IPL 2023: ఐపీఎల్ మోస్ట్ ఇంప్రెసివ్ ప్లేయర్ అతడే: హర్భజన్ సింగ్

ఐపీఎల్-2023లో మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలాయి.

IPL 2023: ఐపీఎల్ మోస్ట్ ఇంప్రెసివ్ ప్లేయర్ అతడే: హర్భజన్ సింగ్

Harbhajan Singh

Updated On : May 25, 2023 / 10:22 AM IST

Harbhajan Singh: ఐపీఎల్-2023లో మోస్ట్ ఇంప్రెసివ్ ప్లేయర్ ఎవరు? అత్యధిక పరుగులు చేసిన బ్యాటర్ రేసులో దూసుకుపోతున్న గుజరాత్ ఆటగాడు శుభ్‌మన్ గిల్(Shubhman Gill)? లేదంటే ఆర్సీబీ బ్యాటర్ విరాట్ కోహ్లీనా? వారిద్దరు కాకుండా మరొకరి పేరు చెప్పాడు మాజీ క్రికెటర్ హర్భజన్ సింగ్. అతడిని ఇంతగా ఆకర్షించిన ప్లేయర్ ఎవరో కాదు.. రాజస్థాన్ రాయల్స్ ప్లేయర్ యశస్వి జైస్వాల్ (Yashasvi Jaiswal).

జైస్వాల్ ప్రస్తుత ఐపీఎల్ లో 625 పరుగులు చేశాడు. తాజాగా హర్భజన్ మీడియాతో మాట్లాడుతూ… “బ్యాటర్ల గురించి మాట్లాడాలంటే శుభ్‌మన్ గిల్ చాలా సమర్థుడు. అతడితో పాటు యశస్వి జైస్వాల్ భవిష్యత్తులో టీమిండియాలో కీలక ప్లేయర్లుగా మారుతారు. యశస్వి జైస్వాల్ అందరికంటే బాగా ఆకట్టుకునే ఆటగాడు.

టీమిండియాలో తప్పకుండా ఆడతాడు. అలాగే, భవిష్యత్తులో టీమిండియాకు కెప్టెన్ గా శుభ్‌మన్ గిల్ వ్యవహరిస్తాడు. తిలక్ వర్మ, రింకూ సింగ్ కూడా టీమిండియాలో రాణిస్తారు. ఐపీఎల్ లో ఆడిన కొందరు కుర్రాళ్లకు గొప్పటాలెంట్ ఉంది” అని హర్భజన్ సింగ్ చెప్పాడు.

కాగా, ఐపీఎల్-2023లో మరో రెండు మ్యాచులు మాత్రమే మిగిలాయి. శుక్రవారం క్వాలిఫయర్-2లో ముంబై ఇండియన్స్, గుజరాత్ టైటాన్స్ తలపడనున్నాయి. గెలిచిన జట్టు ఆదివారం ఫైనల్ లో చెన్నై సూపర్ కింగ్స్ తో ఆడుతుంది.

IPL 2023: ఈ ముగ్గురిలో ఆరెంజ్ క్యాప్ ఎవరికి? పక్కా అతడికే అంటున్న ఫ్యాన్స్