Congress Party: ఢిల్లీలో బంగ్లా ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి కేంద్రం నోటీసులు

ఢిల్లీలోని చాణక్యపురిలో కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన "బంగ్లా నంబర్ సి-2/109" బంగ్లాను ఉన్నపళంగా ఖాళీ చేయాలంటూ..కేంద్రం ఆదేశించింది

Congress Party: ఢిల్లీలో బంగ్లా ఖాళీ చేయాలంటూ కాంగ్రెస్ పార్టీకి కేంద్రం నోటీసులు

Congress

Updated On : April 2, 2022 / 9:34 PM IST

Congress Party: జాతీయ ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ కు కేంద్ర గృహనిర్మాణ, పట్టణ వ్యవహారాల మంత్రిత్వ శాఖ షాక్ ఇచ్చింది. ఢిల్లీలోని చాణక్యపురిలో కాంగ్రెస్ పార్టీకి కేటాయించిన “బంగ్లా నంబర్ సి-2/109” బంగ్లాను ఉన్నపళంగా ఖాళీ చేయాలంటూ..కేంద్రం ఆదేశించింది. ఈమేరకు రాజకీయ పార్టీలు, మంత్రులు, పార్లమెంటు సభ్యులకు బంగ్లాల కేటాయింపును పర్యవేక్షించే డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ (DoE) కాంగ్రెస్ పార్టీకి నోటీసులు పంపింది. ఆ బంగ్లాను కాంగ్రెస్ పార్టీకి కేటాయించారని.. అయితే కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ కార్యదర్శి విన్సెంట్ జార్జ్ అందులో అనధికారికంగా నివసిస్తున్నట్లు సంబంధితశాఖ అధికారుల దృషికి వచ్చింది. దీనిపై వివరణ ఇవ్వాలంటూ అధికారులు కాంగ్రెస్ పార్టీకి నోటీసులు ఇచ్చారు.

Also read:Arvind Kejriwal: అవినీతిలేకుండా చేస్తా ఆమ్ ఆద్మీ పార్టీకి ఒక్క అవకాశం ఇవ్వండి: గుజరాత్‌లో అరవింద్ కేజ్రీవాల్

పబ్లిక్ ఆవరణ చట్టం 1971లోని సెక్షన్ 3బిలోని సబ్ సెక్షన్ (1)కు అనుగుణంగా 3 రోజుల 02:30 గంటలలోపు సరైన వివరణ ఇవ్వాలంటూ నోటీసులో ఉన్న వ్యక్తికి సమన్లు జారీ చేశారు. నోటీసులో పేర్కొనబడ్డ వ్యక్తులు నేరుగా గానీ..లేదా షో కాజ్ లో పేర్కొన్న అంశాలపై వివరణ ఇవ్వగల సామర్ధ్యం ఉన్న ప్రతినిధులతో కలిసి రావాలని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. అలా రాని పక్షంలో తీర్పును ఏకపక్షంగా పరిగణించాల్సి ఉంటుందని నోటీసులో వివరించారు. కాగా కాంగ్రెస్ పార్టీ కేటాయింపుల నుంచి ఈ భవనాన్ని తొలగిస్తూ 2013లోనే అధికారులు ఉత్తర్వులు జారీచేయడం గమనార్హం.

Also read:Bandi Sanjay: ప్రాణహిత పుష్కరాలకు తక్షణమే నిధులు కేటాయించాలి: బండి సంజయ్

అయితే అప్పటి నుంచి అందులో కాంగ్రెస్ పార్టీ సంబంధీకులు నివాసం ఉంటున్నారు. ఈక్రమంలో భవనంపై ఇప్పటివరకు రావాల్సిన అద్దె మొత్తం రూ.3 కోట్లకు పైగా ఉన్నట్లు డైరెక్టరేట్ ఆఫ్ ఎస్టేట్స్ గుర్తించింది. ఈమొత్తాన్ని చెల్లించి భవనాన్ని ఖాళీ చేయాలంటూ ఫిబ్రవరి నెలలో నోటీసులు ఇచ్చారు. ఇక చాణక్యపురిలోని ఈ భవనంతో పాటు..కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యాలయం, సోనియా గాంధీ అధికారిక నివాస భవనం సైతం అద్దె బకాయిలు ఉన్నట్లు అధికారులు గుర్తించారు.

Also read:India-Australia: భారత్ – ఆస్ట్రేలియా మధ్య కీలక ఒప్పందాలు: వాణిజ్య, వృత్తి, విద్యా విసాలు సులభతరం