Gujarat : సీఎం విజయ్ రూపానీ రాజీనామా

ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సడెన్ గా రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు.

Gujarat : సీఎం విజయ్ రూపానీ రాజీనామా

Gujarath Cm

Updated On : September 11, 2021 / 3:48 PM IST

CM Vijay Rupani : గుజరాత్ పొలిటిక్స్ ఒక్కసారిగా వేడెక్కాయి. ముఖ్యమంత్రి విజయ్ రూపానీ సడెన్ గా రాజీనామా చేయడం కలకలం రేపుతోంది. 2021, సెప్టెంబర్ 11వ తేదీ శనివారం రాష్ట్ర గవర్నర్ కు రాజీనామా లేఖను సమర్పించారు. వచ్చే ఏడాది గుజరాత్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న సంగతి తెలిసిందే.

Read More : Gujarat HC : పెళ్లికాకుండా తల్లి అయితే బిడ్డ తండ్రి ఎవరో చెప్పాలా? గుజరాత్ హైకోర్టు

అసెంబ్లీ ఎన్నికలకు ముందు విజయ రూపానీ రాజీనామా చేయడం సర్వత్రా చర్చనీయాంశమైంది. 2016 సంవత్సరం నుంచి ఆయన ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఆయన రాజీనామా చేయడం సంచలనంగా మారింది. అసలు ఆయన ఎందుకు రాజీనామా చేయాల్సి వచ్చిందో తెలియరావడం లేదు.

2022లో ఈ రాష్ట్రంలో ఎన్నికలు జరుగనున్నాయి. దీంతో ప్రధాన పార్టీలన్నీ ఇప్పటి నుంచే వ్యూహాలు రచిస్తున్నాయి. ఇక్కడ మొత్తం 182 సీట్లున్నాయి. 2017 సంవత్సరంలో జరిగిన ఎన్నికల్లో బీజేపీ 99 సీట్లు, కాంగ్రెస్ 77, ఇతరులు ఆరు సీట్లలో విజయం సాధించారు. బీజేపీ ఇక్కడ క్లీన్ స్వీప్ చేసింది. మరోసారి అధికారంలోకి వచ్చేందుకు కాంగ్రెస్ పక్కా ప్రణాళికలు రచిస్తోంది. రాజకీయ వ్యూహకర్తగా పేరు గడించిన పీకే…త్వరలోనే కాంగ్రెస్ లో చేరుతారని, గుజరాత్ ఎన్నికల్లో ఆయన వ్యూహరచనలు చేస్తారని ప్రచారం జరుగుతోంది. బీజేపీ మాత్రం..మరోసారి అధికార పగ్గాలు చేపట్టాలని ఉవ్విళ్లూరుతోంది.

Read More : Arvind Kejriwal: గుజరాత్‌లో అన్నీ స్థానాల్లో పోటీ చేస్తాం!

తాము కూడా బరిలో నిలుస్తామని ఆప్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అన్ని స్థానాల్లో తమ పార్టీ పోటీ చేస్తుందని ఇటీవలే ఆప్ అధినేత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో…సీఎంగా ఉన్న విజయ్ రాపానీ రాజీనామా చేయడం పొలిటికల్ వర్గాల్లో హీట్ పుట్టించింది. ఇంకా సమయం ఉన్నా..ఇప్పుడే ఎందుకు రాజీనామా చేశారనే చర్చ స్టార్ట్ అయ్యింది. సీఎం పదవిలో ఎవరు కూర్చొంటారో చూడాలి.