F3 Film: సంక్రాంతి బరిలో వెంకీ మామ.. భారీ సినిమాలతో ఢీ!

తెలుగు సంస్కృతిలో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత ఏంటో మనందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేకతలో సినిమా వినోదం అనేది ఎప్పటినుండో భాగమైపోయింది. అందుకే మన సినిమా మేకర్స్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసి సినిమాలు విడుదల చేస్తుంటారు. అందుకే సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ గా వస్తుంది.

F3 Film: సంక్రాంతి బరిలో వెంకీ మామ.. భారీ సినిమాలతో ఢీ!

F3 Film

F3 Film: తెలుగు సంస్కృతిలో సంక్రాంతికి ఉన్న ప్రత్యేకత ఏంటో మనందరికీ తెలిసిందే. ఈ ప్రత్యేకతలో సినిమా వినోదం అనేది ఎప్పటినుండో భాగమైపోయింది. అందుకే మన సినిమా మేకర్స్ కూడా సంక్రాంతిని టార్గెట్ చేసి సినిమాలు విడుదల చేస్తుంటారు. అందుకే సినిమాకు సంక్రాంతి పండుగ అనేది పెద్ద మార్కెట్ గా వస్తుంది. సినిమా ఏమాత్రం బాగున్నా వసూళ్ల వర్షం కురుస్తుంది. ప్రతి ఏడాది మాదిరే వచ్చే సంక్రాంతికి భారీ సినిమాలను ప్లాన్ చేస్తున్నారు.

ఇప్పటికే గత రెండేళ్లగా కరోనా భయంతో ప్రేక్షకులు థియేటర్స్ కు దూరంగా ఉంటున్నారు. థియేటర్స్ ఎప్పుడు తెరుచుకుంటాయా.. వెండితెర మీద తమ అభిమాన హీరోల సినిమాను చూడాలా అని ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్నారు. అలాంటి వారికోసమే సంక్రాంతికి టార్గెట్ పెట్టుకొని బడా బడా హీరోలంతా దిగిపోతున్నారు. ఈ జాబితాలో పవన్-రానాల భీమ్లా నాయక్, మహేష్ సర్కారు వారి పాట, ప్రభాస్ రాధేశ్యామ్, తమిళ హీరో విజయ్ బీస్ట్ ఇప్పటికే డేట్స్ ఖరారు చేసుకున్నారు.

అయితే, వెంకటేష్-వరుణ్ తేజ్ ఎఫ్-3ని కూడా సంక్రాంతి బరిలోనే దించేందుకు సిద్ధమవుతున్నారు. నారప్ప సక్సెస్ మీట్ లో నాగార్జున ఈ విషయాన్ని లీక్ చేశాడు. ఇప్పటి వరకు తేదీని ప్రకటించలేదు కానీ.. ఎఫ్-3ను జనవరి 15న విడుదల చేసేందుకు సన్నాహాలు జరుగుతున్నట్లు తెలుస్తుంది. అయితే.. మహేష్, పవన్, ప్రభాస్ లాంటి హీరోల భారీ సినిమాలను ఎఫ్-3 తట్టుకొని నిలబడుతుందా అనేది ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. సినిమా మీద నమ్మకంతోనే దర్శక, నిర్మాతలు ఈ టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుంది. మరి, ఇది ఎంతవరకు ఈ టీంకు కలిసి వస్తుందో చూడాలి.