HDFC Bank : హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్‌ కస్టమర్ల అకౌంట్లలో కోట్ల రూపాయలు జమ..ఖాతాదారులు షాక్

వికారాబాద్‌... మంథనిలోనే కాదు.. చెన్నైలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. చెన్నైకు చెందిన కొంత మంది బ్యాంక్‌ ఖాతాల్లో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఒక్కో HDFC అకౌంట్‌లో ఒకేసారి 13 కోట్ల 50 లక్షలు వచ్చిపడ్డాయి. ఇలా దాదాపు వంద మంది కస్టమర్ల ఖాతాల్లో కోట్లు జమయ్యాయి.

HDFC Bank : హెచ్ డీఎఫ్ సీ బ్యాంక్‌ కస్టమర్ల అకౌంట్లలో కోట్ల రూపాయలు జమ..ఖాతాదారులు షాక్

Hdfc Bank

Crores of rupees deposit : HDFC బ్యాంక్‌ కస్టమర్‌ అకౌంట్లలో కోట్ల రూపాయలు జమవుతున్నాయి. ఇప్పటికే వికారాబాద్‌లోని వెంకట్‌ రెడ్డి అనే కస్టమర్‌ ఖాతాలో 18 కోట్ల 52 లక్షల రూపాయలు క్రెడిట్‌ కాగా.. ఇప్పుడు పెద్దపల్లి జిల్లా మంథనిలో సాయి అనే వ్యక్తి అకౌంట్‌లో 5 కోట్ల 68 లక్షల రూపాయలు క్రెడిట్‌ అయ్యాయి. ఒక్కసారిగా ఐదు కోట్ల రూపాయలు అకౌంట్‌లో జమవ్వడంతో షాక్‌ అయ్యానన్నారు సాయి. అయితే గంటల వ్యవధిలోనే ఈ డబ్బు మళ్లీ మాయమైందని తెలిపాడు. సాంకేతిక సమస్య కారణంగానే ఇలా జరుగుతుందని అధికారులు చెబుతున్నారు. తాజాగా నిర్మల్ జిల్లా రేవోజీపేటలో రూ.1.27 కోట్లు జమ అయ్యాయి.

వికారాబాద్‌లో మొబైల్ షాప్‌ నిర్వహిస్తున్న వెంకట్‌ రెడ్డి అనే వ్యక్తి అకౌంట్‌లో అక్షరాలో 18 కోట్ల 52 లక్షల రూపాయలు క్రెడిట్‌ అయ్యాయి. ఈ డబ్బు ఎక్కడి నుంచి ట్రాన్స్‌ఫర్‌ అయ్యిందో తెలీదు. తన అకౌంట్లో అంత డబ్బును చూసి షాక్‌ అయిన వెంకట్‌ రెడ్డి వెంటనే HDFC బ్యాంక్‌ అధికారులకు సమాచారం అందించారు. అక్కడే వెంకట్‌ రెడ్డికి కష్టాలు మొదలయ్యాయి. అధికారులు వెంకట్‌ రెడ్డి ఖాతాను ఫ్రీజ్‌ చేశారు. దీంతో 18 కోట్ల రూపాయలు పడ్డాయని ఆనంద పడాలో.. లేక ఉన్న సొంత డబ్బును కూడా ఉపయోగించుకోలేక పోతున్నానని బాధపడాలో అర్థం కాని సిచ్యూవేషన్‌లో వెంకట్‌రెడ్డి ఉన్నాడు.

HDFC Accounts : డబ్బే డబ్బు… వారి బ్యాంకు ఖాతాల్లోకి రూ.13.5 కోట్లు జమ.. అసలేం జరిగిందంటే..

వికారాబాద్‌… మంథనిలోనే కాదు.. చెన్నైలో కూడా ఇదే సీన్‌ రిపీట్‌ అయ్యింది. చెన్నైకు చెందిన కొంత మంది బ్యాంక్‌ ఖాతాల్లో కోట్ల రూపాయలు వచ్చి పడ్డాయి. ఒక్కో HDFC అకౌంట్‌లో ఒకేసారి 13 కోట్ల 50 లక్షలు వచ్చిపడ్డాయి. ఇలా దాదాపు వంద మంది కస్టమర్ల ఖాతాల్లో కోట్లు జమయ్యాయి. నగదు జమ అయినట్లు మెసేజ్‌ చూసుకున్న ఖాతాదారులు షాక్‌కు గురయ్యారు. అసలు ఇది నిజమేనా అని అనకుంటూ కొందరు ఏటీఎం కేంద్రాలకు వెళ్లి చెక్ చేసుకున్నారు.. మరికొందరు బ్యాంక్ యాప్‌లో క్రాస్ చెక్ చేశారు. ఖాతాల్లో కోట్లలో బ్యాలెన్స్ చూపించడంతో.. ఎగిరి గంతేశారు.

ఒకే సారి కోట్లు వచ్చి పడడంతో ఇంకొందరు కంగారు పడి బ్యాంకుకు పరుగులు తీశారు. మరికొంత మంది ఖాతాదారుల్లో 10 వేల నుంచి 50 లక్షల వరకు డిపాజిట్‌ అయ్యాయి. ఈ విషయం తెలుసుకున్న చెన్నైలోని బర్కిట్‌ రోడ్‌ బ్రాంచ్‌ బ్యాంక్‌ అధికారులు అలర్ట్‌ అయ్యారు. దాదాపు వంద ఖాతాలను హోల్డ్‌ చేశారు. అప్పటికే కొందరు డబ్బులు డ్రా చేసుకున్నట్లు సమాచారం. బ్యాంక్ సర్వర్లలో కొత్త సాఫ్ట్‌వేర్ ఇన్‌స్టాల్ చేయడంతో.. ఇలా జరిగినట్లు తెలుస్తోంది.