Electricity Charges : తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్

19శాతం విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు అనుమతి కోరాయి. 14శాతం విద్యుత్ చార్జీల పెంపునకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.

Electricity Charges : తెలంగాణలో విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్

Electricity

ERC green signal : తెలంగాణలో విద్యుత్ చార్జీలు పెరుగనున్నాయి. రాష్ట్రంలో విద్యుత్ చార్జీల పెంపుకు ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 14శాతం విద్యుత్ చార్జీల పెంపునకు టీఎస్ ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. డొమెస్టిక్ పై 40 నుంచి 50 పైసలు పెంచడానికి ఈఆర్సీ అనుమతి ఇచ్చింది. 19శాతం విద్యుత్ చార్జీల పెంపునకు డిస్కంలు అనుమతి కోరాయి. 14శాతం విద్యుత్ చార్జీల పెంపునకు టీఎస్ ఈఆర్సీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. గృహ విద్యుత్ కు 50 పైసలు, పారిశ్రామిక రంగానికి 1 రూపాయి పెంచాలని టీఎస్ ఈఆర్సీ నిర్ణయించింది. టీఎస్ సర్కార్ నిర్ణయం తర్వాతే విద్యుత్ చార్జీల పెంపు అమలు కానుంది.

2016-17 నుంచి…అంటే..ఐదేళ్లుగా తారీఫ్ పెరగలేదు. 2022-23 తారీఫ్ ప్రపోజల్స్.. రూ.53,053 కోట్లు ప్రతిపాదించగా.. రూ.48708 కోట్లు ఆమోదించింది. రూ.6,338 ద్రవ్యలోటు ఉంటే..రూ.5,596 కోట్లు ఆమోదించింది. రూ.8221.17కోట్లు సబ్సిడీ వ్యవసాయానికి ప్రతిపాదించారు. గతంలో ఉన్నదానికంటే 38.38 శాతం అధికం. డిస్కమ్స్ పై భారం పడకూడదు. రూ.7.03 శాతం సగటు ధర పెరిగింది.

Power Bills : ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో ఎదురుదెబ్బ.. విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిందే

19శాతం ప్రతిపాదిస్తే..14 శాతం వరకే పెంచుతూ నిర్ణయం తీసుకున్నామని తెలిపింది. ఎల్.టి.కి 15 శాతం కుదించామని తెలిపారు. వ్యవసాయానికి తారీఫ్ పెంచలేదని తెలిపారు. ఈవీ ఛార్జింగ్ కు తారీఫ్ ప్రతిపాదనలు ఆమోదించలేదని చెప్పారు. డిస్కమ్స్ నవంబర్ 30వ తేదీ లోపు ప్రతిపాదనలు కమిషన్ ముందు కచ్చితంగా ఉంచాలన్నారు. ఆసక్తిగల వినియోగదారులకు స్మార్ట్ ప్రిపేయిడ్ మీటర్ల ఏర్పాటుకు ఆదేశించారు. జీడిమెట్ల స్మార్ట్ గ్రిడ్ పూర్తిస్థాయిలో విస్తరించాలన్నారు.

గృహవినియోగదారులకు-50 పైసలు, పరిశ్రమలు 1 రూపాయి టారీఫ్ పెంచారు.ఇక నుంచి డిస్కంలు ఏఆర్ఆర్ లు సమయానికి సమర్పించక పోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఆర్నెల్లకోసారి ఖచ్చితంగా డిస్కంలు ఏఆర్ఆర్ లు సమర్పించాల్సిందే. విద్యుత్ బిల్లులు వసూలు తక్కువగా అవుతున్న చోట.. విద్యుత్ ప్రీపెయిడ్ మీటర్లు యుద్ధ ప్రాతిపదికన ఏర్పాటు చేయాలన్నారు.