Heart Attack : గుండెకి ఏమైంది? పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు, హార్ట్ ఎటాక్‌కి అసలు కారణం ఏంటి? కరోనా పాత్ర ఎంత?

ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. అసలు ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సడెన్ గా హార్ట్ పై ఎటాక్ ఎందుకు జరుగుతోంది? ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Heart Attack : గుండెకి ఏమైంది? పెరిగిపోతున్న గుండెపోటు మరణాలు, హార్ట్ ఎటాక్‌కి అసలు కారణం ఏంటి? కరోనా పాత్ర ఎంత?

Heart Attack : గుండెపోటు.. ఇప్పుడు అందరినీ టెన్షన్ పెడుతున్న పదం. కంటి మీద కునుకు లేకుండా చేస్తున్న భయం. చిన్న, పెద్ద తేడా లేదు.. ధనిక, పేద అనే డిఫరెన్స్ లేదు.. వయసుతో సంబంధమే లేదు. అందరినీ కాటేస్తోంది హార్ట్ ఎటాక్. కుర్రాళ్లు, యువకులు, ఆరోగ్యవంతులు.. ఎవరినీ వదలడం లేదు. ఉన్నట్టుండి సడెన్ గా హార్ట్ ఎటాక్ వస్తుంది. అంతే, కుప్పకూలిపోతాడు. ఆ వెంటనే ప్రాణాలు కోల్పోతాడు.

ఈ మధ్య కాలంలో దేశంలో గుండెపోటు మరణాలు గణనీయంగా పెరగడం ఆందోళనకు గురి చేసే అంశం. అసలు ఎందుకిలా గుండెపోటు వస్తుంది? సడెన్ గా హార్ట్ పై ఎటాక్ ఎందుకు జరుగుతోంది? ఎందుకిలా ప్రాణాలు పోతున్నాయి.? ఇప్పుడీ ప్రశ్నలు అందరినీ ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి.

Also Read..Heart Attack : బాబోయ్.. గుండెపోటుతో మరో విద్యార్థి మరణం, మేడ్చల్ CMR కాలేజీలో విషాదం

కొన్ని రోజుల క్రితం ఓ యువ పోలీస్ జిమ్ లో వర్కౌట్స్ చేస్తూ గుండెపోటుతో కుప్పకూలాడు. ఎంతో ఆరోగ్యంగా ఉన్న కానిస్టేబుల్ హఠాత్తుగా గండెపోటుకు గురై చనిపోవడం తీవ్ర ఆందోళనకు గురి చేస్తోంది. నిర్మల్ జిల్లాలో బంధువుల ఇంట పెళ్లికి వచ్చిన 19ఏళ్ల యువకుడు పెళ్లి బారాత్ లో డ్యాన్స్ చేస్తూ కుప్పకూలిపోయాడు. అకస్మాత్తుగా కుప్పకూలిన యువకుడిని ఆసుపత్రికి తీసుకెళ్తే, కార్డియాక్ అరెస్ట్ అని, అతడు చనిపోయాడని చెప్పారు డాక్టర్లు. సికింద్రాబాద్ లో మరో 38ఏళ్ల వ్యక్తి బ్యాడ్మింటన్ ఆడుతూ గుండెపోటుకి గురయ్యాడు. ప్రైవేట్ ఉద్యోగి అయిన అతడు.. రోజూ ఆఫీస్ నుంచి ఇంటికి వచ్చాక క్రికెట్ లేదా బ్యాడ్మింటన్ ఆడుతూ బాడీని ఫిట్ గా ఉంచుకునే వాడు. అయినా గుండెపోటు రూపంలో అకాల మృత్యువు అతడిని కబలించేసింది.(Heart Attack)

Also Read..Shocking death: క్రికెట్ ఆడుతూ కుప్పకూలాడు.. గుండెపోటుతో ఉద్యోగి మృతి .. ఆందోళన కలిగిస్తున్న వరుస ఘటనలు

ఇలా వయసుతో సంబంధం లేదు ఇటీవలి కాలంలో చోటు చేసుకుంటున్న గుండెపోటు ఘటనలు, హఠాన్మరణాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. గుండెపోటుతో పలువురు సెలబ్రిటీలు సైతం హఠాత్తుగా మరణించిన ఘటనలు కలకలం రేపాయి. కన్నడ స్టార్ పునీత్ రాజ్ కుమార్, ఏపీ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇటీవలే నందమూరి తారకరత్న మరణాలు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి.

Also Read..Heart Attack Constable Died : జిమ్ లో వ్యాయామం చేస్తూ గుండెపోటుతో కానిస్టేబుల్ మృతి

దేశంలో గుండెపోటుతో చనిపోయే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. వయసుతో సంబంధం లేకుండా చిన్న వయసులోనే చాలా మంది ప్రాణాలు కోల్పోతున్నారు. ఏదో ఒక పని చేస్తూ ఒక్కసారిగా కార్డియాక్ అరెస్ట్ తో కుప్పకూలుతున్న ఘటనలు ఎక్కువ అవుతున్నాయి. వ్యాయామం చేస్తూ ఒకరు, డ్యాన్స్ చేస్తూ మరొకరు, కూర్చున్న వారు కూర్చున్నట్లే క్షణాల్లో ప్రాణాలు కోల్పోతుండటం ఆందోళన కలిగిస్తోంది. పట్టరాని ఆనందం వచ్చినా, భయాందోళనకు గురైనా గుండె కొట్టుకునే వేగం పెరగడం సర్వ సాధారణం. కానీ, ఏ కారణం లేకుండానే కొన్ని సెకన్ల పాటు గుండె వేగంగా కొట్టుకోవడం, తరుచూ అలా జరగడం గుండెపోటు లక్షణంగా చెబుతున్నారు డాక్టర్లు.

