Covaxin Kids : త్వరలోనే చిన్నారులకు కొవాగ్జిన్.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్

కరోనా నియంత్రణ కోసం నిరాటంకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండిన వారికే అందించిన వ్యాక్సిన్లు.. ఇకపై 18 ఏళ్ల లోపు చిన్నారులకు

Covaxin Kids : త్వరలోనే చిన్నారులకు కొవాగ్జిన్.. భారత్ బయోటెక్ గుడ్ న్యూస్

Covaxin Kids

Updated On : September 21, 2021 / 9:32 PM IST

Covaxin Kids : కరోనా నియంత్రణ కోసం నిరాటంకంగా సాగుతున్న వ్యాక్సినేషన్ కార్యక్రమంలో మరో ముందడుగు పడబోతోంది. ఇప్పటివరకు 18 ఏళ్లు నిండిన వారికే అందించిన వ్యాక్సిన్లు.. ఇకపై 18 ఏళ్ల లోపు చిన్నారులకు కూడా అందుబాటులోకి రానున్నాయి. ఈ మేరకు కోవాగ్జిన్ తయారీ సంస్థ భారత్ బయోటెక్ వెల్లడించింది.

Vaccination అలర్ట్.. వ్యాక్సిన్ తీసుకున్న 20 రోజుల్లోపు ఈ లక్షణాలు కనిపిస్తే జాగ్రత్త పడాల్సిందే

త్వరలో చిన్న పిల్లలకు కూడా అందించేందుకు కొవాగ్జిన్‌ను సిద్ధం చేస్తున్నట్లు భారత్ బయోటెక్ తెలిపింది. ఇప్పటికే 2, 3 దశల ట్రయల్స్ పూర్తయ్యాయని, దానికి సంబంధించిన ఫలితాలను భారత ఔషధ నియంత్రణ సంస్థ (DCGI)కు వచ్చే వారానికి అందజేస్తామన్నారు. 18 ఏళ్లు నిండిన వారికి ఇచ్చే డోసు కన్నా ఇది తక్కువగా ఉంటుందని తెలిపింది.

మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో భారత బయోటెక్ సీఎండీ కృష్ణ ఎల్లా మాట్లాడారు. ‘ట్రయల్స్ విజయవంతంగా పూర్తయ్యాయి. డీసీజీఐ ఆమోదం లభించిన వెంటనే అందరికీ అందుబాటులోకి తీసుకొస్తాం. దీనికి తోడు 18 ఏళ్లు నిండిన వారికి అందిస్తున్న వ్యాక్సిన్ ఉత్పత్తిని కూడా పెంచుతాము’ అని తెలిపారు.

SBI Warning : ఆ నంబర్లతో జాగ్రత్త.. ఖాతాదారులకు SBI హెచ్చరిక

ఈ నెలలో ఇప్పటికే 3.5 కోట్ల డోసులను ఉత్పత్తి చేశామని, అక్టోబర్‌‌లో ఈ సంఖ్యను 5.5 కోట్లకు పెంచేందుకు కృషి చేస్తున్నామని ఆయన చెప్పారు. ఇతర భాగస్వామ్య సంస్థలు కూడా ఉత్పత్తి ప్రారంభిస్తే.. ఈ సంఖ్య 10 కోట్లు దాటే అవకాశం ఉందని ఆశాభావం వ్యక్తం చేశారు.