Electric bike: పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తప్పిన ప్రమాదం..

భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. లీటర్ పెట్రోల్ రూ. 115పైగా ఉండటంతో పెట్రోల్ పోయించుకొని బైక్‌పై వెళ్లడం కంటే బస్సులు ...

Electric bike: పేలిన ఎలక్ట్రిక్ బైక్.. తప్పిన ప్రమాదం..

Electric Bike

Electric bike: భారీగా పెరిగిన పెట్రోల్ ధరలతో ద్విచక్ర వాహనాలపై ప్రయాణించాలంటే ప్రజలు భయపడుతున్నారు. లీటర్ పెట్రోల్ రూ. 115పైగా ఉండటంతో పెట్రోల్ పోయించుకొని బైక్‌పై వెళ్లడం కంటే బస్సులు, ఇతర వాహనాలను ఆశ్రయించటం మంచిదన్న భావనను వ్యక్తం చేస్తున్నారు. అయితే పెట్రోల్ బైక్‌లకు ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రికల్ బైక్‌లు అందుబాటులోకి రావడంతో వాహన దారులు భారీ సంఖ్యలో వాటి కొనుగోళ్లు చేపట్టారు. అయితే ఎలక్ట్రికల్ బైక్‌లు పేలుతుండటంతో వాహనదారులు భయాందోళన చెందుతున్నారు.

Electric Bike Catches Fire : వామ్మో ఎలక్ట్రిక్ బైక్.. నడుపుతుండగా సీటు కింద నుంచి ఒక్కసారిగా మంటలు

ఇప్పటికే పలు ప్రాంతాల్లో ఎలక్ట్రిక్ బైక్‌లు పేలి పలువురు మృతి చెందిన ఘటనలు ఉన్నాయి. తాజాగా కరీంనగర్ జిల్లా రామడుగు మండలం రామచంద్రాపూర్‌లో ఎలక్ట్రిక్ బైక్ పేలింది. గ్రామానికి చెందిన వ్యక్తి ఎలక్ట్రిక్ బైక్‌కు ఛార్జిగ్ పెట్టగా కాసేపటికే బైక్ పేలింది. అయితే అప్పటి వరకు బైక్ వద్ద ఉన్న కుటుంబ సభ్యులు బైక్‌ను వీడి పక్కకు వచ్చిన తరువాత బైక్ పేలడంతో పెనుప్రమాదం తప్పినట్లయింది. అయితే బెన్లింగ్ ఫాల్కన్ ఎలక్ట్రిక్ వాహనాన్ని సదరు వాహనదారుడు రెండు నెలల క్రితమే కొనుగోలు చేసినట్లు తెలిసింది.

Electric bike: కొత్త స్కూటీ మార్గం మధ్యలో ఆగిందని పెట్రోల్ పోసి తగలబెట్టిండు

ఇదిలా ఉంటే దేశవ్యాప్తంగా వరుసగా ఎలక్ట్రికల్ బైక్స్ పేలుడు ఘటనలు చోటు చేసుకుంటుండటంతో కారణాలను తెలుసుకొనేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీని నియమించింది. ఈ కమిటీ పూర్తిస్థాయిలో దర్యాప్తు చేసి ఎలక్ట్రిక్ బైక్ లలో మంటలు చెలరేగడానికి ప్రధాన కారణాల్లో బ్యాటరీ సెల్స్, మాడ్యూల్స్ లోపభూయిష్టంగా ఉండటమే అని ప్రాథమిక పరిశోధన ప్రకారం వెల్లడైనట్లు సమాచారం. విచారణకు సంబంధించిన తుది నివేదిక రెండు వారాల్లో వెలువడనున్నట్లు సంబంధిత వర్గాల నుంచి తెలుస్తోంది.