Diabetes : శరీరంలో షుగర్ వ్యాధి లక్షణాలను గుర్తించటమెలాగంటే!..

గొంతు క్రింద, చంకల్లో నల్లటి రంగులో చర్మంపై ప్యాచెస్ ఏర్పడతాయి. షుగర్ వ్యాధి రావటానికి ముందుగా కనిపించే లక్షణం ఇదే..

Diabetes : శరీరంలో షుగర్ వ్యాధి లక్షణాలను గుర్తించటమెలాగంటే!..

Shugar

Diabetes : మారిన జీవన విధాలతో ఇటీవలి కాలంలో మనదేశంలో షుగర్ వ్యాధి గ్రస్తుల సంఖ్య నానాటికి పెరిగిపోతుంది. చిన్నారుల మొదలు వృద్ధుల వరకు ఈ వ్యాధి బారిన పడుతున్నారు. శారీరక వ్యాయామం లేకపోవటం, ఆహార అలవాట్లు, వంశపారంపర్యత తదితర కారణాల వల్ల డయాబెటిస్ వ్యాధి విస్తరిస్తోంది. శరీరంలో చోటుచేసుకునే కొన్ని లక్షణాల ద్వారా షుగర్ వ్యాధిని ముందుగానే అంచనా వేయవచ్చు.

షుగర్ వ్యాధి మొదలైన వెంటనే శరీరంలోని వివిధ భాగాలపై దాని ప్రభావం చూపిస్తుంది. కళ్ళు బలహీనంగా మారటంతోపాటు,మూత్ర పిండాలపై దాని ప్రభావం ఉంటుంది. చర్మసంబంధిత సమస్యలతోపాటు గుండె జబ్బులు కూడా తలెత్తుతాయి. చక్కెర స్ధాయిలు పెరిగిన సమయంలో తరుచూ మూత్ర విసర్జనకు వెళ్ళాల్సి వస్తుంది. మూత్రం ఎక్కువ పోతుండటంతో ఢీ హైడ్రేషన్ ఏర్పడంతోపాటు చర్మం పొడిబారిపోతుంది.

గొంతు క్రింద, చంకల్లో నల్లటి రంగులో చర్మంపై ప్యాచెస్ ఏర్పడతాయి. షుగర్ వ్యాధి రావటానికి ముందుగా కనిపించే లక్షణం ఇదే.. ఇది కనిపించిందంటే మీ శరీరంలో ఇన్సులిన్ పెరిగినట్లు గుర్తించవచ్చు. చర్మంపై దురుదలు రావటం , మొటిమలు, పసుపు,ఎరుపు , గోధుమ రంగు మచ్చలు ఏర్పడతాయి. ఆదశలో చర్మవైద్యుడిని సంప్రదించి తగిన సూచనలు తీసుకోవటంతోపాటు, షుగర్ లెవల్స్ ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి.

చక్కెర స్ధాయిలు అధికంగా ఉన్నవారిలో రక్త ప్రసరణలో సమస్యలు ఏర్పడతాయి. నరాలు దెబ్బతినటం వల్ల శరీరంపై గాయాలైతే త్వరగా మానవు, ఇలాంటి సమస్యలను గుర్తించిన వెంటనే వైద్యుడిని సంప్రదించటం ఉత్తమం. అతిగా పాలు,పాల ఉత్పత్తులను తీసుకోవటం, తీపిపదార్ధాలు, మానసిక ఆందోళన, స్ధూలకాయం, తదితర కారణాల వల్ల చక్కెర వ్యాధి వస్తుందని నిపుణులు చెబుతున్నారు.