Dhanush: సార్.. ఫుల్ బిజీ మాష్టారు!

తమిళ యంగ్ హీరో ధనుష్ నటించే సినిమాలు వైవిధ్యంగా ఉండటంతో ఆయన సినిమాలకు తెలుగునాట కూడా మంచి ఆదరణ దక్కుతోంది. యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ‘సార్’ అనే సినిమాలో ధనుష్ నటిస్తున్నాడు. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది.

Dhanush: సార్.. ఫుల్ బిజీ మాష్టారు!

Dhanush Intense First Look Poster Of Sir Movie

Dhanush: తమిళ యంగ్ హీరో ధనుష్ నటించే సినిమాలు వైవిధ్యంగా ఉండటంతో ఆయన సినిమాలకు తెలుగునాట కూడా మంచి ఆదరణ దక్కుతోంది. గతంలో రఘువరన్ బిటెక్ సినిమాతో టాలీవుడ్‌లో అదిరిపోయే సక్సెస్ అందుకున్న ఈ యంగ్ హీరో, ఆ తరువాత వరుసబెట్టి సినిమాలను తెలుగులో రిలీజ్ చేస్తున్నాడు. అయితే తొలిసారి ఓ స్ట్రెయిట్ తెలుగు మూవీలో నటిస్తున్నాడు ఈ హీరో.

Dhanush Movie: ఆ రోజే ‘సార్’ టీజర్ రిలీజ్.. ముహూర్తం ఫిక్స్ చేసిన చిత్ర యూనిట్

యంగ్ డైరెక్టర్ వెంకీ కుడుముల తెరకెక్కిస్తున్న ‘సార్’ అనే సినిమాలో ధనుష్ నటిస్తున్నాడు. ఈ సినిమాను ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ ఎంటర్‌టైనర్ సబ్జెక్టుతో దర్శకుడు వెంకీ తెరకెక్కిస్తున్నాడు. ఇక ఈ సినిమాలో ధనుష్ ఓ లెక్చరర్ పాత్రలో నటిస్తున్నట్లు చిత్ర వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. తాజాగా ఈ సినిమా నుండి ఫస్ట్ లుక్ పోస్టర్‌ను చిత్ర యూనిట్ రిలీజ్ చేసింది. ఈ పోస్టర్‌లో ఓ లైబ్రరీలో కూర్చుని సీరియస్‌గా ఏదో రాస్తున్నాడు హీరో.

ఇక ఈ సినిమా టీజర్‌ను కూడా రిలీజ్ చేస్తున్నట్లు చిత్ర యూనిట్ అఫీషియల్ అనౌన్స్‌మెంట్ చేసింది. సార్ చిత్రానికి సంబంధించిన టీజర్‌ను రేపు సాయంత్రం 6 గంటలకు రిలీజ్ చేసేందుకు చిత్ర యూనిట్ రెడీ అయ్యింది. ఈ సినిమాను తెలుగుతో పాటు తమిళంలో కూడా భారీ స్థాయిలో రిలీజ్ చేసేందుకు దర్శకనిర్మాతలు ప్లాన్ చేస్తున్నారు. మరి సార్ చిత్రంతో ధనుష్ ఎలాంటి విజయాన్ని అందుకుంటాడా అనేది తెలియాలంటే సార్ మనముందుకు వచ్చే వరకు వెయిట్ చేయాల్సిందే.