Amit Shah: సీఎం సారు.. కాస్త తడబడ్డారు, అమిత్ షాను ప్రధాని చేసేశారు!

అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాస్త తడబడ్డారు. పబ్లిక్ ఈవెంట్ లో అమిత్ షాను ప్రధాని అంటూ సంబోధించడంతో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా దొరికిపోయారు. అధికార పార్టీ అయిన బీజేపీ..

Amit Shah: సీఎం సారు.. కాస్త తడబడ్డారు, అమిత్ షాను ప్రధాని చేసేశారు!

Amit Shah

Amit Shah: అస్సాం సీఎం హిమంత్ బిశ్వ శర్మ కాస్త తడబడ్డారు. పబ్లిక్ ఈవెంట్ లో అమిత్ షాను ప్రధాని అంటూ సంబోధించడంతో ప్రతిపక్షం కాంగ్రెస్ పార్టీకి అడ్డంగా దొరికిపోయారు. అధికార పార్టీ అయిన బీజేపీ.. నరేంద్ర మోదీకి బదులు అమిత్ షాను ప్రధాని చేయాలనుకుంటుందా అంటూ సోషల్ మీడియా వేదికగా ప్రశ్నిస్తున్నారు.

గువాహటిలోని ఖానాపరాలోని వెటర్నరీ కాలేజ్ ప్లేగ్రౌండ్ లో మంగళవారం కేంద్ర హోం మంత్రి సమక్షంలో రాష్ట్రంలో బీజేపీ నేతృత్వంలో వార్షికోత్సవం సందర్భంగా జరిగిన బహిరంగ సభలో ఈ ఘటన జరిగింది.

తేజ్‌పూర్ ఎంపీ పల్లబ్ లోచన్ దాస్ పలు మార్లు పబ్లిక్ మీటింగుల్లోనే సర్బానందా సోనోవాల్ సీఎంగా ఉన్నప్పుడు హిమంత బిశ్వ శర్మ సీఎం అంటూ చెప్పేవారు. దీనిని బట్టి అమిత్ షా కూడా ప్రధాని కాబోతున్నారా.. ఇది దానికి సంబంధించిన ప్రచార కార్యక్రమమేనా అంటూ ప్రశ్నిస్తుంది కాంగ్రెస్.

Read Also: గంగూలీ ఇంటికి అమిత్ షా.. బీజేపీలో చేరుతారా?

“సర్బానంద్‌సన్వాల్ జీ సీఎంగా ఉన్నప్పుడు, ఎంపీ పల్లబ్‌లోచందాస్ అనేక సందర్భాల్లో క్యాబినెట్ మంత్రి హిమంతబిస్వాని బహిరంగంగా సీఎం అంటూ పలుమార్లు ప్రస్తావించారు! అలాగే BJP తన తదుపరి పీఎం అభ్యర్థి స్థానంలో నియమించిందా? లేదా AmitShahని PM గా ప్రమోట్ చేయడానికి ప్రచారం ప్రారంభించారా?” అంటూ అస్సాం కాంగ్రెస్ ట్వీట్ చేసింది.

“కాంగ్రెస్ అస్సాంలో పూర్తిగా స్థానాన్ని కోల్పోయింది. బీజేపీతో రాజకీయంగా పోరాడేందుకు సమస్యలేవీ లేవు. కాబట్టి ఏదొక సమస్య లేనిదని ధ్వజమెత్తడానికి ప్రయత్నిస్తోంది. అనుకోకుండా మాట జరగడమనేది ఎవరితోనైనా జరగవచ్చు, ”అని గోస్వామి మీడియాతో మాట్లాడుతూ చెప్పారు.