Covid-19: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజే 13 వేల కేసులు నమోదు

గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 330 కేసులు పెరిగాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల శాతం 0.30గా ఉంది. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 20 మంది మరణించారు.

Covid-19: కొనసాగుతున్న కోవిడ్ ఉధృతి.. ఒక్క రోజే 13 వేల కేసులు నమోదు

Covid 19

Covid-19: దేశంలో కరోనా ఉధృతి కొనసాగుతోంది. గడిచిన 24 గంటల్లో దేశవ్యాప్తంగా 13,615 కరోనా కేసులు నమోదయ్యాయి. అంతకుముందు రోజుతో పోలిస్తే 330 కేసులు పెరిగాయి. ప్రస్తుతం కోవిడ్ కేసుల శాతం 0.30గా ఉంది. కేంద్ర వైద్య, ఆరోగ్య శాఖ తాజా గణాంకాలు మంగళవారం ఉదయం విడుదల చేసింది.

Woman Suicide: లోన్ యాప్ వేధింపులు భరించలేక మహిళ ఆత్మహత్య

దీని ప్రకారం.. గడిచిన 24 గంటల్లో కోవిడ్ కారణంగా 20 మంది మరణించారు. ఇప్పటివరకు కోవిడ్ నుంచి కోలుకున్న వారి సంఖ్య 4,29,96,427. మరణించిన వారి సంఖ్య 5,25,474. కోవిడ్ మరణాల శాతం 1.20గా ఉంది. రికవరీ రేటు 98.50 శాతంగా ఉంది. ప్రస్తుతం దేశంలో 1,31,043 యాక్టివ్ కేసులున్నాయి. మంగళవారం ఉదయం ఎనిమిది గంటల సమయానికి 199 కోట్ల వ్యాక్సిన్లు పూర్తయ్యాయి. డైలీ పాజిటివిటీ రేటు 3.23 శాతం కాగా, వీక్లీ పాజిటివిటీ రేటు 4.24 శాతం. పశ్చిమ బెంగాల్‌లో 1,900 కేసులు, ఢిల్లీలో 280, తమిళనాడులో 2,400, తెలంగాణలో 448, గుజరాత్‌లో 511, కర్ణాటకలో 673, ముంబై నగరంలో 235 కరోనా కేసులు నమోదయ్యాయి.

Crocodile: నదిలో స్నానానికి వెళ్లిన బాలుడు.. మింగేసిన మొసలి

కోవిడ్ కారణంగా ఇప్పటివరకు అత్యధిక మరణాలు మహారాష్ట్రలో నమోదయ్యాయి. ఈ రాష్ట్రంలో 1,47,978 మంది మరణించారు. తర్వాత కేరళలో 70,153 మంది, కర్ణాటకలో 40,124 మంది, తమిళనాడులో 38,028 మంది, ఢిల్లీలో 26,284 మంది, ఉత్తర ప్రదేశ్‌లో 23,547 మంది, పశ్చిమ బెంగాల్‌లో 21,246 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 10.6 లక్షల వ్యాక్సిన్లు ఇచ్చారు. అందులో 1.31 లక్షల బూస్టర్ డోసులున్నాయి.