RRR : నగర విధుల్లో సందడి చేసిన “ఆర్ఆర్ఆర్” బ్యూటీ

"ఆర్ఆర్ఆర్" బ్యూటీ ఒలీవియా మోరీస్ హైదరాబాద్ నగరవీధుల్లో సందడి చేశారు. చిరుతిళ్ళు తింటూ ఎంజాయ్ చేశారు. ఎందుకు సంబందించిన ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు

RRR : నగర విధుల్లో సందడి చేసిన “ఆర్ఆర్ఆర్” బ్యూటీ

Rrr

Updated On : August 30, 2021 / 7:05 AM IST

RRR : రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రాల్లో, ప్రముఖ దర్శకుడు రాజమౌళి తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్.. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో జరుగుతుంది. సినిమాలోని కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఇక ఈ సినిమాద్వారా హాలీవుడ్ నటి ఒలీవియా మోరీస్ తెలుగు ప్రేక్షకులకు పరిచయం కానుంది. షూటింగ్ నిమిత్తం హైదరాబాద్ వచ్చిన ఈమె.. హైదరాబాద్ లో చక్కర్లు కొట్టారు.

 

శనివారం సాయంత్రం శిల్పకళావేదికకు వెళ్లారు. అక్కడ ప్రకృతి అందాలు, హస్తకళలకు ముగ్ధులయ్యారు. నగర విధుల్లో చిరుతిళ్ళు తింటూ సందడి చేశారు. ఒలీవియా వెంట ప్రముఖ కాస్ట్యూమ్ డిజైనర్ అనురెడ్డి ఉన్నారు. ఇందుకు సంబందించిన ఫోటోలనుఒలీవియా తన వ్యక్తిగత ఇన్‌స్ట్రాగ్రామ్‌లో షేర్‌ చేశారు. ప్రస్తుతం ఆ ఫోటోలు వైరల్ అయ్యాయి.

 

 

View this post on Instagram

 

A post shared by Olivia (@oliviakmorris)