GHMC : కౌశిక్ రెడ్డికి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ

కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి..టీఆర్ఎస్ లో చేరనున్న సందర్భంగా..నగరంలో ఫ్లెక్సీలు, జెండాలు కట్టారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లపై నగర వాసులు ట్విట్టర్ వేదికగా జీహచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి.

GHMC : కౌశిక్ రెడ్డికి షాక్ ఇచ్చిన జీహెచ్ఎంసీ

Ghmc

GHMC Imposed Fine To Kaushik Reddy : హుజూరాబాద్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీలో కీలక నేతగా ఉన్న కౌశిక్ రెడ్డి టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారు. 2021, జూలై 21వ తేదీ బుధవారం ఆయన సీఎం కేసీఆర్ సమక్షంలో టీఆర్ఎస్ లో చేరారు. ఇలా చేరారో..లేదో…ఆయనకు జీహెచ్ఎంసీ షాక్ ఇచ్చింది.

Read More : Samsung Galaxy A22 5G ఫోన్ వచ్చేస్తోంది.. జూలై 23నే లాంచ్.. ఫీచర్లు అదుర్స్!

ఏదైనా పార్టీలో చేరుతుంటే..పలు ప్రాంతాల్లో భారీ హోర్డింగ్స్, ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తుంటారు నేతలు. కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పిన కౌశిక్ రెడ్డి..టీఆర్ఎస్ లో చేరనున్న సందర్భంగా..నగరంలో ఫ్లెక్సీలు, జెండాలు కట్టారు. వివిధ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలు, హోర్డింగ్ లపై నగర వాసులు ట్విట్టర్ వేదికగా జీహచ్ఎంసీకి ఫిర్యాదులు అందాయి. మొత్తంగా 10 ఫిర్యాదులు అందాయి. వీటిని చూసిన జీహెచ్ఎంసీ ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు.

Read More : Telangana : 24 గంటల్లో 691 కరోనా కేసులు, 05 మంది మృతి

పది ఫిర్యాదులకు గాను…రూ. 2 లక్షల 50 వేల జరిమాన విధించారు. రెండు ఫిర్యాదులకు లక్ష రూపాయల చొప్పున ఒక ఫిర్యాదుకు రూ. 15 వేలు మిగిలిన వాటికి రూ. 5 వేల చొప్పున ఫైన్ లు వేసింది జీహెచ్ఎంసీ. ఇంకా అనేక మంది ట్విట్టర్ వేదికగా జీహెచ్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. ఫిర్యాదులు స్వీకరిస్తున్న ఉన్నతాధికారులు వాటికి కూడా ఫైన్ లు వేయనున్నారని సమాచారం. LV ప్రసాద్ మార్గంలో ఏర్పాటు చేసిన భారీ హోర్డింగ్ కు లక్ష రూపాయల జరిమాన విధించింది జీహెచ్ఎంసీ. మొత్తం రూ. 3 లక్షల 50 వేల ఫైన్ విధించింది.

Read More : Sonu Sood : అమ్మా..చాలా మిస్ అవుతున్నా

దీనిపై టీపీసీసీ సీనియర్ ఉపాధ్యక్షులు మల్లు రవి కూడా స్పందించారు. నగరంలో టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను తొలగించాలని జీహెచ్ఎంసీ అధికారులకు ఫిర్యాదు చేసిన పట్టించుకోలేదని మల్లురవి ఆరోపించారు. ఫెక్సీలపై నిషేధం కేవలం ప్రతిపక్షాలకే వర్తిస్తుందా ? అని నిలదీశారాయన. అధికార పార్టీ ఫ్లెక్సీల విషయంలో…ఇలాగే ఉంటే..ఛలో జీహెచ్ఎంసీ కార్యక్రమం నిర్వహించాల్సి ఉంటుందని మల్లు రవి వెల్లడించారు.