Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము

రాష్ట్ర‌ప‌తిగా ఎస్టీ మ‌హిళ‌ను ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని జేపీ న‌డ్డా వెల్లడించారు. ద్రౌప‌ది ముర్ము విశేష ప్ర‌తిభాశాలి అని కొనియాడారు. మంత్రిగా, గ‌వ‌ర్న‌ర్‌గా ద్రౌప‌ది ముర్ము రాణించార‌ని ఆయ‌న తెలిపారు.

Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము

Draupadi Murmu

Draupadi Murmu : ఎన్డీఏ రాష్ట్రప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము పేరు ఖ‌రారైంది. బీజేపీ పార్ల‌మెంట‌రీ బోర్డు స‌మావేశం ముగిసిన అనంత‌రం జేపీ న‌డ్డా మీడియాతో మాట్లాడుతూ ఎన్డీఏ రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా ద్రౌప‌ది ముర్ము పేరును ఖ‌రారు చేశామ‌ని పేర్కొన్నారు. ఎన్డీఏ ప‌క్షాల‌న్నింటితో చ‌ర్చించిన త‌ర్వాతే ముర్ము పేరును ప్ర‌క‌టించామ‌ని తెలిపారు. రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిపై దాదాపు 20 మంది గురించి ఆలోచించామ‌న్నారు.

రాష్ట్ర‌ప‌తిగా ఎస్టీ మ‌హిళ‌ను ఎంపిక చేయాల‌ని నిర్ణ‌యించామ‌ని జేపీ న‌డ్డా వెల్లడించారు. ద్రౌప‌ది ముర్ము విశేష ప్ర‌తిభాశాలి అని కొనియాడారు. మంత్రిగా, గ‌వ‌ర్న‌ర్‌గా ద్రౌప‌ది ముర్ము రాణించార‌ని ఆయ‌న తెలిపారు. గ‌తంలో ఆమె జార్ఖండ్ గ‌వ‌ర్న‌ర్‌గా ప‌ని చేశారు. రాజకీయాల్లోకి రాక‌ముందు ఆమె టీచ‌ర్‌గా ప‌ని చేశారు. ఒడిశాలోని మ‌యూర్‌భంజ్ జిల్లా బైడ‌పోసిలో ముర్ము జ‌న్మించారు.

PM Modi : ప్రధాని మోదీతో త్రివిధ దళాధిపతులు భేటీ

మరోవైపు విప‌క్షాల రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిగా య‌శ్వంత్ సిన్హా పేరు ఖరారు అయింది. పార్ల‌మెంట్ ఎన్ఎక్స్ భ‌వ‌న్‌లో స‌మావేశ‌మైన 18 ప్ర‌తిప‌క్షాల‌ పార్టీల నాయ‌కులు య‌శ్వంత్ సిన్హా పేరును ఏక‌గ్రీవంగా ప్ర‌తిపాదించారు. విప‌క్షాల నిర్ణ‌యాన్ని కాంగ్రెస్ నేత జైరాం ర‌మేశ్ ప్ర‌క‌టించారు. ఎన్‌సీపీ నేత శ‌ర‌ద్ ప‌వార్ నేతృత్వంలో ఈ సమావేశం జ‌రిగింది. అన్ని పార్టీలు త‌న‌కు మ‌ద్ద‌తు ఇవ్వాల‌ని య‌శ్వంత్ సిన్హా విజ్ఞ‌ప్తి చేశారు. య‌శ్వంత్ సిన్హా గ‌తంలో కేంద్ర ఆర్థిక‌, విదేశాంగ శాఖ‌ల మంత్రిగా ప‌ని చేశారు.

ప్ర‌స్తుతం తృణ‌మూల్ పార్టీలో కొన‌సాగుతున్న య‌శ్వంత్ సిన్హా.. ఇవాళ ఉద‌యం ఆ పార్టీకి రాజీనామా చేశారు. విప‌క్ష పార్టీల త‌ర‌పున రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిని ఎంపిక చేసేందుకు ఇటీవ‌ల బెంగాల్ సీఎం మ‌మ‌తా బెన‌ర్జీ ఢిల్లీలో సమావేశం ఏర్పాటు చేసిన విష‌యం తెలిసిందే. జూలై 18వ తేదీన రాష్ట్ర‌ప‌తి ఎన్నిక జ‌ర‌గ‌నున్న విష‌యం తెలిసిందే.

Eknath Shinde: బీజేపీతో కలిస్తే.. శివసేన చీలదు: తిరుగుబాటు నేత ఏక్ నాథ్ షిండే

య‌శ్వంత్ సిన్హా 1960లో ఐఏఎస్ ఉద్యోగం సాధించారు. ఆ త‌ర్వాత 24 ఏళ్ల పాటు ఐఏఎస్ అధికారిగా కొన‌సాగారు. 1984లో త‌న ఉద్యోగానికి రాజీనామా చేశారు. అనంత‌రం జ‌న‌తా పార్టీలో చేరారు. 1988లో రాజ్యస‌భ‌కు ఎంపిక‌య్యారు. 1996లో బీజేపీ అధికార ప్ర‌తినిధిగా పని చేశారు. 1998, 1999, 2009లో హ‌జారీబాగ్ ఎంపీగా ఎన్నిక‌య్యారు.

1998లో చంద్ర‌శేఖ‌ర్ కేబినెట్‌లో ఏడాది పాటు కేంద్ర ఆర్థిక మంత్రిగా కొన‌సాగారు. 2002లో కేంద్ర విదేశాంగ శాఖ మంత్రిగా ప‌నిచేశారు. 2021, మార్చి 13న తృణ‌మూల్ కాంగ్రెస్‌లో చేరారు. మార్చి 15న టీఎంసీ వైస్ ప్రెసిడెంట్‌గా య‌శ్వంత్ సిన్హాను ఎన్నుకున్నారు.