Telangana : ఆర్ధిక వ్యవస్ధ గాడిలో పెట్టేందుకే భూముల అమ్మకం

కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే నిరర్ధక భూములను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.

Telangana : ఆర్ధిక వ్యవస్ధ గాడిలో పెట్టేందుకే భూముల అమ్మకం

Government Housing Plots For Sale In Telangana

Telangana : కరోనాతో కుదేలైన ఆర్థిక వ్యవస్థను గాడిలోపెట్టే పనిలో పడింది తెలంగాణ సర్కార్. ఇప్పటికే నిరర్ధక భూములను అమ్మేందుకు కసరత్తు ప్రారంభించిన ప్రభుత్వం.. తాజాగా హౌసింగ్‌ భూములను అమ్మేయాలని డిసైడ్‌ అయింది. తద్వారా 13 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది.

తెలంగాణ సర్కార్‌కు ఆదాయానికి కరోనా గండికొట్టింది. సంక్షేమ పథకాల అమలు కోసం ఖజానానికి నింపుకునే పనిలో పడింది. కోకాపేట , ఖానామెట్‌లో నిరర్థకంగా ఉన్న 65ఎకరాల భూములకు బిడ్స్ ను తీసుకుంటుంది. వీటి ద్వారా రెండువేల కోట్ల కు పైగా రాబడిని ఆశిస్తోంది తెలంగాణ ప్రభుత్వం. తర్వాత టార్గెట్‌గా హౌసింగ్‌ బోర్డ్‌ పరిధిలో భూములు, ఇండ్లు, ఫ్లాట్లు అమ్మాలని నిర్ణయిచింది. ఈ భూములన్నీ రాజధానిలోని ప్రైమ్ ఏరియాలో ఉండటంతో .. వీటి అమ్మకం ద్వారా భారీగా ఆదాయాన్ని సొంతం చేసుకోవచ్చని సర్కార్‌ భావిస్తోంది.

తెలంగాణ హౌసింగ్ బోర్డ్‌కు విలువ‌పైన భూములు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 3వేల ఎకరాలకు పైగా భూములు ఉన్నాయి. రాజ‌ధాని లోప‌ల‌, శివారు ప్రాంతాల‌లోనే సుమారు రెండువేలకు పైగా ఎక‌రాల భూములున్నట్టు తెలుస్తోంది. ఇవి కాకుండా నాడు ఉమ్మడి రాష్ట్రంలో రాజీవ్ గృహ‌క‌ల్ప, రాజీవ్ స్వగృహ ఇండ్ల కోసం భూసేక‌ర‌ణ చేయ‌డంతోపాటు..కొన్ని జిల్లా కేంద్రాల్లో ఇండ్లనిర్మాణం కూడా పూర్తి చేసింది నాటి స‌ర్కార్. ఇలా ఇప్పుడు రెడీ ఫర్ ఆక్యుపైకి 12 వందల ఇండ్లు సిద్ధంగా ఉన్నాయి. ఇవి అన్నీ మ‌ద్యత‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్రజ‌లుకు నివాస యోగ్యంగా ఉన్నాయి.

రాజ‌ధాని లోప‌ల, శివారు ప్రాంతాల‌లో ఉన్న భూముల అమ్మకానికి ఎలాంటి అడ్డంకులు లేకపోవడంతో.. మొదటగా వీటిని అమ్మేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. తర్వాత జిల్లాకేంద్రాల్లోని భూములను అమ్మనుంది. ఇప్పటికే వీటి అమ్మకానికి హరీశ్‌రావు, కేటీఆర్, శ్రీనివాస్ గౌడ్ నేతృత్వంలోని మంత్రుల కమిటీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు సమాచారం. 3 వేల ఎకరాల భూముల అమ్మకం ద్వారా 12 వేల కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేస్తుంది. ఇక బండ్లగూడ , పోచారం , జవహర్ నగర్, మియాపూర్‌లో 12 వందల రాజీవ్ గృహకల్ప ఇండ్ల అమ్మకం ద్వారా మరో వెయ్యి కోట్ల ఆదాయాన్ని ఆశిస్తుంది. మొత్తం 13 వేల కోట్ల ఆదాయం వస్తుందని సర్కార్ లెక్కలేసుకుంటోంది.