Heros : చిత్ర యూనిట్ కి గిఫ్టులు ఇస్తున్న హీరోలు..

సక్సెస్ ని టీమ్ అందరితో కలిసి షేర్ చేసుకుంటున్నారు కొందరు స్టార్స్. చాలా రోజుల తర్వాత వచ్చిన సక్సెస్ మూడ్ ని మరింత ఛీర్ ఫుల్ గా కమల్ హాసన్ ప్లాన్ చేసారు. విక్రమ్ టీమ్ మెంబర్స్ ని కానుకలతో.............

Heros : చిత్ర యూనిట్ కి గిఫ్టులు ఇస్తున్న హీరోలు..

Heros Gifts

Heros :  సక్సెస్ ని టీమ్ అందరితో కలిసి షేర్ చేసుకుంటున్నారు కొందరు స్టార్స్. చాలా రోజుల తర్వాత వచ్చిన సక్సెస్ మూడ్ ని మరింత ఛీర్ ఫుల్ గా కమల్ హాసన్ ప్లాన్ చేసారు. విక్రమ్ టీమ్ మెంబర్స్ ని కానుకలతో సర్ ప్రైజ్ చేస్తున్నారు. గతంలో లో కూడా ఇలా హీరోలు కొందరు కాస్ట్లీ గిఫ్ట్ లిచ్చి వావ్ అనిపించారు. సినిమా సక్సెస్ అయితే కొంతమంది హీరోలు డైరెక్టర్స్, టెక్నీకల్ టీంకి స్పెషల్ గిఫ్ట్స్ ఇస్తున్నారు. వాటిల్లో ఖరీదైన గిఫ్టులు కూడా ఉంటున్నాయి.

చాలా కాలం తర్వాత కమల్ హాసన్ కి సాలిడ్ హిట్ పడింది. సక్సెస్ ని ఎంజాయ్ చేస్తోన్న కమల్ డైరెక్టర్ లోకేశ్ కనగరాజ్ కు ఖరీదైన లెక్సస్ కారు కొనిచ్చారు. హీరో సూర్యకు ఖరీదైన రోలెక్స్ వాచ్ ను బహుమతిగా ఇచ్చారు. అంతే కాకుండా ఏకంగా 13 మంది అసిస్టెంట్ డైరెక్టర్లకు బైక్ లను కానులుగా ఇచ్చి ఫుల్ గా సర్ ప్రైజ్ చేసారు కమల్.

Hombale Films : KGF నిర్మించిన హోంబల్ ఫిలిమ్స్ ఫ్యూచర్ ప్లాన్స్ మాములుగా లేవుగా..

ఇలా మూవీ టీమ్ కు కానుకలు అందించడంలో ఎప్పుడూ ముందుంటారు సూర్య. సింగం టైమ్ లో టీమ్ కు చిన్న చిన్న గిఫ్ట్ లు అందించిన సూర్య, టయోట ఫార్చునర్ ఇచ్చి డైరెక్టర్ హరిని సంతోషపెట్టాడు. ఆ తర్వాత డైరెక్టర్ విగ్నేష్ శివన్ కి కూడా గ్యాంగ్ సినిమా టైములో కార్ కొనిచ్చారు. అలాగే ఇటీవల రిలీజైన ఈటీ టీమ్ మెంబర్స్ కి సైతం గోల్డ్ కాయిన్స్ ఇచ్చారు. ఇక బిగిల్ మూవీ టైమ్ లో దాదాపు ఆ సినిమాకి పని చేసిన 400 మందికి గోల్డ్ రింగ్స్ అందించాడు దళపతి విజయ్. టాలీవుడ్ హీరో రామ్ చరణ్ సైతం ట్రిపుల్ ఆర్ మెంబర్స్ కి 18లక్షల విలువైన గోల్డ్ కాయిన్స్ ను ప్రెజెంట్ చేసారు. బన్నీ కూడా పుష్పకి పనిచేసిన 15మంది కీలక సభ్యులకి తులం బంగారం చొప్పున రింగ్ లను గిఫ్ట్ గా ఇచ్చారు. మహేష్ కూడా శ్రీమంతుడు సినిమా హిట్ అయినందుకు కొరటాల శివకి ఖరీదైన ఆడి కార్ ని కొనిచ్చారు. రజినీకాంత్ ఇటీవల అన్నాత్తే సినిమా హిట్ అయినందుకు డైరెక్టర్ శివకి గోల్డ్ చైన్ ఇచ్చారు.

Indian Cinema : ఇండియన్ సినిమాటిక్ యూనివర్స్..

తనతో పనిచేసే దర్శకులను సర్ ప్రైజ్ చేసే అలవాటు తారక్ కు కూడా ఉంది. తారక్ సినిమా హిట్ అయినా అవ్వకపోయినా తనతో కలిసి పని చేసిన దర్శకులకి ఖరీదైన వాచ్ లని ఇస్తారు. జనతా గ్యారేజ్ రిలీజ్ తర్వాత కొరటాల శివకు 20లక్షల విలువైన రిస్ట్ వాచ్ ను ప్రెజెంట్ చేసిన ఎన్టీఆర్, గతంలో హరీశ్ శంకర్, శ్రీనువైట్ల, బాబీ, పూరి జగన్నాధ్ లాంటి డైరెక్టర్లకు కూడా కాస్ట్లీ వాచ్ లను ఇచ్చి హ్యాపినెస్ ను షేర్ చేసుకున్నారు. ఇక టీమ్ మెంబర్స్ ని కేర్ గా చూసుకుంటారనే పేరు ప్రభాస్ కి కూడా ఉంది. ప్రభాస్ తన సినిమాలోకి వచ్చిన ఆర్టిస్టులందరికి తన ఇంటి నుంచి స్పెషల్ ఫుడ్ తెచ్చి పెడతాడని తెలిసిందే. అలాగే ఇటీవల ఆదిపురుష్ షూటింగ్ తర్వాత ఆ మూవీ టీమ్ మొత్తానికి రాడో వాచెస్ గిఫ్ట్స్ గా అందించిన ప్రభాస్, రాధేశ్యామ్ టీమ్ మెంబర్స్ కి సైతం ఖరీదైన వాచ్ లనే ప్రెజెంట్ చేసారు. ఇలా హీరోలు డైరెక్టర్స్ ని, టీంని స్పెషల్ గిఫ్ట్స్ ఇచ్చి మరింత ప్రోత్సహిస్తున్నారు.