Final Funerals : అంత్యక్రియలు అడ్డుకున్నస్ధానికులు…చితిపై కూర్చుని నిరసన

ఖమ్మం జిల్లా వేంసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలనీలో ఇళ్ల సమీపాన దహన సంస్కారాలు నిర్వహించ వద్దంటూ స్ధానికులు ఆందోళన చేశారు.

Final Funerals : అంత్యక్రియలు అడ్డుకున్నస్ధానికులు…చితిపై కూర్చుని నిరసన

Final Funerals

Final Funerals : ఖమ్మం జిల్లా వేంసూరులో దారుణ ఘటన చోటు చేసుకుంది. కాలనీలో ఇళ్ల సమీపాన దహన సంస్కారాలు నిర్వహించ వద్దంటూ స్ధానికులు ఆందోళన చేశారు. మండల కేంద్రంలోని అంబేద్కర్ కాలనీలో  స్మశాన వాటిక లేకపోవటంతో ఎవరైనా మరణిస్తే వారి అంత్యక్రియలు నిర్వహించటం కష్టంగా మారింది.

కొద్ది కాలంగా కాలనీ చివర మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. స్ధానికుల ఇబ్బందులు గమనించిన ప్రభుత్వం ఊరి చివర వైకుంఠధామాన్ని ఏర్పాటు చేసింది. అయినా కొందరు కాలనీలో ఇళ్ళ  సమీపాన పాత స్ధలంలోనే మృతదేహాలకు అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు.
Also Read : Crores In Daily Wager Bank Account : రోజు కూలీ ఎకౌంట్ లో రూ. 9.99 కోట్ల డిపాజిట్లు
గురువారం ఓ వ్యక్తి మరణించటంతో అతనికి అంత్యక్రియలు నిర్వహించేందుకు కుటుంబ సభ్యులు ఏర్పాట్లు చేశారు. ఇది గమనించిన స్ధానికులు అంత్యక్రియలను అడ్డుకున్నారు. అంతేకాకుండా అక్కడ అప్పటికే ఏర్పాటు చేసిన చితిపై కూర్చుని నిరసన తెలిపారు. చివరికి మృతుడి బంధువులు నచ్చ చెప్పగా దహన సంస్కారాలకు ఒప్పుకోవటంతో వివాదం సద్దుమణిగి అంత్యక్రియలు నిర్వహించారు.