Covid‌ Cases : దేశంలో మళ్లీ కోవిడ్‌ పంజా.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు

కోవిడ్ పేషెంట్లలో ఒమిక్రాన్‌ BA.2.12.1 వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ BA.2 వేరియంట్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలోనూ ఒమిక్రాన్‌ BA.2.12.1 వేరియంట్‌ కేసులను గుర్తించారు.

Covid‌ Cases : దేశంలో మళ్లీ కోవిడ్‌ పంజా.. రోజురోజుకు పెరుగుతున్న కేసులు

Covid

covid‌ cases increasing : రెండున్నరేళ్ల తర్వాత ఇప్పుడిప్పుడే మాస్కులు తీసేసి స్వేచ్ఛగా ఊపిరిపీల్చుకుంటోన్న ప్రజల్ని.. కరోనా మహమ్మారి మళ్లీ భయపెడుతోంది. భారత్‌లో నాలుగో వేవ్ అనుమానాలను బలపరుస్తూ.. కొత్త కేసులు, మరణాలు భారీగా పెరుగుతున్నాయి. గత 24 గంటల్లో 2వేల 380 కరోనా కేసులు నమోదయ్యాయి. 56 మంది కోవిడ్‌తో చనిపోయారు. ప్రస్తుతం యాక్టీవ్‌ కేసుల సంఖ్య 13వేలు. ఇక ఢిల్లీలో కరోనా కొత్త కేసులతో పాటు కొత్త వేరియంట్ కూడా కలకలం రేపుతోంది.

కోవిడ్ పేషెంట్లలో ఒమిక్రాన్‌ BA.2.12.1 వేరియంట్‌ను అధికారులు గుర్తించారు. ఈ కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ BA.2 వేరియంట్‌ కంటే వేగంగా వ్యాప్తి చెందుతుందని అధికారులు వెల్లడించారు. అమెరికాలోనూ ఒమిక్రాన్‌ BA.2.12.1 వేరియంట్‌ కేసులను గుర్తించారు. ఢిల్లీతో పాటు అమెరికాలోని పలు ప్రాంతాల్లో కేసులు భారీగా పెరగడానికి .. ఈ కొత్త వేరియంటే కారణమని అధికారులు తెలిపారు. దీనిపై మరింత పరిశోధనలు చేస్తున్నామన్నారు. కొత్త వేరియంట్లపై ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచిస్తున్నారు.

IIT-Madras Covid-19 : ఐఐటీ మద్రాసులో కరోనా కలకలం.. 19మంది విద్యార్థులకు పాజిటివ్..

ఢిల్లీలో ముందుగా పదుల సంఖ్యలో పెరిగిన కేసులు, ఒక్కసారిగా వందలు, వేలకు చేరాయి. పాజిటివిటీ రేటు 5.70 శాతంగా ఉన్నట్లు ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. కొత్త వేరియంట్‌ వల్లే కేసులు భారీగా పెరుగుతున్నాయని అధికారులు గుర్తించారు. దేశంలో నమోదవుతున్న కేసుల్లో అత్యధికంగా ఢిల్లీలోనే నమోదవుతుండడంతో.. ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ఢిల్లీ ప్రభుత్వం బహిరంగ ప్రదేశాల్లో మాస్కుల వాడకం తప్పనిసరి చేసింది. నిబంధనల్ని ఉల్లంఘించే వారికి 5వందల రూపాయల జరిమానా విధిస్తామని హెచ్చరించింది.

ఇక దేశంలో కరోనా కేసులు పెరుగుతున్న సమయంలో.. తెలంగాణ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని డీహెచ్ శ్రీనివాసరావు సూచించారు. కోవిడ్‌ జాగ్రత్తలు తీసుకోవడంతో పాటు వ్యాక్సిన్‌ ప్రికాషన్‌ డోస్‌ తీసుకోవాలన్నారు. కోవిడ్‌ వ్యాప్తి పూర్తిగా పోలేదని.. రానున్న మూడు నెలలు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యల కారణంగా తెలంగాణలో కరోనా వ్యాప్తి అదుపులోనే ఉందన్నారు. అయితే పక్క రాష్ట్రాల్లో కోవిడ్ కేసులు పెరుగుతున్న దృష్ట్యా ప్రజలు స్వీయ జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందని సూచించారు.

New Variant In Delhi : ఢిల్లీలో కొత్త వేరియంట్ కలకలం

ఇక తెలంగాణలో పాజిటివిటీ రేటు పెరగలేదని డీహెచ్ అన్నారు. హైదరాబాద్ మినహా మరెక్కడా 10కి పైగా కేసులు నమోదు కావడం లేదన్నారు. గత ఆరు వారాలుగా రాష్ట్రంలో కొవిడ్ అదుపులోనే ఉందన్న ఆయన..ఏప్రిల్, మే, జూన్ వరకు వివాహాలు, విహారయాత్రలు ఎక్కువగా ఉండడంతో.. ప్రభుత్వం చెప్పే జాగ్రత్తలు ప్రజలు పాటించాలన్నారు. అయితే తెలంగాణలో ఫోర్త్‌ వేవ్‌ వచ్చే అవకాశాలు తక్కవే అయినప్పటికీ.. అర్హులైన ప్రతిఒక్కరూ కోవిడ్‌ వ్యాక్సిన్‌ తీసుకోవాలన్నారు. బహిరంగ ప్రదేశాల్లో మాస్క్ తప్పనిసరిగా ధరించాల్సిందేనన్నారు.