Delhi Flood Alert: అత్యంత ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది.. డేంజర్ జోన్ దాటడంతో అలర్ట్ ..

భారీ వర్షాల కారణంగా ఢిల్లీలోని యమునా నది ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తుంది. దీంతో అప్రమత్తమైన ప్రభుత్వం నదీ పరివాహక ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించింది.

Delhi Flood Alert: అత్యంత ప్రమాదకర స్థాయిని దాటి ప్రవహిస్తున్న యమునా నది.. డేంజర్ జోన్ దాటడంతో అలర్ట్ ..

Yamuna River

Updated On : July 12, 2023 / 9:58 AM IST

Delhi Yamuna River : ఢిల్లీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. గతంలో ఎప్పుడూలేని విధంగా రికార్డు స్థాయిలో పలు ప్రాంతాల్లో వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమయం అయ్యాయి. వరద ప్రాంతాల్లో చిక్కుకున్న ప్రజలను ఢిల్లీ అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు. మరోవైపు ఢిల్లీ ప్రజలను యమున నది భయపెడుతుంది. ఎగువ ప్రాంతాల్లో ఎడతెరిపిలేని వర్షాల కారణంగా.. ఢిల్లీలో అత్యంత ప్రమాదకర స్థాయికి యమునా నది నీటి మట్టం చేరుకుంది. యమునా నదిలో 207.18 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. గత పదేళ్ల తరువాత యమునా నదిలో ఈ స్థాయిలో వరద నీరు ప్రవాహం రావటం ఇదే తొలిసారి. గతంలో2013‌లో 207.32 మీటర్ల వరకు యమున నదిలో వరద ప్రవాహంచేరుకుంది. ఎగువ రాష్ట్రాల్లో కురుస్తున్న భారీ వర్షాలు, హర్యానా హతినికుండ్ బ్యారేజ్ నుంచి నీటి విడుదలతో యమునా నదిలో వరద ప్రవాహం భారీగా పెరిగింది.

Delhi Rain : ఢిల్లీలో కుండపోత వర్షాలు.. 40 ఏళ్ల తరువాత ఒక్క రోజులో భారీ వర్షం
యమునా నదిలో వరదనీరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తుంది. వలస కార్మికులు, రైతు కూలీలు నివాసాలుండే ఐటీఓ, మయూర్ విహార్, లక్ష్మీ నగర్, యమునా బజార్‌లో రోడ్లపైకి వరదనీరు చేరింది. దీంతో ఆ ప్రాంతాల ప్రజల గుడిసెల్లోకి నీరు చేరడంతో వారంతా రోడ్డున పడ్డారు. యమునా నది పరివాహక ప్రాంతాల్లోని ప్రజలకోసం పునరావాస కేంద్రాలు, తాత్కాలిక టెంట్లను ఢిల్లీ ప్రభుత్వం ఏర్పాటు చేసింది. పునరావాస కేంద్రాల్లోని వలస కార్మికులు, వ్యవసాయ కూలీలకు సివిల్ డిఫెన్స్ వాలంటీర్లు, ఎన్జీఓలు సహాయం అందిస్తున్నారు.

Yamuna River Floods : ఉప్పొంగి ప్రవహిస్తున్న యమునా నది..ఢిల్లీకి వరద ముప్పు

యమునా నదిలో అత్యధిక వరద స్థాయి 207.49 మీటర్లుగా సెంట్రల్ వాటర్ కమిషన్ పేర్కొంది. 1978 సెప్టెంబర్ 6న 207.49 మీటర్లకు యమునా నీటి మట్టం చేరింది. మరోవైపు ఢిల్లీలో వరద పరిస్థితులపై ఢిల్లీ ప్రభుత్వం 16 కంట్రోల్ రూమ్స్ , క్విక్ రెస్పాన్స్ టీమ్స్, 47 రెస్క్యూ బోట్లను సిద్ధంగా ఉంచింది. యమునా నది నీటిమట్టం పెరగడంతో తొమ్మిది ప్రాంతాలకు వరద ముప్పు పొంచిఉంది. సీలంపూర్ కిసాన్ బస్తీ, సోనియా విహార్‌లోని MCD టోల్, పాత ఇనుప వంతెన, ISBT ఉన్న కిసాన్ బస్తీ, అన్నపూర్ణ మందిర్, ఉస్మాన్‌పూర్ పుస్తా, బదర్‌పూర్ ఖాదర్ విలేజ్, సబ్‌పూర్ బస్ టెర్మినల్, గర్హి మండు ప్రాంతాలకు వరద ముప్పు పొంచి ఉండటంతో ఆ ప్రాంతాల్లోని నివాసదారులను అధికారులు సురక్షిత ప్రాంతాలకు తరలించారు.