Odisha Train Accident : రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్ర ,రాష్ట్రాలు చెరో రూ.10లక్షలు పరిహారం ప్రకటన

క్షతగాత్రుల్ని తరలింపులోను..చికిత్స అందించటంలోను భారత ఆర్మీ రంగంలోకి దిగింది. ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వాలు చెరో రూ.10 లక్షలు ప్రకటించాయి.

Odisha Train Accident  : రైలు ప్రమాద మృతుల కుటుంబాలకు కేంద్ర ,రాష్ట్రాలు చెరో రూ.10లక్షలు పరిహారం ప్రకటన

trains accident

Odisha Train Accident : ఒడిశాలో ఘోర రైలు ప్రమాదం సంభవించింది. మృతుల సంఖ్య అంతకంతకు పెరుగుతోంది. ఇప్పటివరకు మృతుల సంఖ్య ఇప్పటి వరకు అందిన సమాచారం మేరకు 238కు చేరింది. 100మందికిపైగా తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం తీవ్రంగా ఉంది కాబట్టి మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశముంది.గాయపడినవారిని చికిత్స కోసం సారో, గోపాల్ పూర్, కంఠపాడ ఆస్పత్రులకు తరలించారు. ఇంకా తరలిస్తున్నారు.

క్షతగాత్రుల్ని తరలింపులోను..చికిత్స అందించటంలోను భారత ఆర్మీ రంగంలోకి దిగింది. సహాయక చర్యల్లో ఈస్టర్న్ కమాండ్ నుంచి అంబులెన్సులు, ఆర్మీ మెడికల్ ఇంజనీరింగ్ బృందాలు పాల్గొన్నాయి. ఈ రైలు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయిన మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించాయి. మృతుల కుటుంబాలకు ఒడిశా ప్రభుత్వం రూ.10 లక్షలు ప్రకటించింది. అలాగే కేంద్రం కూడా రూ.10లక్షలు ప్రకటించింది. తీవ్రంగా గాయపడినవారికి రూ.2లక్షలు,స్వల్పంగా గాయపడినవారికి రూ.50వేలు ప్రకటించాయి.

 

 

ప్రజల సహాయార్థం అధికారులు ప్రకటించిన హెల్ప్‌లైన్ నెంబర్లు:
హౌరా హెల్ప్‌లైన్ నెంబర్ – 033 – 26382217
ఖరగ్‌పూర్- 8972073925, 9332392339
బాలాసోర్- 8249591559, 7978418322
షాలీమార్ – 9903370746

ఏపీకి సంబంధించి..
విశాఖ హెల్ప్ లైన నంబర్లు : 08912-746330, 08912-744619
విజయనగరం : 08922-221202, 08922-221206
విజయవాడ : 0866-2576924
రాజమహేంద్రవరం : 0883-2420541