కరోనా మహమ్మారి తర్వాత గుండెపోటుతో మరణిస్తున్న వారి సంఖ్య పెరుగుతోందన్న అభిప్రాయాలు బలంగా వ్యక్తమవుతున్నాయి. అయితే, ఈ మరణాలకు కరోనాయే కారణం అని చెప్పే ఆధారాలేవీ లేవని వైద్య నిపుణులు చెబుతున్నారు. అయితే, కోవిడ్ తర్వాత కొన్ని వారాల పాటు దాని ప్రభావం ఆరోగ్యంపై ఉంటుందని, కోవిడ్ 19 వల్ల శ్వాసకోశ వ్యాధులతో పాటు గుండెపోటు లాంటి ముప్పు కూడా పెరుగుతుందని పలు అధ్యయనాలు చెబుతున్నాయి.

Also Read..Heart Attack : సోమవారమే అధిక స్ధాయిలో గుండెపోటు ప్రమాదాలు చోటుచేసుకోవటానికి కారణాలు తెలుసా?

గతంలో స్పానిష్ ఫ్లూ కారణంగా 1950-60 దశకాల్లో గుండెపోటు ఘటనలు ఎక్కువగా నమోదైనట్లు పరిశోధనలో తేలింది. మతిమరుపు, ఆలోచన తగ్గిపోవడం, పదే పదే మర్చిపోవడం, నీరసంగా ఉండటం వంటి లక్షణాలు కోవిడ్ నుంచి కోలుకున్న తర్వాత కూడా చాలా మందిలో బయటపడ్డాయి. ఆ తర్వాత వరుసగా గుండెపోటు కేసులు పెరుగుతూ వస్తున్నాయి. గతంలోనూ గుండెపోటు కేసులు ఒక్కసారిగా పెరగడంపై జరిపిన ఈ పరిశోధనల్లో ఫ్లూ మహమ్మారి దీనికి కారణం అని తేలింది. ఇప్పుడు కోవిడ్ తర్వాత కూడా కూడా ఇలాంటి పరిస్థితే కనిపిస్తోంది.(Heart Attack)

వరుస గుండెపోట్లు దేనికి సంకేతం? జిమ్ వర్కౌట్స్ ఎక్కువవడం హార్ట్ ఎటాక్ కి దారితీస్తోందా? హఠాత్తుగా కుప్పకూలిపోవడం వెనుక రీజనేంటి? గుండెపోటుకు వయసుతో సంబంధం లేదా? యువకుల్లో హార్ట్ ఎటాక్ కి కారణాలు ఏంటి? బాడీ ఫిట్ గా ఉన్నా, గుండె ఫిట్ కాదా? హార్ట్ ఎందుకు ఫెయిల్ అవుతోంది? కనీస వ్యాయామం కూడా చేయడం లేదా? వ్యాయామం చేసే వాళ్లకూ గుండెపోట్లు దేనికి సంకేతం? కరోనా తర్వాతే గుండెపోట్లు ఎక్కువయ్యాయా? గుండెనొప్పి రాబోతున్నట్లు ముందుగానే తెలుసుకోవచ్చా?

* జిమ్స్ లో వర్కౌట్స్ చేస్తూ యువ పోలీస్ మృతి
* నిర్మల్ జిల్లాలో పెళ్లి బారాత్ లో డ్యాన్స్ చేస్తుండగా 19ఏళ్ల యువకుడికి గుండెపోటు
* సికింద్రాబాద్ లో బ్యాడ్మింటన్ ఆడుతూ కుప్పకూలిన వ్యక్తి
* మేడ్చల్ సీఎంఆర్ కాలేజీలో ఫ్రెండ్స్ తో మాట్లాడుతూ గుండెపోటుతో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
* వరుస గుండెపోటు ఘటనలతో ఆందోళన(Heart Attack)
* వయసుతో సంబంధం లేకుండా హార్ట్ ఎటాక్ లు
* వ్యాయామం చేస్తూ, డ్యాన్స్ చేస్తూ, కూర్చున్న చోటే కుప్పకూలుతున్న వ్యక్తులు
* క్షణాల్లో గాల్లో కలిసిపోతున్న ప్రాణాలు
* గుండెపోటుతో మరణించిన పలువురు సెలబ్రెటీలు
* పునీత్ రాజ్ కుమార్, మేకపాటి గౌతమ్ రెడ్డి, ఇటీవలే నందమూరి తారకరత్న గుండెపోటుతో కన్నుమూత.(Heart Attack)

10TV LIVE : నాన్ స్టాప్ న్యూస్ అప్‌డేట్స్ కోసం 10TV చూడండి.