Goa Election : గోవాలో బీజేపీకి షాక్..టీఎంసీతో పొత్తు ప్రకటించిన ఎంజీపీ

వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ మాజీ మిత్రపక్షమైన మ‌హారాష్ట్రవాది గోమంత‌క్ పార్టీ (MGP) రానున్న గోవా ఎన్నిక‌ల్లో

Goa Election : గోవాలో బీజేపీకి షాక్..టీఎంసీతో పొత్తు ప్రకటించిన ఎంజీపీ

Goa Election :  వచ్చే ఏడాది ప్రారంభంలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న గోవాలో అధికార బీజేపీకి బిగ్ షాక్ తగిలింది. బీజేపీ మాజీ మిత్రపక్షమైన మ‌హారాష్ట్రవాది గోమంత‌క్ పార్టీ (MGP) రానున్న గోవా ఎన్నిక‌ల్లో మ‌మ‌తా బెన‌ర్జీ సార‌ధ్యంలోని తృణ‌మూల్ కాంగ్రెస్‌తో జ‌ట్టు కట్టనున్నట్లు సోమవారం ప్రకటించింది. అయితే ఎంజీపీతో పొత్తు విషయమై ఆ పార్టీతో చర్చలు జరుపుతున్నట్లు బీజేపీ చెబుతున్న సమయంలోనే..సోమవారం ఎంజీపీ అధ్యక్షుడు పాండురంగ్ దీప‌క్ ధ‌వ‌ళిక‌ర్ టీఎంసీతో పొత్తు ప్రకటన చేసి అందరినీ ఆశ్చర్చపర్చారు.

సోమవారం ఎంజీపీ అధ్యక్షుడు దీప‌క్ ధ‌వ‌ళిక‌ర్ మీడియాతో మాట్లాడుతూ…గోవా ఎన్నిక‌ల్లో తృణ‌మూల్ కాంగ్రెస్‌తో క‌లిసి పోటీచేయాల‌ని సోమవారం సమావేశమైన పార్టీ కేంద్ర క‌మిటీ ఏకగ్రీవంగా నిర్ణ‌యించింద‌ని,అయితే బెంగాల్ సీఎం మమతా బెనర్జీ గోవా పర్యటనకు వచ్చినప్పుడు పొత్తుపై సంయుక్తంగా అధికార ప్రకటన విడుదల చేస్తామని తెలిపారు. డిసెంబర్-13న మమతా బెనర్జీ గోవా పర్యటనకు వెళ్లనున్నట్లు సమాచారం.

వచ్చే ఏడాది జనవరి-15లోగా తమ కూటమి సీఎం అభ్యర్థి ఎవరనేదానిపై ప్రకటన వెలువడుతుందని దీపక్ ధవళికర్ తెలిపారు. ఎంజీపీ సీనియర్ లీడర్ రామక్రిష్ణ అలియాస్ సుదిన్ ధవళికర్ సీఎం అభ్యర్థి రేసులో ముందు వరుసలో ఉన్నట్లు చెప్పారు. బీజేపీకి పాలనపై ప్ర‌జ‌ల్లో తీవ్ర వ్య‌తిరేక‌త వ్య‌క్త‌మ‌వుతోంద‌ని,గోవా ప్ర‌జ‌ల‌కు మెరుగైన పాల‌న అందించేందుకే టీఎంసీ చేతులు క‌లుపుతున్నట్లు దీప‌క్ చెప్పారు. వచ్చే గోవా ఎన్నికల్లో బీజేపీ-కాంగ్రెస్ ను ఓడించడమే తమ కూటమి అజెండా అని దీపక్ సృష్టం చేశారు.

కాగా, 2017లో 40 స్థానాలున్న గోవా అసెంబ్లీకి జరిగిన ఎన్నికల్లో ఎంజీపీ 3 సీట్లను గెల్చుకుంది. ఎన్నికల తర్వాత సంకీర్ణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు బీజేపీకి మద్దతిచ్చింది ఎంజీపీ. అయితే 2019లో బీజేపీతో పొత్తుని తెగదెంపులు చేసుకుంది ఎంజీపీ. కాగా,ఎంజీపీకి చెందిన ఇద్దరు ఎమ్మెల్యేలు బీజేపీలో చేరడంతో ప్రస్తుతం ఎంజీపీకి ఒక్క ఎమ్మెల్యే మాత్రమే ఉన్నారు.

ALSO READ Work From Home New Norm : వర్క్ ఫ్రమ్ హోం ఉద్యోగులకు కొత్త చట్టం.. ఫ్రేమ్‌వర్క్‌పై కేంద్రం కసరత్తు!