Exercises : కిడ్నీ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరిచే వ్యాయామాలు

కిడ్నీ రోగులు ఫిట్‌గా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని తేలికపాటి వ్యాయామాలను చేయటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు.

Exercises : కిడ్నీ రోగుల జీవన నాణ్యతను మెరుగుపరిచే వ్యాయామాలు

Kidney Exercise

Exercises : ఉరుకుల,పరుగుల జీవితంలో చాలా మంది వ్యాయామానికి, శరీరక శ్రమకు దూరమౌతున్నారు. దీని ఫలితంగా వివిధ మానసిక సమస్యలు, ఆరోగ్య సమస్యలు ఉత్పన్నం అవుతున్నాయి. క్రమం తప్పకుండా వ్యాయామం చేసే వ్యక్తులు వ్యాయామాలు చేయని వారికంటే ఆరోగ్య పరంగా మెరుగ్గానే ఉంటారు. ముఖ్యంగా కిడ్నీ వంటి జబ్బులతో బాధపడేవారు సైతం సరైన వ్యాయామాలు చేయకపోవటం వల్ల కొన్ని రకాల సమస్యలు చుట్టుముడుతున్నాయి. క్లిష్టతమైన వ్యాయామాలను కిడ్నీ వ్యాధితో బాధపడేవారు, డయాలసిస్ రోగులు చేయలేక పోయినప్పటికీ తేలిక పాటి వ్యాయామాల వల్ల కిడ్నీలను సంరక్షణకు మేలు చేకూరుతుందని నిపుణులు చెబుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచంలో దాదాపు 700 మిలియన్ల మంది ప్రజలు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధితో బాధపడుతున్నారు. భారతదేశంలో 75 లక్షల మందికి పైగా రోగులు దీర్ఘకాలిక మూత్రపిండ వ్యాధి జీవితాన్ని గడుపుతున్నట్లు అంచనా…సగటున, దేశంలో ప్రతి సంవత్సరం దాదాపు 200,000 మంది కొత్త రోగులు ఎండ్-స్టేజ్ కిడ్నీ వైఫల్యాలతో సతమతమౌతున్నారు. సాధారణ వ్యక్తులు సరైన జీవనశైలిని కొనసాగించకపోతే,నిరాశ, అధిక రక్తపోటు, బలహీనమైన రోగనిరోధక శక్తి, గుండె జబ్బులు ,పాదాలు,కాళ్ళలో వాపులు వంటి సమస్యలకు గురయ్యే ప్రమాదం ఉంటుంది.

కిడ్నీ రోగులు ఫిట్‌గా ఉండటానికి, ఆరోగ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని తేలికపాటి వ్యాయామాలను చేయటం ఆరోగ్యానికి శ్రేయస్కరమని నిపుణులు సూచిస్తున్నారు. ఇందుకోసం అవసరమైతే వైద్యుల సలహాలు సూచనలు తీసుకోవాలి. వైద్యుని సూచనలు, సలహాలతో తేలికపాటి వ్యాయామాలు చేయాలి. అలా చేస్తున్న సందర్భాల్లో అసౌకర్యం, అలసట, ఊపిరి ఆడకపోవటం, వంటి సమస్యలు ఉత్పన్నమైతే వాటిని నిలిపి వేయటం మంచిది. సురక్షితంగా చేయగలిగిన వ్యాయామాలు మాత్రమే ప్రయత్నించాలి. మూత్ర పిండాల వ్యాధితో బాధపడుతున్న వారు తగినంత శారీరక శ్రమ వల్ల మెరుగైన ఆరోగ్యం చేకూరుతున్నట్లు నేషనల్ యాంగ్ మింగ్ యూనివర్శిటీ ఆఫ్ తైవాన్ పరిశోధనల్లో తేలింది.

మూత్రపిండాల రోగులకు వ్యాయామాలు :

1. నడక: ఇది చాలా సురక్షితమైన వ్యాయామం, అందరికీ అనుకూలంగా ఉంటుంది. ఇది ఎక్కడైనా ,ఎప్పుడైనా చేయవచ్చు. అస్సలు వ్యాయామం చేయని వ్యక్తులు ఐదు నిమిషాల నడకతో ప్రారంభించండి. చాలా నెమ్మదిగా, చాలా ప్రశాంతంగా, ఎటువంటి ఇబ్బందులు లేకుంటే ఒక వారం పాటు రోజుకు ఐదు నిమిషాల చొప్పున నడవటండి. తరువాత దానిని 10 నిమిషాలకు పెంచండి. ఇలా నడక వ్యవధిని పెంచుకోవటం మంచిది.

2. యోగా ; యోగాసనాలు శరీరానికి మేలు చేస్తాయి. శ్వాస వ్యాయామాలు చేయవచ్చు. ధ్యానం మనస్సును ఒత్తిడి, టెన్షన్‌లు లేకుండా ఉంచడానికి సహాయపడుతుంది. సిట్ అప్‌లు, స్క్వాట్‌లు, కాఫ్ రైజ్‌లు, డిప్‌లు, పుల్-అప్‌లు మొదలైనవాటిని డయాలసిస్ చేసే వ్యక్తులు సులభంగా చేయవచ్చు.

3. ఫ్రీస్టైల్ డ్యాన్స్: ఇష్టమైన సంగీతాన్ని ప్లే చేటయటం ద్వారా దానికి అనుగుణంగా డ్యాన్స్ చేయవచ్చు. అలాగని వేగంగా చేయటం ఏమంత మంచిది కాదు. తేలకపాటి నృత్యాల వల్ల శరీరంలో కదలికలు మేలు చేస్తాయి.

4. ఈత: వైద్యుల సలహా తీసుకుని ఈతను వ్యాయామంగా ఎంచుకోవచ్చు. దీని వల్ల శరీరం మొత్తం కదులుతుంది.

వ్యాయామంతో కూడిన ఆరోగ్యకరమైన సమతుల్య ఆహారం తీసుకోవాలి. బరువును అదుపులో ఉంచుకోవాలి. ఇలా చేయటం వల్ల జీవితకాలం పెరిగే అవకాశాలు ఉంటాయి.