Omicron Variant: భారత్‌‌లో ఒమిక్రాన్ భయం, రెండు డోసులు తీసుకున్నా సోకుతోంది!

ఒకవైపు ఒమిక్రాన్‌ ఉపద్రవం ముంచుకొస్తుండగా దేశంలో మాస్కు వాడకం భారీగా తగ్గిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లిళ్లు, వేడుకల్లో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని...

Omicron Variant: భారత్‌‌లో ఒమిక్రాన్ భయం, రెండు డోసులు తీసుకున్నా సోకుతోంది!

Omicron Delhi

Delhi Reports 2nd omicron variant : భారత్‌ను ఒమిక్రాన్‌ వేరియంట్‌ భయం వెంటాడుతోంది. ఫుల్‌ డోస్‌ టీకా తీసుకున్నా.. వదలడంలేదు ఒమిక్రాన్‌. రోజురోజుకు ఒమిక్రాన్ కేసులు పెరిగిపోతున్నాయి. ఢిల్లీలో మరో ఒమిక్రాన్‌ కేసు నమోదైంది. రెండు డోసుల వ్యాక్సిన్‌ తీసుకున్న వ్యక్తికి ఒమిక్రాన్‌ నిర్ధారణయింది. దీంతో ఢిల్లీలో ఒమిక్రాన్‌ కేసుల సంఖ్య 2కు చేరింది. ఢిల్లీలో నమోదైన తాజా ఒమిక్రాన్‌ కేసుతో దేశంలో ఒమిక్రాన్‌ వేరియంట్‌ కేసుల సంఖ్య 33కు పెరిగింది. అటు కరోనా హబ్‌గా పేరున్న మహారాష్ట్రను కరోనా కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్ వేరియంట్ వణికిస్తోంది. శుక్రవారం ఒక్కరోజే మహారాష్ట్రలో 7 ఒమిక్రాన్ కేసులు నమోదయ్యాయి. ధారవిలో తొలి ఒమిక్రాన్‌ కేసు నమోదు కావడంతో ఆందోళన వ్యక్తమవుతోంది. పాజిటివ్ వచ్చిన వ్యక్తి కాంటాక్టులను ట్రేస్ చేస్తున్నారు అధికారులు. కరోనా కట్టడికి ముంబయిలో రెండ్రోజుల పాటు 144సెక్షన్‌ విధించారు. మహారాష్ట్రలో ఇప్పటివరకూ 17 ఒమిక్రాన్‌ కేసులు బయటపడ్డాయి.

Read More : Delhi Border : ఖాళీ అవుతున్న సరిహద్దులు…సొంతూళ్ళకు వెళుతున్న రైతన్నలు

పింప్రీ- చించ్వాడలో ఒమిక్రాన్‌ సోకిన నలుగురిలో ముగ్గురు భారత సంతతికి చెందిన నైజీరియా మహిళలు ఉన్నారు. ఒమిక్రాన్ సోకిన ఏడుగురులో నలుగురు పూర్తిస్తాయి టీకా తీసుకున్నారని అధికారులు వెల్లడించారు. ఇప్పటివరకు దేశంలో అత్యధికంగా ఒమిక్రాన్‌ కేసులు మహారాష్ట్రలోనే నమోదయ్యాయి. మొత్తం ఒమిక్రాన్ కేసుల్లో 50శాతానికి పైగా ఒమిక్రాన్‌ కేసులు మహారాష్ట్రలోనే రికార్డయ్యాయి. భారత్‌లో కరోనా సెకండ్‌వేవ్‌ సమయంలో కూడా ఇలాంటి పరిస్థితులే నెలకొన్నాయి. ఇక కరోనా ఫస్ట్‌వేవ్‌ సమయంలో మహారాష్ట్ర కొవిడ్‌ హాట్‌స్పాట్‌గా ఉన్న ధారావిలో తొలి ఒమిక్రాన్ కేసు రికార్డయింది. టాంజానియా నుంచి ముంబైలోని ధారావికి వ‌చ్చిన 45 ఏళ్ల వ్యక్తికి ఒమిక్రాన్ సోకింది. జనసాంద్రత ఎక్కువగా ఉండే ధారావిలో ఒమిక్రాన్‌ తొలి కేసు బయటపడడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. అతని కాంటాక్ట్స్‌ను ట్రేస్‌ చేస్తున్నారు ముంబై మున్సిప‌ల్ అధికారులు. ఎట్ రిస్క్ దేశాల నుంచి వ‌చ్చే ప్రయాణికుల‌ను పూర్తిస్థాయిలో ఎయిర్‌పోర్ట్‌లో ప‌రీక్షలు చేస్తున్నారు.

Read More : Jawan Sai Teja : ఆదివారం సాయితేజ అంత్యక్రియలు

అయితే, టాంజానియా ఎట్ రిస్క్ దేశాల జాబితాలో లేక‌పోవ‌డంతో ఒమిక్రాన్ సోకిన వ్యక్తి ఎలాంటి ఇబ్బందులు లేకుండా బ‌య‌ట‌కు వ‌చ్చాడు. అయితే ఆ తర్వాత అతినికి పరీక్షలు చేయగా కరోనా వచ్చినట్లు తేలింది. ప‌రీక్షలకు పంపిన శాంపిల్స్‌ను జీనోమ్ సీక్వెన్సింగ్‌కు పంప‌గా అక్కడ ఒమిక్రాన్‌గా నిర్థార‌ణయింది. వెంట‌నే అతడిరి ఐసోలేష‌న్‌కు పంపారు. మురికివాడ‌ ధారావిలో ఒమిక్రాన్ కేసు వెలుగు బయటపడడంతో ఆ ప్రాంతం మొత్తం వ‌ణికిపోయింది. రెండున్నర చ‌ద‌ర‌పు కిలోమీట‌ర్ల విస్తీర్ణంలో ఏడు ల‌క్షల‌కు పైగా జ‌నాభా క‌లిగిన ప్రాంతం కావడంతో అక్కడి ప్రజలకు ఒమిక్రాన్‌ టెన్షన్‌ పట్టుకుంది. ఇక ఒకవైపు ఒమిక్రాన్‌ ఉపద్రవం ముంచుకొస్తుండగా దేశంలో మాస్కు వాడకం భారీగా తగ్గిందని కేంద్రం ఆందోళన వ్యక్తం చేసింది. పెళ్లిళ్లు, వేడుకల్లో తప్పనిసరిగా కరోనా నిబంధనలు పాటించాలని స్పష్టం చేసింది కేంద్రం. సెకండ్‌వేవ్‌కి ముందు కూడా మాస్కు వాడకం తగ్గిందని గుర్తుచేసింది. రాష్ట్రాలు కఠిన నిబంధనలు, జరిమానాలు విధించడం ద్వారా మాస్కుల వినియోగం పెంచాలని ఆదేశించింది.