Google Pay Recharge : గూగుల్ పే‌తో మీ జియో, ఎయిర్‌టెల్ నెంబర్లకు రీచార్జ్ చేసుకోండిలా..!

ఈజీ రీచార్జ్ చేసుకునేందుకు డిజిటల్ యాప్స్ రెడీగా ఉన్నాయి. అందులో Google Pay యాప్ ఒకటి.. ఈ యాప్ ను మొబైల్ నెంబర్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటే చాలు.. మీ మొబైల్ నెంబర్ దేనికైనా రీచార్జ్ చేసుకోవచ్చు.

Google Pay Recharge : గూగుల్ పే‌తో మీ జియో, ఎయిర్‌టెల్ నెంబర్లకు రీచార్జ్ చేసుకోండిలా..!

How To Recharge Jio, Airtel, Vodafone Number Via Google Pay

Recharge phone number via Google Pay  : కొవిడ్-19 లాక్ డౌన్ సమయంలో మొబైల్ యూజర్లు ఆఫ్ లైన్ స్టోర్ల నుంచి డిజిటల్ ప్రపంచంలోకి మారిపోయారు. ఆఫ్ లైన్ స్టోర్లవైపు వెళ్లకుండా ఉన్నచోటనే ఆన్‌లైన్ రీచార్జ్ చేసుకోవడం అలవాటు అయిపోయింది. Google Pay, PhonePe, Paytm వంటి డిజిటల్ ప్లాట్ ఫాం యాప్స్ కూడా అందుబాటులోకి రావడంతో మొబైల్ నెంబర్లపై అన్ని ఇతర రీచార్జ్ లు, బిల్ పేమెంట్లు డిజిటల్ లోనే పేమెంట్ చేస్తున్నారు.

ప్రధానంగా మొబైల్ నెట్ వర్క్ ఏదైనా సరే… ఈజీగా రీచార్జ్ చేసుకునేందుకు డిజిటల్ యాప్స్ రెడీగా ఉన్నాయి. అందులో Google Pay యాప్ ఒకటి.. ఈ యాప్ ను మొబైల్ నెంబర్ ద్వారా యాక్టివేట్ చేసుకుంటే చాలు.. మీ మొబైల్ నెంబర్ దేనికైనా రీచార్జ్ చేసుకోవచ్చు. రిలయన్స్ జియో (Reliance Jio), వోడాఫోన్ ఐడియా (Vodafone-Idea), ఎయిర్ టెల్ (Airtel), బీఎస్ఎన్ఎల్ (BSNL) సహా ఏ సర్కిల్ నుంచి అయినా ఈజీగా ఆన్‌లైన్ రీచార్జ్ చేసుకోవచ్చు.

How to recharge phone number via Google Pay :
– గూగుల్ పే (Google Pay) యాప్ మీ స్మార్ట్ ఫోన్ లో ఇన్ స్టాల్ చేసుకోండి.
– గూగుల్ పే యాప్ ఓపెన్ చేయగానే మీ అనేక ఆప్షన్లు కనిపిస్తాయి.
– మీ ఫోన్ స్ర్కిన్ పై New అనే బటన్ ఉంటుంది.. దానిపై క్లిక్ చేయండి.
– Recharge Prepaid Mobile అనే ఆప్షన్ వద్ద Click చేయండి.
– మీ 10 అంకెల మొబైల్ నెంబర్ ఎంటర్ చేయండి.
– Continue ఆప్షన్ పై Tap చేయండి.
– మీ ఫోన్ నెంబర్ ఏదైనా Nickname ఇవ్వండి. భవిష్యత్తులో మళ్లీ రీచార్జ్ చేసుకోవచ్చు.
– రీచార్జ్ కోసం ఏ నెట్ వర్క్ ఆపరేటర్, ఏ సర్కిల్ కావాలో సెలక్ట్ చేసుకోవచ్చు.
– Continue ఆప్షన్ దగ్గర Click చేయండి.
– మీకు నచ్చిన రీచార్జ్ ప్లాన్ ఎంచుకోండి.. లేదంటే అమౌంట్ ఎంటర్ చేయండి.
– Proceed to pay ఆప్షన్ పై Tap చేయండి..
– మీ మొబైల్ నెంబర్ సక్సెస్ ఫుల్ రీచార్జ్ అయిపోతుంది.