Gautam Adani: ఒడిశా రైలు ప్రమాదంలోని చిన్నారులకు చదువు చెప్పిస్తామని ముందుకు వచ్చిన అదానీ

ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్నట్టు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతీ శనివారం సాయంత్రం ప్రకటించారు.

Gautam Adani: ఒడిశా రైలు ప్రమాదంలోని చిన్నారులకు చదువు చెప్పిస్తామని ముందుకు వచ్చిన అదానీ

Gautam Adani

Odisha Train Accident: దాదాపు 300 మంది ప్రాణాలను బలిగొన్న ఒడిశా రైలు దుర్ఘటనలో తల్లదండ్రులను కోల్పోయిన చిన్నారులను ఆదుకునేందుకు ప్రముఖ పారిశ్రామికవేత గౌతమ్ అదానీ ముందుకు వచ్చారు. ఒడిశా రైలు దుర్ఘటనలో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లల పాఠశాల విద్యకు అయ్యే ఖర్చులు తాము భరిస్తామని ఆయన ప్రకటించారు. ఆదివారం ట్విట్టర్ ద్వారా అదానీ స్వయంగా ఈ ప్రకటన చేశారు.

Rahul Gandhi: తదుపరి టార్గెట్ తెలంగాణ ఎన్నికలు.. ఏం చేస్తామంటే?: అమెరికాలో రాహుల్ గాంధీ కామెంట్స్

”ఒడిశా దుర్ఘటన మనందరినీ తీవ్ర విచారంలో ముంచెత్తింది. ఈ ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారుల పాఠశాల విద్య బాధ్యతను అదానీ గ్రూప్ చేపట్టాలని నిర్ణయించాం. బాధితులు, వారి కుటుంబాలకు చేయూత నివ్వడం, పిల్లల రేపటి భవిష్యత్తకు అండగా ఉండాల్సిన బాధ్యత మనందరిపై ఉంది” అని అదానీ ఆ ట్వీట్‌ చేశారు.


ఇక ఈ ఘోరప్రమాదం నేపథ్యంలో ప్రభుత్వరంగ బీమా దిగ్గజం ఎల్‌ఐసీ కీలక ప్రకటన చేసింది. ఒడిశా రైలు ప్రమాద బాధితులకు పాలసీ క్లెయిమ్ సెటిల్మెంట్ ప్రక్రియలో కొన్ని మినహాయింపులు కల్పించనున్నట్టు తెలిపింది. బాధితుల బంధువులకు ఈ ప్రత్యేక రిలీఫ్ ఇవ్వనున్నట్టు ఎల్ఐసీ చైర్మన్ సిద్ధార్థ మొహంతీ శనివారం సాయంత్రం ప్రకటించారు.