Hardik Pandya Record : ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా రికార్డ్

ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో రాణించి.. జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డ్ సృష్టించాడు.(Hardik Pandya Record)

Hardik Pandya Record : ఆ ఘనత సాధించిన తొలి ఇండియన్ క్రికెటర్‌గా హార్దిక్ పాండ్యా రికార్డ్

Hardik Pandya

Hardik Pandya Record : టీమిండియా ఆల్ రౌండర్ హార్దిక్ పాండ్యా ఫుల్ ఫామ్ లో ఉన్నాడు. అటు బౌలింగ్ లో, ఇటు బ్యాటింగ్ లో అదరగొట్టేస్తున్నాడు. బంతితో ప్రత్యర్థిని కట్టడి చేయడమే కాదు బ్యాట్ తోనూ చెలరేగుతున్నాడు. విలువైన పరుగులు చేసి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేస్తున్నాడు. ఇంగ్లండ్ తో సిరీస్ ను డిసైడ్ చేసే మూడో వన్డేలో హార్ధిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడాడు. హాఫ్ సెంచరీతో జట్టు గెలుపులో ముఖ్య పాత్ర పోషించాడు. ఈ క్రమంలో అరుదైన రికార్డ్ సృష్టించాడు.

ఇంగ్లండ్ తో మ్యాచ్ లో పాండ్యా నాలుగు వికెట్లు తీసి ఇంగ్లీష్ బ్యాటింగ్ వెన్ను విరిచాడు. ఆ తర్వాత బ్యాటింగ్ లోనూ హాఫ్ సెంచరీతో మెరిశాడు. దీంతో మూడు ఫార్మాట్లలో ఒకే మ్యాచ్ లో 4+ వికెట్లు తీసి.. 50+ రన్స్ చేసిన తొలి ఇండియన్ క్రికెటర్ గా రికార్డు నెలకొల్పాడు. ఈ ఫీట్ సాధించిన వారిలో ప్రపంచ క్రికెట్ లో రెండో క్రికెటర్ గా నిలిచాడు. పాండ్యా కంటే ముందు పాక్ ఆల్ రౌండర్ మహ్మద్ హఫీజ్ ఈ ఫీట్ సాధించాడు.(Hardik Pandya Record)

మూడో వన్డేలో భారత్ అదరగొట్టింది. ఇంగ్లండ్ పై గ్రాండ్ విక్టరీ కొట్టింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ 45.5 ఓవర్లలో 259 పరుగులకే ఆలౌట్ అయ్యింది.

T20 World Cup 2022: టీ20 వరల్డ్ కప్‌లో ఆడనున్న పూర్తి జట్లు ఇవే
260 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన భారత్.. మరో 47 బంతులు, 5 వికెట్లు మిగిలి ఉండగానే టార్గెట్ చేజ్ చేసింది. భారత బ్యాటర్లలో రిషబ్ పంత్, హార్దిక్ పాండ్యా కీలక ఇన్నింగ్స్ ఆడారు. ముఖ్యంగా పంత్ వీరోచిత సెంచరీతో చెలరేగాడు. పంత్ 113 బంతుల్లోనే 125 పరుగులు చేసి నాటౌట్ గా నిలిచాడు. అతడి స్కోర్ లో 16 ఫోర్లు 2 సిక్సులు ఉన్నాయి.

హార్దిక్ పాండ్యా హాఫ్ సెంచరీతో మెరిశాడు. పాండ్యా 55 బంతుల్లో 71 పరుగులు చేశాడు. అతడి స్కోర్ లో 10 ఫోర్లు ఉన్నాయి. వీరిద్దరూ భారత్ ను విజయతీరాలకు చేర్చారు. 42.1 ఓవర్లలోనే 5 వికెట్లు కోల్పోయి 261 పరుగులు చేసింది భారత్. ఈ గెలుపుతో టీమిండియా మూడు వన్డేల సిరీస్ ను 2-1 తేడాతో కైవసం చేసుకుంది.


పంత్, పాండ్యా జోడీ ఐదో వికెట్‌కు 115 బంతుల్లో 133 పరుగులు జోడించి జట్టు విజయంలో కీ రోల్ ప్లే చేసింది. 72 పరుగులకే నాలుగు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడిన జట్టును వీరిద్దరూ ఆదుకున్నారు. మొదట ఆచితూచి ఆడగా.. తర్వాత క్రీజులో కుదురుకున్నాక ఇంగ్లండ్‌ బౌలర్లపై చెలరేగిపోయారు. అయితే, కీలక సమయంలో పాండ్యా ఔటైనా.. జడేజా (7)తో కలిసి పంత్‌ భారత్ ను విజయ తీరాలకు చేర్చాడు.

England vs India: మూడో వ‌న్డేలో ర‌వీంద్ర జ‌డేజా ప‌ట్టిన క్యాచ్ వీడియో వైర‌ల్

260 పరుగుల లక్ష్యఛేదనలో ఓ దశలో టీమిండియా టాపార్డర్ చేతులెత్తేసినా వికెట్ కీపర్, బ్యాట్స్ మన్ రిషబ్ పంత్.. హార్దిక్ పాండ్యాతో కలిసి స్కోరు బోర్డును పరుగులెత్తించాడు. పిచ్ బ్యాటింగ్ కు ఏమాత్రం సహకరించకపోయినా, ఏ దశలోనూ ఒత్తిడికి లోనుకాకుండా పని ముగించాడు.