Ritesh Rana : హ్యాపీ బర్త్‌డే.. కొత్త మల్టీవర్స్.. ఆర్టిస్టులకంటే గన్స్‌కే ఎక్కువ బడ్జెట్ అయింది..

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ రితేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హ్యాపీ బర్త్‌డే సినిమా గురించి మాట్లాడుతూ.. ''ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హ్యాపీ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ఆమె బర్త్‌డే రోజు రాత్రి పూట చోటుచేసుకున్న......

Ritesh Rana : హ్యాపీ బర్త్‌డే.. కొత్త మల్టీవర్స్.. ఆర్టిస్టులకంటే గన్స్‌కే ఎక్కువ బడ్జెట్ అయింది..

Happy Birthday

Happy Birthday :  ఇటీవల మల్టీవర్స్ అంటూ ఒక సినిమాకి ఇంకో సినిమాకి లింక్ ఉండేలా సినిమాలు తీసి హైప్ ఇస్తున్నారు దర్శకులు. దీంతో ఆ సినిమాలకి మరింత హైప్ వచ్చి విజయం సాధిస్తున్నాయి. ఒకప్పుడు హాలీవుడ్ లో మాత్రమే ఉండే ఈ మల్టీవర్స్ లు ఇప్పుడు సౌత్ కి కూడా పాకాయి. ఇటీవలే డైరెక్టర్ లోకేష్ విక్రమ్ సినిమాతో మరో మల్టీవర్స్ సృష్టించి అంతకుముందు తీసిన ఖైదీకి, విక్రమ్ కి లింక్ పెట్టాడు. తర్వాత రాబోయే సినిమాల్లో ఈ లింక్ కంటిన్యూ కాబోతుంది.

తాజాగా తెలుగులో యువ దర్శకుడు కామెడీ మల్టీవర్స్ ని సృష్టిస్తున్నాడు. గతంలో మత్తు వదలరా సినిమాతో ప్రేక్షకులని మెప్పించాడు దర్శకుడు రితేష్ రానా. ప్రస్తుత హ్యాపీ బర్త్‌డే అనే సినిమాతో రాబోతున్నాడు. లావణ్య త్రిపాఠి, వెన్నెల కిషోర్, సత్య ముఖ్యపాత్రల్లో ఈ సినిమా తెరకెక్కింది. జులై 8న ఈ సినిమా థియేటర్లలోకి రానుంది. అయితే ఈ సినిమాని కూడా అంతకుముందు తీసిన మత్తు వదలరా సినిమాతో ముడిపెడుతూ ఇదొక కామెడీ మల్టీవర్స్ అని చెప్తున్నాడు డైరెక్టర్ రితేష్.

Adah Sharma : వర్షాకాలంలో అదాశర్మ ఫేవరేట్ ఫుడ్ ఏంటో తెలుసా??

 

సినిమా ప్రమోషన్స్ లో భాగంగా డైరెక్టర్ రితేష్ ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో హ్యాపీ బర్త్‌డే సినిమా గురించి మాట్లాడుతూ.. ”ఈ సినిమాలో లావణ్య త్రిపాఠి హ్యాపీ అనే అమ్మాయి పాత్రలో కనిపిస్తుంది. ఆమె బర్త్‌డే రోజు రాత్రి పూట చోటుచేసుకున్న కొన్ని సంఘటనల చుట్టూ ఈ కథ నడుస్తుంది. అందుకే దీనికి ‘హ్యాపీ బర్త్‌డే’ అనే టైటిల్‌ పెట్టాం. ఒక హాలీవుడ్ సినిమా ‘పల్ప్‌ ఫిక్షన్‌’ తరహాలో నాన్‌ లీనియర్‌ స్క్రీన్‌ప్లే ఉంటుంది. ఏడు చాప్టర్స్‌లో ఈ కథ నడుస్తుంది. ఒక్కో చాప్టర్‌లో వ్యంగ్యం, పేరడీ, విజువల్‌ కామెడీ..ఇలా విభిన్న తరహా కామెడీ అంశాల్ని చూపించబోతున్నాము.”

”గన్ కల్చర్ ని కామెడీగా చూపించడానికి ఏకంగా గన్ బజార్ సెటప్ వేశాం. అందుకు చాలా ఫేక్ గన్స్, బులెట్స్, రకరకాల పిస్టల్స్ తెప్పించాము. సినిమాలో ఆర్టిస్టుల రెమ్యునరేషన్ కంటే గన్ బజార్ సెటప్, గన్స్ కే ఎక్కువ రెంట్ అయింది. సెల్‌ఫోన్స్‌ ఎన్ని రంగుల్లో దొరుకుతాయో అన్ని రంగుల్లో కలర్‌ఫుల్‌గా గన్స్‌ను డిజైన్‌ చేశాం. దాదాపు అన్ని రకాల గన్స్‌ను ఉపయోగించాం.”

”ఈ సినిమాకి వచ్చేముందు మత్తు వదలరా సినిమా చూసి వస్తే ఇంకా బాగా అర్ధమవుతుంది. ఇదొక కామెడీ మల్టీవర్స్ లాగా తీశాము. మత్తు వదలరా సినిమాలోని కొన్ని క్యారెక్టర్స్ ఈ సినిమాలో కంటిన్యూ అవుతాయి. ఆ సినిమాలో ఒక సీరియల్ చూపించాము. ఇందులో ఆ సీరియల్ కథ కంటిన్యూ అవుతుంది” అంటూ సినిమాపై మరిన్ని అంచనాలు పెంచేశారు డైరెక్టర్ రితేష్ రానా.