Telangana Rains: మళ్ళీ కుండపోత.. నేడు కూడా భారీ వర్షాలు!

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మళ్ళీ వానలు దంచి కొట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మళ్ళీ కుండపోత వర్షం కురిసింది. వారం కిందట కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు..

Telangana Rains: మళ్ళీ కుండపోత.. నేడు కూడా భారీ వర్షాలు!

Telangana Rains (1)

Telangana Rains: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా పలు చోట్ల మళ్ళీ వానలు దంచి కొట్టాయి. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో మళ్ళీ కుండపోత వర్షం కురిసింది. వారం కిందట కురిసిన భారీ వర్షానికి లోతట్టు ప్రాంతాలు ఇప్పుడిప్పుడే తేరుకుంటుండగా శనివారం మళ్లీ భారీ వర్షం కురిసింది. మధ్యాహ్నం 1 గంట నుంచి నాలుగుగంటలపాటు ఏకధాటిగా కురిసిన వానకు నగరం వణికిపోయింది. రహదారులు, లోతట్టు ప్రాంతాలను వరద ముంచెత్తగా.. ఇప్పటికే నిండిన చెరువుల్లోకి భారీగా ప్రవాహం రావడంతో నాలాలు ఉద్ధృతంగా ప్రవహించాయి.

శనివారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు దాదాపు నాలుగు గంటలపాటు హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురవగా.. ఎల్బీనగర్‌లో అత్యధికంగా 10.6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. లోతట్టు ప్రాంతాలు జలమమై.. పలుచోట్ల రహదారులపై వరదనీరు ప్రవహించింది. భారీగా ట్రాఫిక్‌ సమస్య తలెత్తింది. సరిగ్గా ఉద్యోగులు ఇళ్లకు చేరుకొనే సాయంత్రం సమయానికి రహదారులపై ఎక్కడ చూసినా వాన నీరు నిలిచిపోవడంతో దిక్కుతోచని స్థితి నెలకొంది.

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ఏపీ తీరందాటి తెలంగాణ మీదుగా కదులుతుండటంతో దాని ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఆదివారం హైదరాబాద్‌ కూడా సహా పలు జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులతోకూడిన తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉన్నదని హైదరాబాద్‌ వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. ఆదిలాబాద్‌, ఆసిఫాబాద్‌, మంచిర్యాల, నిర్మల్‌, నిజామాబాద్‌ జిల్లాల్లో భారీ వర్షాలు కురువొచ్చని తెలంగాణ అధికారులు చెప్పారు.

ఇక రాష్ట్రంలోని ఇతర ప్రాంతాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని కురిసే అవకాశం ఉండగా .. నైరుతి రుతుపవనాలు శనివారంతో రాష్ట్రంలోని నల్లగొండ జిల్లా వరకు విరమించాయని తెలిపారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం శనివారం ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్‌, దాని పరిసర పశ్చిమ – మధ్య బంగాళాఖాతంలో కేంద్రీకృతమైనదని చెప్పారు. దీని ప్రభావం ఆదివారం కూడా రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో కనిపించే అవకాశం ఉందని.. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.