Vindhya Separate State Demand : మధ్యప్రదేశ్ లో మరోసారి వింధ్య ప్రత్యేక రాష్ట్ర డిమాండ్.. బీజేపీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వింధ్య రీజియన్ లో 30 అసెంబ్లీ నియోజక వర్గాలతో సహా 43 స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. వింధ్య రీజియన్ లోని 30 స్థానాలను గెలుచుకుంటామని ఆశా భావం వ్యక్తం చేశారు.

Vindhya Separate State Demand : మధ్యప్రదేశ్ లో మరోసారి వింధ్య ప్రత్యేక రాష్ట్ర డిమాండ్.. బీజేపీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యే తిరుగుబాటు

MLA Narayan Tripathi

Updated On : July 17, 2023 / 12:17 PM IST

BJP MLA Narayan Tripathi : మధ్యప్రదేశ్ లో వింధ్య ప్రత్యేక రాష్ట్ర డిమాండ్ మరోసారి ఊపందుకుంది. బీజేపీ ప్రభుత్వంపై సొంత పార్టీ ఎమ్మెల్యేనే తిరుగుబాటు బావుటా ఎగురవేశారు. వింధ్య రీజియన్ ప్రత్యేక రాష్ట్ర హోదా సాధన కోసం స్థానిక ప్రజలు స్థాపించిన రాజకీయ పార్టీ వింధ్య జనతా పార్టీ(వీజేపీ)కి తాను నేతృత్వం వహిస్తానని బీజేపీ ఎమ్మెల్యే నారాయణ్ త్రిపాఠి తెలిపారు.

వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో వింధ్య రీజియన్ లో 30 అసెంబ్లీ నియోజక వర్గాలతో సహా 43 స్థానాల్లో పోటీ చేస్తామని పేర్కొన్నారు. వింధ్య రీజియన్ లోని 30 స్థానాలను గెలుచుకుంటామని ఆశా భావం వ్యక్తం చేశారు. వింధ్య ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటే ముఖ్యమని, వింధ్యకు రాష్ట్ర హోదా ఇవ్వాలని 2004 నుంచి డిమాండ్ చేస్తున్నామని చెప్పారు.

Dalit Girl Gang-Raped : దళిత బాలికపై ముగ్గురు విద్యార్థులు గ్యాంగ్ రేప్.. ఆమె స్నేహితుడి ముందే ఘాతుకం

రాజకీయ పార్టీగా వీజేపీ గతవారం రిజిస్టర్ అయిందని, సభ్యత్వ డ్రైవ్ కొనసాగుతుందన్నారు. వింధ్య ప్రాంతంలో బ్రహ్మణ నేతగా ఉన్న నారాయణ్ త్రిపాఠి 2014లో బీజేపీలో చేరారు. సత్నా జిల్లాలోని మైహర్ అసెంబ్లీ నియోజక వర్గ నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా ఉన్నారు. కాగా, ఈ ఏడాది చివర్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్నాయి.