Crores In Daily Wager Bank Account : రోజు కూలీ ఎకౌంట్ లో రూ. 9.99 కోట్ల డిపాజిట్లు

బీహార్‌కు చెందిన పేదల బ్యాంకు ఎకౌంట్లలో ఇటీవల కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోక రోజు కూలీ ఎకౌంట్ లో ఏకంగా రూ. 9.99 కోట్లు రూపాయలు ఉన్నట్లు కనుగొన్నారు.

Crores In Daily Wager Bank Account : రోజు కూలీ ఎకౌంట్ లో రూ. 9.99 కోట్ల డిపాజిట్లు

Crores In Daily Wager Bank Account

Crores In Daily Wager Bank Account :  బీహార్‌కు చెందిన పేదల బ్యాంకు ఎకౌంట్లలో ఇటీవల కోట్ల రూపాయలు డిపాజిట్ అవుతున్న విషయం తెలిసిందే. తాజాగా మరోక రోజు కూలీ ఎకౌంట్ లో ఏకంగా రూ. 9.99 కోట్లు రూపాయలు ఉన్నట్లు కనుగొన్నారు.

పాట్నాలో దినసరి కూలీగా పని చేసే విపిన్ చౌహాన్ అనే వ్యక్తి మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ  పధకంలో జాబ్ కార్డు కోసం ముందుగా బ్యాంకులో ఖాతా తెరవటానికి వెళ్లాడు.  సుపాల్ లోని   యూనియన్ బ్యాంక్‌కు  వెళ్లి తన   ఆధార్ కార్డు వివరాలు ఇచ్చాడు.  వివరాలు అన్నీ తీసుకున్నబ్యాంకు సిబ్బంది ఆధార్ కార్డ్ వివరాలను తమ కంప్యూటర్ లో ఎంటర్ చేయగానే అతని పేరు మీద ఒక బ్యాంకు ఎకౌంట్ ఉన్నట్లు గుర్తించారు.

ఆ ఎకౌంట్ లో రూ. 9.99  కోట్ల డిపాజిట్లు ఉన్నట్లు తెలిపారు. నేను ఇంతవరకు బ్యాంకు ఎకౌంట్   ఓపెన్ చేయలేదు అని చెప్పేసరికి… ఆల్ రెడీ ఉన్న బ్యాంకు ఎకౌంట్ వివరాలు తెలుసుకునేందుకు ప్రయత్నించారు బ్యాంకు సిబ్బంది.  వారి వద్ద లభించక పోవటంతో పాట్నాలోని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా హెడ్ ఆఫీసుకు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

వారు అతని ఎకౌంట్ వివరాల కోసం ప్రయత్నించగా 2016 అక్టోబర్ 13న అకౌంట్ ఓపెన్ చేసినట్లు గుర్తించారు. 2017 ఫిబ్రవరిలో అకౌంట్ లో కోట్లలో డబ్బు  డిపాజిట్  అయినట్లు గుర్తించారు. కానీ బ్యాంక్ అధికారుల వద్ద విపిన్ ఫోటోకానీ, సంతకం కానీ, వేలిముద్రకానీ లేదు. కేవలం ఆధారా కార్డ్ నెంబరు మాత్రమే ఉంది. సేవింగ్స్ బ్యాంక్ ఎకౌంట్ ఓపెనింగ్ ఫారమ్ కూడా దొరకలేదు.
Also Read : AP Secretariat : సచివాలయం ఉద్యోగులకు ఉచిత వసతి నిలిపివేత

ఈ అకౌంట్ లో ఇప్పటికీ రూ. 9.99 కోట్ల నగదు నిల్వ ఉన్నట్లు హెడ్ ఆఫీసు అధికారులు కూడా తెలిపారు. దీంతో అధికారులు ఎకౌంట్ ను ఫ్రీజ్ చేసి అంతర్గత  విచారణ చేపట్టారు. ఈ అకౌంట్ నెంబర్ తో మరేమైనా లావాదేవీలు జరిగాయా అని దర్యాప్తు చేస్తున్నట్లు యూనియన్ బ్యాంకు అధికారులు చెప్పారు.

బీహార్ లో ఇలాంటి కేసుల్లో ఇది మొదటిది కాదు. ఇటీవ‌ల ముజాఫ‌ర్‌పూర్  జిల్లాలోని కాట్రా పోలీసు స్టేషన్ పరిధిలోని సింగారి గ్రామానికి   చెందిన రామ్ బ‌హ‌దూర్ షా అకౌంట్లో రూ.52 కోట్లు గుర్తించిన విష‌యం తెలిసిందే. ఖ‌తిహార్ జిల్లాలో 6 వ తరగతి చదువుతున్న ఇద్ద‌రు స్కూల్ విద్యార్ధుల అకౌంట్ల‌లోనూ కోట్ల రూపాయ‌లు ఉన్న‌ట్లు గుర్తించారు.

Also Read : Girl Raped By Father : కన్న కూతురిపై తండ్రి అత్యాచారం

అంతేకాక రంజిత్ దాస్ అనే వ్య‌క్తి అకౌంట్‌లోకి 5.5 ల‌క్ష‌లు డిపాజిట్ అయ్యాయి. అయితే ఆ డ‌బ్బును తిరిగి ఇచ్చేందుకు అత‌ను నిరాక‌రించాడు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రతి దేశ పౌరుడికి రూ.15లక్షలు ఇస్తానని వాగ్దానం చేశారని అందులో మొదటి విడతగా రూ.5.5 లక్షలు డిపాజిట్ చేశారని వాదించాడు. డబ్బు తిరిగి ఇవ్వక పోవటంతో బ్యాంకు అధికారులు కేసు పెట్టారు. పోలీసుల అతడి పై ఎఫ్ ఐఆర్ నమోదు చేసి జైల్లో పెట్టారు.