New CM: నేడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని నిర్ణయించనున్న కాంగ్రెస్

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిభా సింగ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ముఖ్యమంత్రిని నిర్ణయించనున్నారు. వాస్తవానికి ఎన్నికలు ముగియగానే గెలిచిన వారిని ఛండీగఢ్‭లోని ఒక హోటల్‭కు తరలించాలని ముందస్తు నిర్ణయం తీసుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. మొహాలిలో కూడా ఒక హోటల్ సిద్ధం చేశారు. కానీ, పార్టీకి ప్రస్తుతం ఆ అవసరం లేకుండా పోయింది

New CM: నేడు హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రిని నిర్ణయించనున్న కాంగ్రెస్

Himachal Congress calls Legislature Party meet today, to decide on chief minister

New CM: గురువారం ఎన్నికల తుది ఫలితాలు వెలువడగానే గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేలేనని భారతీయ జనతా పార్టీ ప్రకటించింది. ఎన్నికలకు ముందు ముఖ్యమంత్రిగా ఉన్న ఆయనే, మళ్లీ కొనసాగుతారని ప్రధానమంత్రి నరేంద్రమోదీ ప్రకటించారు. ఇక గుజరాత్‭తో పాటే హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చాయి. అయితే హిమాచల్ ముఖ్యమంత్రి ఎవరనేది ఈరోజు ఖరారు చేయనున్నట్లు కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.

హిమాచల్ ప్రదేశ్‫‭లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించిన విషయం తెలిసిందే. ఫలితాలు వెలువడిన మరునాడే ముఖ్యమంత్రి ఎంపికపై కాంగ్రెస్ కసరత్తు ప్రారంభించింది. ఈ విషయమై రాష్ట్ర రాజధాని షిమ్లాలోని రాజీవ్ భవన్‭లో సాయంత్రం 3:00 గంటలకు తాజాగా గెలిచిన ఎమ్మెల్యేలతో పార్టీ నేతలు లెజిస్లేచర్ సమావేశం నిర్వహించనున్నారు. సీనియర్ ఎలక్షన్ సూపర్‭వైజర్ భూపేష్ బాఘేల్, ఇంచార్జీ రాజీవ్ శుక్లా, భూపేంద్ర సింగ్ హూడా మధ్యాహ్నం 1:00 గంటలకే రాజీవ్ భవన్ చేరుకోనున్నారు.

White House: అమెరికాతో పొత్తు కాదు, ప్రపంచంలోనే శక్తి అవుతుంది.. భారత్‭పై వైట్‭హౌస్ ప్రశంసలు

హిమాచల్ ప్రదేశ్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు ప్రతిభా సింగ్ ఈ సమావేశంలో పాల్గొననున్నారు. అనంతరం ఎమ్మెల్యేల అభిప్రాయాలు తీసుకుని ముఖ్యమంత్రిని నిర్ణయించనున్నారు. వాస్తవానికి ఎన్నికలు ముగియగానే గెలిచిన వారిని ఛండీగఢ్‭లోని ఒక హోటల్‭కు తరలించాలని ముందస్తు నిర్ణయం తీసుకుని అన్ని ఏర్పాట్లు చేశారు. మొహాలిలో కూడా ఒక హోటల్ సిద్ధం చేశారు. కానీ, పార్టీకి ప్రస్తుతం ఆ అవసరం లేకుండా పోయింది. కారణం ఆ పార్టీ భారీ మెజారిటీతో గెలుపొందింది.

హిమాచల్ ప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల తుది ఫలితాలను కేంద్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. సాయంత్రం కౌంటింగ్ ముగిసే నాటికి మొత్తం 68 స్థానాలకు గాను కాంగ్రెస్ పార్టీ 40 స్థానాల్లో విజయం సాధించింది. అధికార భారతీయ జనతా పార్టీ కేవలం 25 స్థానాలు మాత్రమే గెలుచుకుంది. ఇక స్వతంత్రులు మూడు స్థానాలు గెలుచుకున్నారు. ఓట్ బ్యాంకు విషయానికి వస్తే కాంగ్రెస్ పార్టీకి 43.9 శాతం రాగా బీజేపీకి 43 శాతం వచ్చాయి. ఇరు పార్టీల మధ్య ఓట్ బ్యాంకులో అతి స్వల్ప తేడానే ఉన్నప్పటికీ సీట్ల విషయంలో భారీ తేడా కనిపిస్తోంది. చాలా స్థానాల్లో అభ్యర్థులు అతి స్వల్ప మెజారిటీతో గెలిచినట్లు ఫలితాలు చూస్తే తెలుస్తోంది.

Collegium: కొలీజియం వ్యవస్థపై కేంద్రానికి గట్టి సమాధానం ఇచ్చి సుప్రీం కోర్టు