Nikhil : నిఖిల్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సెలెక్ట్ అవ్వడానికి లక్ష లంచం ఇచ్చాడట..

తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ రెమ్యునరేషన్ గురించి, తను సెలెక్ట్ అవ్వడానికి ఇచ్చిన లంచం గురించి చెప్పాడు. నిఖిల్ మాట్లాడుతూ..............

Nikhil : నిఖిల్ ఫస్ట్ రెమ్యునరేషన్ ఎంతో తెలుసా? సెలెక్ట్ అవ్వడానికి లక్ష లంచం ఇచ్చాడట..

Nikhil

Nikhil :  నిఖిల్ హీరోగా చందు మొండేటి దర్శకత్వంలో గతంలో వచ్చిన కార్తికేయ సినిమాకి ఎనిమిదేళ్ల తర్వాత సీక్వెల్ గా కార్తికేయ 2 రాబోతుంది. ఈ సారి కార్తికేయ 2 సినిమాని మరింత సస్పెన్స్ గా తెరకెక్కించినట్టు తెలుస్తుంది. ఇప్పటికే రిలీజ్ చేసిన సినిమా ట్రైలర్ తో సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. పలు సార్లు వాయిదా పడ్డ ఈ సినిమా ఆగస్టు 12న రిలీజ్ కాబోతుంది. దీంతో ప్రమోషన్స్ జోరుగా చేస్తున్నారు చిత్ర యూనిట్.

Anupama Parameswaran : నా ఇబ్బంది మీరు అర్ధం చేసుకోవాలి.. కార్తికేయ 2 ప్రమోషన్స్ లో అందుకే పాల్గొనట్లేదు..

ఈ ప్రమోషన్స్ లో భాగంగా హీరో నిఖిల్ అనేక విషయాలని పంచుకుంటున్నారు. తాజాగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తన ఫస్ట్ రెమ్యునరేషన్ గురించి, తను సెలెక్ట్ అవ్వడానికి ఇచ్చిన లంచం గురించి చెప్పాడు. నిఖిల్ మాట్లాడుతూ.. ”నా మొదటి రెమ్యునరేషన్ హ్యాపిడేస్ సినిమాకి తీసుకున్నాను. ఆ సినిమాకి డైరెక్టర్ శేఖ‌ర్ క‌మ్ముల 25 వేల రూపాయలు ఇచ్చారు. అయితే ఆ సినిమాకి ఆడిషన్ చేసిన వాళ్ళు నువ్ సెలెక్ట్ అయ్యావు, నలుగురిలో ఒక హీరో క్యారెక్టర్, కానీ అది ఓకే అవ్వాలంటే లక్ష రూపాయలు ఇవ్వాలని అడిగారు. అది కచ్చితంగా ఎలాగైనా ఓకే చేసుకోవడానికి లక్ష రూపాయలు ఇచ్చాను” అని తెలిపారు. ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఓకే అవ్వడం కోసం డబ్బులు తీసుకుంటారు అనే ఒక ప్రచారం ఉంది. నిఖిల్ ఈ విషయం చెప్పాక దీని గురించి టాలీవుడ్ లో మరోసారి చర్చగా మారింది.