Huzurabad : ఈటల మెజారిటీ ఎంతో తెలుసా…? రౌండ్ వారీగా ఓట్ల వివరాలు

ఈటల రాజేందర్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. భారీ మెజారిటీ దిశగా సాగి గెలుపు జెండా ఎగరేశారు.

Huzurabad : ఈటల మెజారిటీ ఎంతో తెలుసా…? రౌండ్ వారీగా ఓట్ల వివరాలు

Etaja Rajender Victory

Huzurabad : ఉత్కంఠ రేపిన హుజూరాబాద్ ఉపఎన్నికలో బీజేపీ అభ్యర్థి ఈటల రాజేందర్ విజయం సాధించారు. తొలి రౌండ్ నుంచి.. ఈటల ఆధిక్యం కొనసాగుతూ వచ్చింది. ఐతే… 8వ రౌండ్.. 11వ రౌండ్ లో మాత్రం టీఆర్ఎస్ స్వల్ప ఆధిక్యం చూపించింది. ఈ ట్రెండ్ మళ్లీ కంటిన్యూ కాలేదు. ఈటల రాజేందర్ తన ఆధిక్యాన్ని కొనసాగిస్తూ వచ్చారు. భారీ మెజారిటీ దిశగా సాగి.. కౌంటింగ్ పూర్తి కాకముందే.. తన విజయాన్ని ఖాయం చేసుకున్నారు.

చివరి 2 రౌండ్లలో ఈటల మెజారిటీపై ఎంత అన్నది అస్పష్టంగా అనిపించింది. 23వేలని.. 24 వేలని భావించారు. ఐతే.. రిటర్నింగ్ అధికారులు దీనిపై క్లారిటీ ఇచ్చారు.  బీజేపీకి మొత్తం పోలైన ఓట్లు 107022 అని..  టీఆర్ఎస్ కు పోలైన ఓట్లు 83167 అని ప్రకటించారు. దీంతో.. 23వేల 855 ఓట్ల తేడాతో… గెల్లుపై ఈటల గెలిచాడని రిటర్నింగ్ అధికారులు ప్రకటించారు.

రౌండ్ వారీగా ఫలితాలు ఇవీ :

రౌండ్ 1 : టీఆర్ఎస్ (4,444), బీజేపీ (4,610), కాంగ్రెస్ (119)
రౌండ్ 2 : టీఆర్ఎస్ (4,659), బీజేపీ (4,851), కాంగ్రెస్ (220)
రౌండ్ 3 : టీఆర్ఎస్ (3,159), బీజేపీ (4,064), కాంగ్రెస్ (107)
రౌండ్ 4 : టీఆర్ఎస్ (3,882), బీజేపీ (4,444), కాంగ్రెస్ (234)

రౌండ్ 5 : టీఆర్ఎస్ (4,014), బీజేపీ (4,358), కాంగ్రెస్ (132)
రౌండ్ 6 : టీఆర్ఎస్ (3,639), బీజేపీ (4,656), కాంగ్రెస్ (180)
రౌండ్ 7 : టీఆర్ఎస్ (3,792), బీజేపీ (4,038), కాంగ్రెస్ (89)
రౌండ్ 8 : టీఆర్ఎస్ (4,248), బీజేపీ (4,086), కాంగ్రెస్ (89)

Read This : Huzurabad By Poll : ఓటమిపై స్పందించిన కేటీఆర్.. 20 ఏళ్లలో ఇలాంటివి ఎన్నో చూసాం

రౌండ్ 9 : టీఆర్ఎస్ (3,470), బీజేపీ (5,305), కాంగ్రెస్ (174)
రౌండ్ 10 : టీఆర్ఎస్ (3,709), బీజేపీ (4,326), కాంగ్రెస్ (104)
రౌండ్ 11 : టీఆర్ఎస్ (4,326), బీజేపీ (3,941), కాంగ్రెస్ (104)
రౌండ్ 12 : టీఆర్ఎస్ (3,623), బీజేపీ (4,849), కాంగ్రెస్ (158)

రౌండ్ 13 : టీఆర్ఎస్ (2,971), బీజేపీ (4,836), కాంగ్రెస్ (101)
రౌండ్ 14 : టీఆర్ఎస్ (3,700), బీజేపీ (4,746), కాంగ్రెస్ (152)
రౌండ్ 15 : టీఆర్ఎస్ (3,358), బీజేపీ (5,407), కాంగ్రెస్ (149)
రౌండ్ 16 : టీఆర్ఎస్ (3,977), బీజేపీ (5,689), కాంగ్రెస్ (135)

రౌండ్ 17 : టీఆర్ఎస్ (4,187), బీజేపీ (5,610), కాంగ్రెస్ (203)
రౌండ్ 18 : టీఆర్ఎస్ (3,735), బీజేపీ (5,611), కాంగ్రెస్ (94)
రౌండ్ 19 : టీఆర్ఎస్ (2,869), బీజేపీ (5,916), కాంగ్రెస్ (97)
రౌండ్ 20 : టీఆర్ఎస్ (3,795), బీజేపీ (5,269), కాంగ్రెస్ (107)

రౌండ్ 21 : టీఆర్ఎస్ (3,431), బీజేపీ (5,151), కాంగ్రెస్ (136)
రౌండ్ 22 : టీఆర్ఎస్ (3,715), బీజేపీ (5,048), కాంగ్రెస్ (109)

Read This : Etala Rajender : ఏడోసారి గురితప్పని ఈటె.. అపజయం ఎరుగని రాజేందర్!