Minister Harish Rao : బస్తీ దవాఖానాల సేవలతో పెద్దాస్పత్రుల్లో గణనీయంగా తగ్గిన ఓపీ : మంత్రి హరీశ్ రావు

బస్తీల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంబించారని.. అవి అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు సమాధానాలు ఇచ్చారు.

Minister Harish Rao : బస్తీ దవాఖానాల సేవలతో పెద్దాస్పత్రుల్లో గణనీయంగా తగ్గిన ఓపీ : మంత్రి హరీశ్ రావు

Minister Harish Rao

Minister Harish Rao : బస్తీల సుస్తీ పోగొట్టేందుకు సీఎం కేసీఆర్ బస్తీ దవాఖానాలు ప్రారంబించారని.. అవి అద్భుతమైన సేవలు అందిస్తున్నాయని ఆర్థిక, అరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు తెలిపారు. బస్తీ దవాఖానాలు పేద ప్రజల సుస్తీలు పోగొట్టి, దోస్తీ దవాఖానలుగా పేరు గాంచాయని కొనియాడారు. అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో మంత్రి హరీశ్ రావు సమాధానాలు ఇచ్చారు. రూ. 800 విలువ చేసే లిక్విడ్ ప్రొఫైల్ టెస్ట్ 1.48 లక్షల మందికి, థైరాయిడ్ పరీక్షలు లక్షా 800 మందికి చేశామని తెలిపారు.

ప్రస్తుతం 57 పరీక్షలు చేస్తున్నామని.. త్వరలో 134 రకాల పరీక్షలను పెంచుతామన్నారు. ఆదివారం కాకుండా శనివారం బస్తీ దవాఖానలకు సెలవు ఇస్తున్నామని చెప్పారు. 158 రకాల మందులు ఉచితంగా ఇస్తున్నామని తెలిపారు. బస్తీ దవాఖానలు స్థానికంగా సేవలందిస్తుండడం వల్ల పెద్ద ఆస్పత్రుల్లో ఓపీ తగ్గినట్లు గణాంకాలు చెబుతున్నాయని పేర్కొన్నారు. 2019 బేస్ ఇయర్ ఓపీ తో పోల్చితే… ఉస్మానియా ఆస్పత్రిలో 2019లో 12 లక్షల మంది ఉండగా, 2022 ఇప్పటి వరకు 5 లక్షల మంది (60%) తగ్గారని పేర్కొన్నారు.

Minister Harish Rao : గోదావరి నీళ్లను మంజీరాకు మళ్లించిన చరిత్ర బీఆర్ఎస్ ప్రభుత్వానిది : మంత్రి హరీశ్ రావు

గాంధీలో 2019లో ఆరున్నర లక్షల మంది కాగా, 2022 ఇప్పటి వరకు 3.7 లక్షల మంది (56%) ఓపీ పేషెంట్లు తగ్గారని వెల్లడించారు. నిలోఫర్ 2019 ఎనిమిది లక్షల మంది ఉండగా, 2022 నుంచి ఇప్పటి వరకు 5.3 లక్షలు (44%) తగ్గారని చెప్పారు. ఫీవర్ ఆసుపత్రిలో 2019 లో 4 లక్షలు కాగా, 2022 నుంచి ఇప్పటి వరకు లక్ష 12 వేలు (72%) ఉన్నారని తెలిపారు. పెద్దాసుప‌త్రుల్లో ఓపీ త‌గ్గ‌గా, శ‌స్త్ర చికిత్స‌ల సంఖ్య గ‌ణ‌నీయంగా పెరిగిందన్నారు.

సీరియ‌స్ పేషెంట్ల‌కు వైద్యం అందించ‌డంపై ఎక్కువ దృష్టి పెట్ట‌డం పెద్దాసుప‌త్రుల్లో సాధ్యం అవుతుందన్నారు. కోటి మంది ప్రజలు బస్తీ దవాఖాన సేవలు పొందారని పేర్కొన్నారు. వచ్చే ఏప్రిల్ లో అన్ని జిల్లాలో న్యూట్రిషన్ కిట్ చేస్తామని చెప్పారు. బస్తీ దవాఖానలో త్వరలో బయోమెట్రిక్ విధానం అమలు చేస్తామని చెప్పారు. జీహెచ్ఎంసీ పరిధిలో 1,500 ఆశ పోస్టుల భర్తీకి ఈ నెలలో నోటిఫికేషన్ జారీ చేస్తామని తెలిపారు.