Delhi Covid : 24 గంటల్లో 238 కరోనా కేసులు, 24 మంది మృతి

గత 24 గంటల్లో 238 కొత్త కోవిడ్ కేసులు బయటపడినట్లు ఢిల్లీ ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజులో 504 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. 14,01,977 రికవరీ అయ్యారు. మొత్తం రాష్ట్రంలో 24 వేల 772 మంది చనిపోయారు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3922గా ఉన్నాయి.

Delhi Covid : 24 గంటల్లో 238 కరోనా కేసులు, 24 మంది మృతి

Delhi Covid

Delhi Health Bulletin : దేశ రాజధాని ఢిల్లీని గడగడలాడించిన కరోనా వైరస్ తోక ముడుస్తోంది. ఆక్సిజన్ అందక, బెడ్స్ దొరక్క..ఎన్నో ఇబ్బందులను పెట్టిన కరోనా వైరస్ ను కట్టడి చేసింది అక్కడి ప్రభుత్వం. నిత్యం వేల సంఖ్యలో నమోదైన కేసులు ఇప్పుడు మూడంకెల సంఖ్యకు చేరుకుంటుండడంతో ప్రజలు ఊపిరిపీల్చుకుంటున్నారు. కట్టుదిట్టమైన నిబంధనలు, ఆంక్షలు విధించడంతో కరోనా వైరస్ వ్యాపించలేదు.

గత 24 గంటల్లో 238 కొత్త కోవిడ్ కేసులు బయటపడినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఒక్కరోజులో 504 వైరస్ నుంచి కోలుకుని డిశ్చార్జ్ కాగా..24 మంది చనిపోయారు. 14,01,977 రికవరీ అయ్యారు. మొత్తం రాష్ట్రంలో 24 వేల 772 మంది చనిపోయాView postరు. ప్రస్తుతం యాక్టివ్ కేసులు 3922గా ఉన్నాయి.

రాష్ట్రంలో 77 వేల 112 శాంపిల్స్ పరీక్షించారు. పాజిటివిటీ రేటు 0.31 శాతంగా ఉంది. 24 వేల 132 బెడ్స్ ఉండగా..2 వేల 235 బెడ్స్ లో రోగులు చికిత్స పొందుతున్నారని, ఇంకా 21 వేల 897 బెడ్స్ ఖాళీగా ఉన్నాయని తెలిపింది. కోవిడ్ కేర్ సెంటర్ లో 6 వేల 332 బెడ్స్ ఉండగా..116 మంది రోగులు మాత్రమే చికిత్స పొందుతున్నట్లు..6 వేల 211 బెడ్స్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది. కోవిడ్ హెల్త్ సెంటర్ లో 627 బెడ్స్ ఉండగా..95 మంది రోగులు చికిత్స పొందుతున్నట్లు..ఇంకా..532 బెడ్స్ ప్రస్తుతం ఖాళీగా ఉన్నాయని వెల్లడించింది.

ఢిల్లీ రాష్ట్రంలో కరోనా కేసులు ఎక్కువ కావడంతో అక్కడి ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు పాజిటివ్ కేసులు తక్కువగా నమోదు కావడంతో..లాక్ డౌన్ విషయంలో నిబంధనలు సడలించింది అక్కడి ఆప్ ప్రభుత్వం.

Read More : Raja Raja Chora : దొంగకు కూడా రవ్వంత గుర్తింపు కావాలి.. ‘చోర గాథ’ అదిరిపోయిందిగా..