Beast: ఓటీటీలో బీస్ట్ టైమ్ ఫిక్స్..?

తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్ గత బుధవారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా కథలో దమ్ము లేకపోవడంతో.....

Beast: ఓటీటీలో బీస్ట్ టైమ్ ఫిక్స్..?

Date Fixed For Beast Movie Ott Release

Beast: తమిళ స్టార్ హీరో విజయ్ నటించిన తాజా చిత్రం బీస్ట్ గత బుధవారం ప్రపంచవ్యాప్తంగా అత్యంత భారీ అంచనాల మధ్య రిలీజ్ అయ్యింది. అయితే ఈ సినిమా కథలో దమ్ము లేకపోవడంతో ఈ సినిమాకు మొదటి రోజే డివైడ్ టాక్ వచ్చింది. దీంతో ఈ సినిమాకు తమిళనాడు మినహా అన్ని చోట్లా ఆదరణ కరువయ్యింది. ఇక ఈ సినిమాలో విజయ్ రా ఏజెంట్ గా పవర్ ఫుల్ పాత్రలో నటించాడు.

Beast – KGF 2 : 50 కోట్లు వర్సెస్ 50 లక్షలు.. ‘కేజిఎఫ్ 2’ దెబ్బకి చతికిలపడిన బీస్ట్..

అయితే ఈ సినిమాకు అనుకున్న మేర స్థాయిలో సక్సెస్ కాకపోవడంతో చిత్ర యూనిట్ తీవ్ర నిరాశకు లోనయ్యింది. కాగా తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఓ వార్త ఇండస్ట్రీ వర్గాల్లో జోరుగా వినిపిస్తోంది. ఈ సినిమా ఓటీటీ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫాంలు నెట్‌ఫ్లిక్స్ మరియు సన్‌నెక్ట్స్ సొంతం చేసుకున్నాయి. దీంతో ఈ సినిమాను ఓటీటీ స్ట్రీమింగ్‌లో పెట్టేందుకు సదరు ఓటీటీ ప్లాట్ ఫాంలు రెడీ అవుతున్నాయట. బీస్ట్ చిత్రాన్ని మే 11న స్ట్రీమింగ్ చేసేందుకు రెడీ అవుతున్నారు.

Beast: పాన్ ఇండియా రిలీజ్.. కానీ పబ్లిసిటీని లైట్ తీసుకున్న విజయ్?

ఇక ఈ సినిమాలో విజయ్ సరసన అందాల భామ పూజా హెగ్డే హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమాకు యంగ్ సెన్సేషన్ అనిరుధ్ రవిచందర్ సంగీతం అందించగా, దర్శకుడు నెల్సన్ దిలీప్ ఈ సినిమాను తెరకెక్కించాడు. మరి ఈ సినిమాను ఓటీటీలో ఎప్పుడు టెలికాస్ట్ చేయాలో తెలియాలంటే మరికొద్ది రోజులు వెయిట్ చేయాల్సిందే.