Hyderabad : వివాదమవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫైన్లు..స్పీకర్ కు తప్పని తిప్పలు

హైదరాబాద్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు.వాహనాలపై స్టిక్కర్లు ఉంటే ఫైన్లతో బాదేస్తున్నారు. డాక్టర్స్, అడ్వకేట్స్, ప్రెస్ ఇలా వాహనంపై ఏస్టిక్కర్ ఉన్నా ఫైన్ కట్టాల్సిందేనందే

Hyderabad : వివాదమవుతున్న హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసుల ఫైన్లు..స్పీకర్ కు తప్పని తిప్పలు

Controversial Hyderabad Traffic Police Fines..

Controversial Hyderabad traffic police fines..Pines if the vehicle has a sticker : హైదరాబాద్ పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. వాహనాలపై స్టిక్కర్లు ఉంటే ఫైన్లతో బాదేస్తున్నారు. డాక్టర్స్, అడ్వకేట్స్, ప్రెస్ ఇలా వాహనంపై ఏ స్టిక్కర్ ఉన్నా ట్రాఫిక్ పోలీసులు ఐడోంట్ కేర్ అంటున్నారు. వాహనాల్ని ఆపేసి ఫైన్లతో నానా ఇబ్బంది పెడుతున్నారు. వారి ఐడి కార్డులు చూపించినా ఏమాత్రం పట్టించుకోవట్లేదు.ఫైన్ కట్టాల్సిందేనంటున్నారు. వాహనదారులు జేబులు గుల్ల చేస్తున్నారు.రోడ్లపై వాహనాలకు ఆపేసి స్టిక్కర్లు పీకి పారేసి ఫైన్ కట్టు లేదా వాహనం వదిలేసి పో కేసు రాసేస్తాం అంటు బెదిరిస్తున్నారు. రూల్స్ ఇది కట్టాల్సిందే నంటూ పోలీసు జులం చూపిస్తున్నారు. దీంతో వాహనదారులు ఎందుకొచ్చిన గోలరా బాబూ అని ఫైన్లు కట్టేస్తున్నారు.

దీంతో కొంతమంది వాహనదారులు భయపడి ఫైన్ కట్టేసి పోతున్నారు. మరికొంతమంది మాత్రం ధైర్యం చేసి ఏ రూల్ ప్రకారం ఫైన్ కట్టాలో చెప్పండి అని ప్రశ్నిస్తున్నారు. అలా ప్రశ్నించటానికి పోలీసులు సహించలేకపోతున్నారు.సమాధానం మాత్రం చెప్పకుండా ఫైన్ కట్టు లేదా బండి వదిలేఫో అంటూ నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారని వాహనదారులు వాపోతున్నారు.

హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు తీరు ఇలా ఉంటే రవాణాశాఖ మాత్రం స్టిక్కర్ల తొలగింపుకు సంబంధించి ఎటువంటి రూల్స లేవని చెబుతోంది. సుప్రీంకోర్టు రూల్ ప్రకారం కేవలం కారు విండోస్ బ్లాక్ ఫిల్మ్ లకే వరకు రూల్స్ ఉన్నాయిన రవాణాశాఖ స్పష్టం చేసింది. కానీ హైదరాబాద్ పోలీసులు మాత్రం డాక్టర్స్, అడ్వకేట్స్, ప్రెస్ ఇలా ఏ స్టిక్కర్లు పనిచేయవని చెబుతు ఫైన్లు వసూలు చేస్తున్నారు. ఇలా అడ్డగోలుగా పోలీసులు ఫైన్లు వేస్తుండటంతో వాహనదారులు తీవ్ర విమర్శలు చేస్తున్నారు ట్రాఫిక్ పోలీసులపైన. పోలీసుల తీరుపై వాహనదారులు తీవ్రంగా మండిపడుతున్నారు.

పైగా ట్రాఫిక్ పోలీసులు తీరు సామాన్యులకే కాదు ఎవరైనా ఒక్కటే అన్నట్లుగా ఏకంగా తెలంగాణ స్పీకర్ వాహనాన్ని కూడా అడ్డుకుని ఫైన్ వేసేశారు. దీంతో స్పీక్ ట్రాఫిక్ పోలీసుల తీరుపై స్పీకర్ పోచారం సీపీకి ఫోన్ చేసి తీవ్ర అసహనం వ్యక్తంచేశారు. హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు అడ్డగోలుగా విధిస్తున్న జరిమానాలతో తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస రెడ్డికి కూడా తిప్పలు తప్పని పరిస్థితి ఏర్పడింది.