Holi 2024: హోలీ రంగులతో బీ కేర్ ఫుల్.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

దీంతో శ్వాసకోశ, చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలర్జీలు ఉన్నవారు..

Holi 2024: హోలీ రంగులతో బీ కేర్ ఫుల్.. ఈ జాగ్రత్తలు పాటించాల్సిందే..

Holi 2024

హోలీ రంగులు ఎంతో ఆనందాన్నిస్తాయి. రంగులు చల్లుకుంటూ ఎంతో ఉత్సాహంగా పండుగ చేసుకుంటాం. అయితే, సహజ సిద్ధంగా తయారు చేసిన రంగులను కాకుండా చాలా మంది రసాయనాలతో చేసిన రంగులను వాడుతున్నారు. దీంతో శ్వాసకోశ, చర్మం, కళ్లకు సంబంధించిన సమస్యలు తలెత్తే ప్రమాదం ఉంటుంది. అలర్జీలు ఉన్నవారు మరింత జాగ్రత్తగా ఉండాలి. ఆ రంగులు మన శరీరానికి పడకపోతే చర్మానికి సంబంధించిన ఎన్నో సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది.

నేటి మన ఆనందం రేపటి దు:ఖానికి కారణం కాకూడదు. చిన్నారులు ఉన్న కుటుంబాలు ఈ రంగుల పట్ల మరింత అప్రమత్తంగా ఉండాలి. రసాయనాలులేని, సేంద్రీయ రంగులను మాత్రమే వాడాలి. అసహజ రంగులను చల్లుకుంటూ మన ఆరోగ్యానికి హాని కలిగించుకోవద్దు. రంగులు చల్లుకునే ముందు వాటి ప్రభావం చర్మంపై పడకుండా, చర్మానికి కొబ్బరి నూనె రాసుకోవాలి. రసాయన రంగుల నుంచి చర్మాన్ని నూనె కాపాడుతుంది.

చర్మంపై రంగులు పడ్డ తర్వాత దాన్ని శుభ్రంగా కడుక్కోవడానికి కూడా వీలుగా ఉంటుంది. శరీరంపై టాక్సిక్ రసాయనాలు పడితే ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయి. రసాయన రంగుల్లో లెడ్ ఆక్సైడ్ ఉంటే మూత్రపిండాలకు చేటు. రసాయనాలతో తయారు చేసిన రంగుల వల్ల క్యాన్సర్‌ కూడా రావచ్చు. రంగుల్లో ఉండే కొన్ని రసాయనాలు మనకు అస్తమా, ఇతర శ్వాసకోస వ్యాధులను కలగజేస్తాయి. హోలీ ఆడిన అనంతరం సహజ సబ్బులతోనే స్నానం చేస్తే మేలు.

హోలీ రంగులు ఎండలో చల్లుకుంటారు. కాబట్టి ముందుగా సన్‌ స్క్రీన్‌ రాసుకుంటే కూడా మేలు. అలాగే, గోళ్లకు నెయిల్‌ వార్నిష్‌ వాడితే మంచింది. రంగలు చల్లుకునే సమయంలో కాంటాక్ట్‌ లెన్స్‌ వాడకూడదు. చర్మంపై రసాయన రంగుల ప్రభావం పడకుండా, అవి అంటకుండా ఫుల్‌ స్లీవ్స్‌ ఉండే దుస్తులు వేసుకోండి. హోలీ ఆడిన తర్వాత అలర్జీలు వస్తే వైద్యుడిని కలిసి తగిన సూచనలు తీసుకోవాలి. ఆనందాల హోలీని జాగ్రత్తలు పాటిస్తూ జరుపుకుంటే ఎలాంటి ఆరోగ్య సమస్యలూ తలెత్తకుండా చూసుకోవచ్చు.

Holi 2024: ఈ పూలు అందంగా కనిపించడమే కాదు.. రంగుల తయారీలోనూ..