Traffic Challan : ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్‌‌కు ఫుల్ రెస్పాన్స్.. రూ. 140 కోట్ల జరిమాన వసూల్

మొత్తంగా రూ. 140 కోట్ల జరిమాన వసూలైంది. రాయితీకి మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువును ఉపయోగించుకోని వారు..తనిఖీల్లో చలాన్లు ఉంటే.. మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని...

Traffic Challan : ట్రాఫిక్ చలాన్ క్లియరెన్స్‌‌కు ఫుల్ రెస్పాన్స్.. రూ. 140 కోట్ల జరిమాన వసూల్

Trafic

Full Response Traffic Challan : తెలంగాణ రాష్ట్రంలో ట్రాఫిక్ పోలీసులు ప్రకటించిన చలాన్ క్లియరెన్స్ కు భారీ స్పందన వస్తోంది. మరోసారి ఇలాంటి ఆఫర్ వస్తుందో రాదోనని భావిస్తున్న వాహనదారులు చలాన్లను చెల్లించేస్తున్నారు. ఆన్ లైన్ లో చెల్లిస్తుండడంతో సర్వర్ జామ్ అవుతోంది. 2022, మార్చి 01వ తేదీ నుంచి 15వ తేదీ వరకు రూ. 1.3 కోట్ల పెండింగ్ చలాన్లు క్లియర్ అయ్యాయి. నిమిషానికి వెయ్యి చలాన్లను వాహనదారులు క్లియర్ చేసుకుంటున్నారు. మొదటి రోజే రూ. 5.5 కోట్ల ఫైన్లు చెల్లించారు. తెలంగాణ వ్యాప్తంగా ఈనెల 31వ తేదీ వరకు ఆఫర్ వర్తించనుంది.

Read More : Tata UPI App : గూగుల్‌ పే, ఫోన్‌పేకు పోటీగా.. టాటా యూపీఐ యాప్ వచ్చేస్తోంది..!

మొత్తంగా రూ. 140 కోట్ల జరిమాన వసూలైంది. రాయితీకి మరో 15 రోజులు మాత్రమే గడువు ఉంది. ఈ గడువును ఉపయోగించుకోని వారు..తనిఖీల్లో చలాన్లు ఉంటే.. మొత్తం బకాయిలు చెల్లించాల్సి ఉంటుందని ట్రాఫిక్ పోలీసు ఉన్నతాధికారులు వెల్లడించారు. ఏప్రిల్ నెల నుంచి వాహనాలపై పెండింగ్ చలాన్లు తనిఖీలు చేసి చార్జిషీట్లు దాఖలు చేసేందుకు ట్రాఫిక్ పోలీసులు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. చలాన్లను క్లియర్ చేయని వారు ఆన్ లైన్, మీ సేవ, ట్రాఫిక్ కంట్రోల్ రూం వద్ద చెల్లింపులు చేయొచ్చని సూచిస్తున్నారు. ఈ చలాన్లకు సంబంధించి వెబ్ సైట్ https:/echallan.tspolice.gov.in లింక్ ద్వారా రాయితీతో జరిమాన కట్టొచ్చంటున్నారు.

Read More :Hyderabad Traffic : 8 గంటల్లో లక్షా 77 వేల చలాన్లు క్లియర్..

నో మాస్క్ కేసులు 90 శాతం మాఫీ
రెండు, మూడు వాహనాలకు 75 శాతం మాఫీ
ఆర్టీసీ డ్రైవర్లకు 70 శాతం మాఫీ
లైట్, హెవీ మోటార్ వాహనాలకు 50 శాతం మాఫీ
తోపుడు బండ్లకు 75 శాతం మాఫీ

Read More : New Traffic Fines : GHMC వాహనాలపై భారీగా చలాన్లు

తమ వాహనానికి ఏమైనా పెండింగ్ చలాన్లు ఉన్నాయనేది ఆయా ట్రాఫిక్ పోలీసుల వెబ్ సైట్ చూసి తెలుసుకోవచ్చు.
తొలుతగా సిటీ ట్రాన్స్ పోర్టు వెబ్ సైట్‌లోకి వెళ్లాలి.
ఆప్షన్ల వద్ద వాహన రిజిష్టర్ నెంబర్, దానిపక్కనే పైన ఉన్న కోడ్ ఎంటర్ చేయాలి. గో ఆప్షన్‌పై క్లిక్ చేయండి.
వాహనంపై ఉన్న ట్రాఫిక్ ఉల్లంఘనలు కనిపిస్తాయి.
ఎప్పుడు, ఎక్కడ, ఏ విధంగా నిబంధనలు ఉల్లంఘించారో స్పష్టం తెలియచేస్తుంది.
మీ చలాన్ వివరాలను ప్రింట్ కూడా తీసుకోవచ్చు.
చలాన్‌ను నెట్ బ్యాంకింగ్ ద్వారా మీ సేవ ద్వారా చెల్లించే ఛాన్స్ ఉంది.