Google Dark Theme: గూగుల్ సెర్చ్ పేజ్‌లో డార్క్ థీమ్.. ఆన్ చేసుకోండిలా

గూగుల్ టెస్టింగ్ పూర్తి చేసి మార్కెట్లోకి డార్క్ మోడ్ రిలీజ్ చేసింది. డెస్క్‌టాప్ లో సెర్చ్ పేజి కూడా ఇక డార్క్ మోడ్ లో వాడుకోవచ్చు.

Google Dark Theme: గూగుల్ సెర్చ్ పేజ్‌లో డార్క్ థీమ్.. ఆన్ చేసుకోండిలా

Google Dark Mode

Google Dark Theme: గూగుల్ టెస్టింగ్ పూర్తి చేసి మార్కెట్లోకి డార్క్ మోడ్ రిలీజ్ చేసింది. డెస్క్‌టాప్ లో సెర్చ్ పేజి కూడా ఇక డార్క్ మోడ్ లో వాడుకోవచ్చు. డెస్క్ టాప్‌లోనైనా ల్యాప్ ట్యాప్ మీదైనా గూగుల్ సెర్చ్ బార్ ఉపయోగించే వాళ్లకు ఇది కనిపిస్తుంది. సపోర్ట్ పేజి ద్వారా ఈ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది గూగుల్. మరి కొద్ది రోజుల్లో పూర్తి స్థాయిలో ఇది అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది.

ఫిబ్రవరిలో వెబ్ సెర్చ్ టెస్టింగ్ ను మొదలుపెట్టిన గూగుల్ నిజానికి దీనిని డిసెంబర్ లోనే బయటపెట్టింది. దీని గురించి గూగుల్ ప్రొడక్ట్ సపోర్ట్ మేనేజర్ హంగ్ ఎఫ్.. సపోర్ట్ పేజిలో ఇలా పేర్కొన్నారు.

‘దీని గురించి అనౌన్స్ చేయడం థ్రిల్ గా ఫీల్ అవుతున్నా. నేటి నుంచి స్టార్ట్ అవుతున్న డార్క్ మోడీ పేజ్ మరి కొద్ది వారాల్లో పూర్తి స్థాయిలో అందుబాటులోకి వస్తుంది. డార్క్ థీమ్ ప్రస్తుతం డెస్క్ టాప్ గూగుల్ సెర్చ్ పేజీలకు మాత్రమే అందుబాటులో ఉంది. దీని గురించి మీరిచ్చిన ఫీడ్ బ్యాక్ కు కృతజ్ఞతలు’ అని వెల్లడించారు.

Read Aslo: కూతురిపై ఏడాదిన్నరగా తండ్రి అత్యాచారం

అయితే ఇందులో మూడు ఆప్షన్లు ఎంచుకునే అవకాశం ఉంది. ఒకటి డార్క్, లైట్, డివైజ్ డిఫాల్ట్.
దీనిని ఎనేబుల్ చేసుకోవాలంటే ఇలా చేయండి..
1. ఏదైనా వెబ్ బ్రౌజర్‌లో.. గూగుల్ సెర్చ్ (Google Search) ఓపెన్ చేయండి. సెర్చ్ బార్(search bar)లో గూగుల్ సెర్చ్ అని టైప్ చేయండి.
2. ఆ తర్వాత పేజిలో టాప్ రైట్ కార్నర్‌లో ఉన్న సెట్టింగ్స్ (Settings) ఆప్షన్ సెలక్ట్ చేసుకోండి.
3. అందులో అప్పిరియెన్స్ (Appearance)క్లిక్ చేయండి.
4. అక్కడ కనిపిస్తున్న మూడు ఆప్షన్లలో ఏదో ఒకటి ఎంచుకునే డార్క్ సెర్చ్ మోడ్ ను ఎనేబుల్ చేసుకోవచ్చు.