కలిగిన వ్యక్తి భారత రాష్ట్రపతని, రాష్ట్రపతి చేత నూతన పార్లమెంట్ భవనాన్ని ప్రారంభించాలని కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే (Mallikarjun Kharge) డిమాండ్ చేశారు. రాష్ట్రపతి చేత కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఔచిత్యానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీకని ఆయన అన్నారు.

Madhya Pradesh : జాతీయ పక్షి నెమలిని హింసించి చంపిన యువకుడు .. కఠినంగా శిక్షించాలని డిమాండ్

ఈ విషయమై సోమవారం ఆయన మాట్లాడుతూ ‘‘నూతన పార్లమెంట్ భవనం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని ప్రారంభించాలి. అత్యున్నత రాజ్యాంగ అధికారం కలిగివున్న వ్యక్తి భారత రాష్ట్రపతి. రాష్ట్రపతి మాత్రమే ప్రభుత్వం, ప్రతిపక్షం ,ప్రతి పౌరునికి ప్రాతినిధ్యం వహిస్తుంది. రాష్ట్రపతి చేత కొత్త పార్లమెంటు భవనాన్ని ప్రారంభించడం ప్రజాస్వామ్య విలువలు, రాజ్యాంగ ఔచిత్యానికి ప్రభుత్వ నిబద్ధతకు ప్రతీక’’ అని ఖర్గే అన్నారు.

Bandi Sanjay: బీఆర్ఎస్‌కు బీజేపీనే ప్రత్యామ్నాయం.. కాంగ్రెస్ పార్టీపై బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు

ఇదే సందర్భంలో మోదీ ప్రభుత్వంపై ఆయన తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘మోదీ ప్రభుత్వం పదే పదే రాజ్యాంగ ఔచిత్యాన్ని అగౌరవపరుస్తోంది. బీజేపీ-ఆర్‌ఎస్‌ఎస్ ప్రభుత్వ హయాంలో భారత రాష్ట్రపతి కార్యాలయం టోకెనిజంగా కుదించబడింది. కేవలం ఎన్నికల కోసం దళిత, గిరిజన వర్గాల నుంచి భారత రాష్ట్రపతిని కేంద్రం ఎన్నుకున్నట్లు కనిపిస్తోంది. నూతన పార్లమెంట్ శంకుస్థాపన కార్యక్రమానికి మాజీ రాష్ట్రపతి కోవింద్‌కు ఆహ్వానం అందలేదు. భారత రాష్ట్రపతి ద్రౌపది ముర్ముని కొత్త పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానించడం లేదు. రిపబ్లిక్ ఆఫ్ ఇండియాకు సుప్రీం లెజిస్లేటివ్ బాడీ పార్లమెంట్. మోదీ ప్రభుత్వం రాజ్యాంగాన్ని గౌరవించాలి’’ అని అన్నారు.

YCP MLA Perni nani : రాజకీయాల నుంచి రిటైర్ అవుతున్నా : మాజీ మంత్రి పేర్ని నాని సంచలన ప్రకటన

ఇక ఆదివారం రాహుల్ గాంధీ సైతం ఈ అంశాన్ని లేవనెత్తారు. పార్లమెంట్ భవనాన్ని ప్రధానమంత్రి ప్రారంభిస్తుండడంపై కాంగ్రెస్ కీలక నేత రాహుల్ గాంధీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. పార్లమెంట్ భవనాన్ని భారత రాష్ట్రపతి ప్రారంభించాలని, ప్రధానమంత్రి కాదని ఆయన అన్నారు. ఆదివారం తన ట్విట్టర్ ఖాతా ద్వారా రాహుల్ స్పందిస్తూ ‘‘నూతన పార్లమెంట్ భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభించబడాలి. ప్రధానమంత్రి కాదు’’ అని హిందీలో ట్వీట్ చేశారు.

Wrestlers Protest: బ్రిజ్ భూషణ్ నార్కో టెస్ట్ సవాల్‌కు మేం సిద్ధం.. అలా అయితేనే అంటూ షరతు పెట్టిన రెజ్లర్లు

ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ సైతం స్పందించారు. మూడు రోజుల క్రితం ఆయన ట్విట్టర్ ద్వారా స్పందిస్తూ ‘‘ప్రధానమంత్రి పార్లమెంటును ప్రారంభిండం ఏంటి? ఆయన శాసన సభకు కాదు కార్యనిర్వాహక వర్గానికి అధిపతి. రాజ్యంగం ప్రకారం.. మనకు అధికారాల విభజన స్పష్టంగా ఉంది. పార్లమెంట్‭కు అధిపతులు లోక్‭సభ స్పీకర్, రాజ్యసభ చైర్మన్. వారిచేత ప్రారంభించవచ్చు. పార్లమెంట్ నూతన భవనం ప్రజల సొమ్ముతో నిర్మించారు. ప్రధానమంత్రి తన స్నేహితుల డబ్బుతో నిర్మించినట్లు ఎందుకు ప్రవర్తిస్తున్నారు?’’ అని ట్వీట్ చేశారు.