Ben Stokes Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

మ‌రో స్టార్ ప్లేయ‌ర్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ వ‌న్డే క్రికెట్‌కు గుడ్ బై ప‌లికాడు.(Ben Stokes Retire)

Ben Stokes Retire : రిటైర్మెంట్ ప్రకటించిన స్టార్ క్రికెటర్

Ben Stokes Retire : మ‌రో స్టార్ ప్లేయ‌ర్ వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇంగ్లండ్ టెస్టు జ‌ట్టు కెప్టెన్‌, ఆల్ రౌండ‌ర్ బెంజిమిన్ ఆండ్రూ స్టోక్స్ అలియాస్ బెన్ స్టోక్స్ వ‌న్డే క్రికెట్‌కు గుడ్ బై ప‌లికాడు. ఈ మేర‌కు సోమ‌వారం సాయంత్రం ఓ ప్ర‌క‌ట‌న‌ రిలీజ్ చేశాడు.

England vs India: రిష‌బ్ పంత్ అద్భుత ఆట‌తీరుపై స‌చిన్, గంగూలీ, సెహ్వాగ్ ప్ర‌శంస‌ల జ‌ల్లు

మంగ‌ళ‌వారం సౌతాఫ్రికాతో జరిగే వ‌న్డే మ్యాచ్ త‌న‌కు చివ‌రిద‌ని స్టోక్స్ వెల్లడించాడు. వ‌న్డేల‌కు గుడ్ బై చెప్పిన స్టోక్స్ టెస్టు క్రికెట్‌లో మాత్రం కొన‌సాగనున్నాడు. టీమిండియాతో వ‌న్డే సిరీస్ ముగిసిన మ‌రునాడే వ‌న్డే క్రికెట్‌కు బెన్ స్టోక్స్ వీడ్కోలు చెప్పాడు.

Hardik Pandya Record : ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా రికార్డ్

కాగా, ఎంతో ఆలోచించిన తర్వాతే ఈ కఠినమైన నిర్ణయం తీసుకున్నట్లు స్టోక్స్ తెలిపాడు. మూడు ఫార్మాట్లలో ఆడటం కాస్త శ్రమతో కూడుకున్నది స్టోక్స్ అన్నాడు. ఇన్నేళ్ల పాటు తనకు సహకరించిన తోటి క్రికెటర్లు, ఇంగ్లండ్ క్రికెట్ బోర్డుకు ధన్యవాదాలు చెప్పాడు.

Must Watch: https://www.youtube.com/watch?v=Q0eu7HCRBgw

స్టోక్స్ 2011లో ఐర్లాండ్ తో మ్యాచ్ ద్వారా వన్డేల్లోకి అరంగ్రేటం చేశాడు. వన్డే కెరీర్ లో 2వేల 919 రన్స్ చేశాడు. మూడు సెంచరీలు నమోదు చేశాడు. వన్డే క్రికెట్ లో 74 వికెట్లు కూడా తీసుకున్నాడు. 2019 ఐసీసీ వరల్డ్ కప్ లో స్టోక్స్ కీలక ఇన్నింగ్స్ ఆడాడు. 84 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. స్టోక్స్ అద్భుత ప్రదర్శనతో ఇంగ్లండ్ సూపర్ ఓవర్ కు వెళ్లింది. టైటిల్ విజేతగా నిలిచింది. ఇంగ్లండ్ టెస్ట్ కెప్టెన్ గా జో రూట్ తప్పుకోవడంతో.. ఆ బాధ్యతలను స్టోక్స్ కు అప్పగించారు. స్టోక్స్ కెప్టెన్ గా బాధ్యతలు తీసుకున్న వెంటనే.. న్యూజిలాండ్ తో 3 మ్యాచుల టెస్ట్ సిరీస్ ను ఇంగ్లండ్ క్లీన్ స్వీప్ చేసింది. ఆ తర్వాత భారత్ తో జరిగిన 5వ రీషెడ్యూల్డ్ టెస్ట్ మ్యాచ్ కూడా ఇంగ్లండ్ నెగ్గింది.

2019లో లార్డ్స్‌లో న్యూజిలాండ్‌పై ఇంగ్లండ్ వరల్డ్ కప్ విజయం సాధించినప్పటి నుంచి తొమ్మిది వన్డేల్లో స్టోక్స్ ఆడాడు. “ఇప్పుడు మూడు ఫార్మాట్లు ఆడే పరిస్థితిలో లేను. నా శరీరం నన్ను నిరాశకు గురిచేస్తోందని నేను భావిస్తున్నా. మరింత శక్తితో టెస్ట్ క్రికెట్‌ ఆడతాను. ఈ నిర్ణయంతో, T20 ఫార్మాట్‌కు నా పూర్తి నిబద్ధతను కూడా ఇవ్వగలనని భావిస్తున్నా. జోస్ బట్లర్, మాథ్యూ మోట్, ఆటగాళ్లు సహాయక సిబ్బందికి ప్రతి విజయాన్ని కోరుకుంటున్నా. గత ఏడేళ్లుగా వైట్-బాల్ క్రికెట్‌లో మేము గొప్ప పురోగతి సాధించాము. భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది” అని స్టోక్స్ అన్నాడు.(Ben Stokes Retire)

“నేను ఇప్పటివరకు ఆడిన మొత్తం మ్యాచుల్లో 104 గేమ్‌లను ఇష్టపడ్డాను. నా హోమ్‌గ్రౌండ్‌ డర్హామ్‌లో నా చివరి గేమ్ ఆడడం అద్భుతంగా అనిపిస్తుంది. ఎప్పటిలాగే, ఇంగ్లండ్ అభిమానులు ఎల్లప్పుడూ నా కోసం ఉన్నారు, కొనసాగుతారు. మీరు ప్రపంచంలోనే అత్యుత్తమ అభిమానులు. మంగళవారం దక్షిణాఫ్రికాతో జరిగే మ్యాచ్ ను నెగ్గి.. సిరీస్‌ను కైవసం చేసుకుంటామని నేను ఆశిస్తున్నా” అని స్టోక్స్ చెప్పాడు.

వన్డే క్రికెట్ కు రిటైర్మెంట్ ప్రకటిస్తూ స్టోక్స్ తీసుకున్న నిర్ణయంపై ఇంగ్లండ్ పురుషుల క్రికెట్ మేనేజింగ్ డైరెక్టర్ రాబ్ కీ స్పందించారు. “ఇది కఠినమైన నిర్ణయమని నాకు తెలుసు, కానీ అతను ఎందుకు ఈ నిర్ణయానికి వచ్చాడో నాకు పూర్తిగా అర్థమైంది. బెన్ కెరీర్‌ను వెనక్కి తిరిగి చూసుకున్నప్పుడు అతను 120-ప్లస్ టెస్ట్‌లు ఆడటానికి రాబోయే సంవత్సరాలలో T20 మ్యాచ్‌లు మరియు ప్రపంచ కప్‌లలో ఇంగ్లండ్‌కు సహాయం చేస్తాడని ఇది ఒక కారణం అని నేను ఖచ్చితంగా అనుకుంటున్నా. ఇది నిస్వార్థ నిర్ణయం. ఇంగ్లాండ్‌కు దీర్ఘకాలిక ప్రయోజనం చేకూరుస్తుంది” అని రాబ్ కీ అన్నారు.

 

View this post on Instagram

 

A post shared by Ben Stokes (@stokesy)