Secunderabad Railway Station : అరగంట పార్కింగ్ ఫీజు రూ.500.. నిబంధనల ప్రకారమే అంటున్న అధికారులు

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అధిక పార్కింగ్ ఫీజు వసూలుపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ స్పందించారు. అధిక చార్జీలు వసూలు చేయడం లేదన్నారాయన. నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్న

Secunderabad Railway Station : అరగంట పార్కింగ్ ఫీజు రూ.500.. నిబంధనల ప్రకారమే అంటున్న అధికారులు

Secunderabad Railway Station

Secunderabad Railway Station : సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో అధిక పార్కింగ్ ఫీజు వసూలుపై దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ స్పందించారు. అధిక చార్జీలు వసూలు చేయడం లేదన్నారాయన. నిబంధనల ప్రకారమే వసూలు చేస్తున్నామని వివరించారు. నిన్న ఓ ప్రయాణికుడు మంత్రికి ట్వీట్ చేసిన రిసిప్ట్ లో పార్కింగ్ ఫీజుగా పడిందని, దానిని యాక్సెస్ చార్జిగా మార్చామని రాకేష్ తెలిపారు.

రద్దీగా ఉండే రైల్వే స్టేషన్లలో వాహనాల ఫ్లోటింగ్ తగ్గించడానికి యాక్సెస్ ఫీజును వసూళ్లు చేస్తున్నామని చెప్పారు. ప్రయాణికులను డ్రాపింగ్ చేసేందుకు వచ్చి గంటల తరబడి వాహనాలను స్టేషన్ ఆవరణలో వదిలేసి వెళ్లిపోతున్నారని, దీంతో వాహనాల రద్దీని నియంత్రించ లేకపోతున్నామన్నారు. ముందు పది నిమిషాలు ఉచితంగా పార్కింగ్ చేయవచ్చన్నారు. ఆ తరువాత యాక్సెస్ చార్జీ వసూలు చేస్తారని వివరించారు. దాన్ని పార్కింగ్ చార్జీగా చూడొద్దన్నారు. దక్షిణ మధ్య రైల్వే పరిధిలో ఎక్కడా అధిక పార్కింగ్ చార్జీలు వసూలు చేయడం లేదని దక్షిణ మధ్య రైల్వే సీపీఆర్వో రాకేష్ చెప్పారు.

Best Food : మాంసాహారాన్ని మించిన ఆహారం ఇదే…

సికింద్రాబాద్ రైల్వే స్టేష‌న్‌లో ఓ వాహనదారుడికి రూ.500 పార్కింగ్ ఫీజు వ‌సూలు చేశారు. అర గంట‌కే రూ.500 వ‌సూలు చేయ‌డంతో స‌ద‌రు ప్ర‌యాణికుడు ల‌బోదిబోమ‌న్నాడు. పార్కింగ్ నిర్వాహ‌కుల‌తో వాదించిన‌ప్ప‌టికీ లాభం లేకుండా పోయింది. దీంతో చేసేదేమీ లేక బాధిత ప్ర‌యాణికుడు త‌నకు జ‌రిగిన అన్యాయాన్ని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకెళ్లారు. కేవ‌లం 31 నిమిషాల‌కు పార్కింగ్ ఫీజు రూ. 500 వ‌సూలు చేయ‌డాన్ని కేటీఆర్ త‌ప్పుబ‌ట్టారు. ఇది దారుణ‌ం అన్నారు. పార్కింగ్ ఫీజులు అధికంగా వ‌సూలు చేస్తున్న విష‌యాన్ని కేంద్ర రైల్వే మంత్రి అశ్విని వైష్ణ‌వ్ దృష్టికి కేటీఆర్ తీసుకెళ్లారు.

కాగా, ఎవరైనా రెండు గంటలకు మించి పార్కింగ్‌ ప్లేస్‌లో వాహనం నిలిచి ఉంచినట్టయితే గుండె గుబిల్లుమనేలా జరిమానాలు విధిస్తోంది రైల్వేశాఖ. రెండు గంటల తర్వాత మొదటి ఎనిమిది నిమిషాలకు ఎటువంటి ఎక్స్‌ట్రా ఛార్జ్‌ లేదు. కానీ ఆ తర్వాత గడిచే ఒక్కో నిమిషానికి ఒక్కొ రేటు విధించింది. అవి చూస్తే కళ్లు బైర్లు కమ్మడం ఖాయం.
– తొలి రెండు గంటల తర్వాత 8 నుంచి 15 నిమిషాల ఆలస్యానికి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.100
– తొలి రెండు గంటల తర్వాత 16 నుంచి 30 నిమిషాల ఆలస్యానికి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.200
– తొలి రెండు గంటల తర్వాత 30 నిమిషాలు దాటి ఆలస్యమైతే ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జ్‌ రూ.500

Lose Weight : కసరత్తులు లేకుండా బరువు తగ్గటం ఎలాగో తెలుసా

ఇప్పటికే పెరిగిన ధరలతో సతమతం అవుతున్న సామాన్యులకు ఈ ఎక్స్‌ట్రా పార్కింగ్‌ ఛార్జీలు శరాఘాతంగా మారాయి. పండగ వేళ స్టేషన్‌కి వెళ్లి ఓవర్‌ స్టే పార్కింగ్‌ ఛార్జీల కాటుకు గురైన ఎందరో సోషల్‌ మీడియా వేదికగా రైల్వేపై విమర్శలు గుప్పిస్తున్నారు. ఎక్స్‌ట్రా పార్కింగ్‌ ఛార్జీల విషయంలో తీవ్ర విమర్శలు వస్తున్నా రైల్వే అధికారుల్లో మార్పు రాలేదు. పైగా స్టేషన్‌లో అనవసర రద్దీని నియంత్రించేందుకు స్టేషన్‌కు వచ్చే ప్రయాణికుల సౌకర్యంగా ఉండేందుకే ఈ ఓవర్‌ స్టే ఛార్జీలు పెట్టామంటూ కవరింగ్‌ ఇ‍చ్చే ప్రయత్నం చేస్తోంది.